Post your question

 

  Asked By: ఉమ

  Ans:

  -  బైపీసీ తరువాత వెటర్నరీ సైన్స్‌/ యానిమల్‌ హజ్బెండరీ కోర్సును మనదేశంలో చేయడమే శ్రేయస్కరం. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌/ సూపర్‌ స్పెషలైజేషన్‌ కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. మీకు డిగ్రీ కోర్సే విదేశాల్లో చదివించాలనే ఆసక్తి ఉంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది. యూకే విషయానికొస్తే యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌ హామ్, యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో, యూనివర్సిటీ ఆఫ్‌ లివర్‌ పూల్, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే, రాయల్‌ వెటర్నరీ కాలేజ్‌లు ఈ కోర్సును అందిస్తున్నాయి. వెటర్నరీ సైన్స్‌ కోర్సు కెనడాలో వెస్టర్న్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ మెడిసిన్, ఓంటారియో వెటర్నరీ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్‌ ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్, యూనివర్సిటీ ఆఫ్‌ కాల్గేరి, యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రియాల్‌లో కూడా ఉంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్‌లాండ్, యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్, లా ట్రోబే యూనివర్సిటీ, ఫెడరేషన్‌ యూనివర్సిటీలు కూడా వెటర్నరీ సైన్స్‌ను అందిస్తున్నాయి. అమెరికా విషయానికొస్తే- పర్డ్యూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనా, కెంట్‌ స్టేట్‌ యూనివర్సిటీ, ఎంఐటీ, ముర్రే స్టేట్‌ యూనివర్సిటీ తదితర సంస్థల్లో ఈ కోర్సు లభ్యమవుతోంది. మీరు ఏదేశంలో, ఏయే యూనివర్సిటీల్లో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకొని, సంబంధిత ప్రవేశ పద్ధ్దతుల గురించి అవగాహన ఏర్పర్చుకొని ముందుకెళ్లండి.

  Asked By: రిషిత

  Ans:

  మీకు ఏ లిటరేచర్‌ అంటే ఇష్టమో చెప్పలేదు. మీకు తెలుగు/ హిందీ లిటరేచర్‌లో ఆసక్తి ఉంటే బీఏ డిగ్రీలో తెలుగు/ హిందీ లిటరేచర్‌ని కానీ, బీఏలో తెలుగు/ హిందీని ఒక మెయిన్‌ ఆప్షనల్‌గా కానీ ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంగ్ల్లిష్‌ లిటరేచర్‌పై ఆసక్తి ఉంటే బీఏ ఇంగ్లిష్‌ ఆనర్స్‌ కోర్సు కానీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సును కానీ ఎంచుకోండి. బీఏ లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులో కూడా ఇంగ్లిష్‌ ఒక మెయిన్‌ కోర్సుగా అందుబాటులో ఉంది. అదేవిధంగా బీఏలో ఇంగ్లిష్‌తో పాటు జర్నలిజం/ సైకాలజీ/ ఎకనామిక్స్‌ లాంటి కోర్సులను కూడా చదివే అవకాశం ఉంది. మీ దీర్ఘకాలిక/ స్వల్పకాలిక అభిరుచి, ఆశయాలను దృష్టిలో పెట్టుకొని మీకు తగిన కోర్సును ఎంచుకోండి.   - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: VENKATA KRISHNA

  Ans:

  * Visit the official website.

  * Go to the result section which appears on the homepage.

  *  After clicking, a new page will open where students will have to enter their hall ticket number

  * After submitting the hall ticket details, then click on get memo.

  * Within a few seconds, the memo will appear on the screen. Candidates can check the details properly and download the TS Inter marks memo.

  Asked By: VENKATA KRISHNA

  Ans:

  * Visit the official website.

  * Go to the result section which appears on the homepage.

  *  After clicking, a new page will open where students will have to enter their hall ticket number

  * After submitting the hall ticket details, then click on get memo.

  * Within a few seconds, the memo will appear on the screen. Candidates can check the details properly and download the TS Inter marks memo.

  Asked By: రిషి

  Ans:

  రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అనేది ఒక ప్రత్యేకమైన కోర్సు. దీన్ని డిగ్రీ స్థాయిలో కాకుండా పీజీ స్థాయిలో కానీ, డిగ్రీ తరువాత సర్టిఫికెట్‌ / డిప్లొమా/ పీజీ డిప్లొమాగా గానీ చేస్తే ఉపయోగకరం. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ లాంటి రంగాల్లో కొంతకాలం పనిచేసిన తరువాత రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేయడం శ్రేయస్కరం. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ కోర్సు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయిలో లేదు. ఇతర రాష్ట్రాల్లోని అతికొద్ది ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును డిగ్రీ స్థాయిలో అందిస్తున్నాయి. మీరు డిగ్రీలో బీబీఏ (బ్యాంకింగ్‌/ ఇన్సూరెన్స్‌/ ఫైనాన్స్‌) లేదా బీకాం చదివి, కొంత ఉద్యోగానుభవం సంపాదించాక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఆర్‌ఎం), హైదరాబాద్‌లో పీజీ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో శిక్షణ పొందినవారికి మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. 

  Asked By: ఆకాంక్ష

  Ans:

  యూకేలో మెడిసిన్‌ కోర్సు చదవాలంటే ఇంటర్మీడియట్‌ (బైపీసీ)లో అత్యుత్తమ ప్రతిభతో పాటు ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలో కనీసం 7 స్కోరు సాధించాలి. ఈ పరీక్షలో ఉన్న నాలుగు సెక్షన్లలో (రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్‌) కనీసం 6.5 స్కోరు రావాలి. లేదా ఐబీ (ఇంటర్నేషనల్‌ బ్యాకలోరియట్‌) పరీక్షలో కనీసం 40 స్కోరు పొందాలి. కొన్ని మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి యూకే క్లినికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ టెస్ట్‌ని ఆన్‌లై న్‌లో నిర్వహిస్తారు. యూకే క్లినికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో వెర్బల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, ఆబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్, డెసిషన్‌ అనాలిసిస్, సిట్యుయేషనల్‌ జడ్జ్‌మెంటుల్లో ప్రశ్నలు ఉంటాయి.
  జర్మనీ విషయానికొస్తే ఇంటర్మీడియట్‌ లో అత్యుత్తమ ప్రతిభతో, ఇంగ్ల్లిష్‌ ప్రావీణ్యంతో పాటు జర్మన్‌ భాషలో కూడా కొంత ప్రవేశం అవసరం. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లపై మంచి పట్టు, మ్యాథ్స్‌ ప్రాథమికాంశాల పరిజ్ఞానం ఉండాలి. వీటితో పాటు కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేక నియామక పద్ధతులను అనుసరిస్తాయి. విదేశీ యూనివర్సిటీల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయాల ప్రామాణికత తెలుసుకోవడానికి ప్రపంచ ర్యాంకింగ్‌ వెబ్‌సైట్‌లను సందర్శించాలి. విదేశాల్లో కూడా పారా మెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు పారా మెడికల్‌ కోర్సును ఏ దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలో చేయాలనుకొంటున్నారో ఆ వర్సిటీ వెబ్‌సైట్‌కు వెళ్లి కావాల్సిన వివరాలను తెలుసుకోండి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: మేఘశ్యామ్‌

  Ans:

  డిగ్రీలో కంప్యూటర్‌కు సంబంధించిన చాలా కోర్సులు చదవాలంటే ఇంటర్‌లో మ్యాథమెటిక్స్‌ చదివి ఉండాలి. మీకు బిజినెస్‌/కామర్స్‌ సబ్జెక్టులపై ఆసక్తి ఉంటే బీకామ్‌ కంప్యూటర్స్‌ కానీ, బీబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కానీ, బీకామ్‌ డేటా సైన్స్‌ కానీ చదవొచ్చు. బిజినెస్‌ అనలిటిక్స్, డేటా సైన్స్‌ కోర్సులు చదవాలంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ లాంటి సబ్జెక్టులపై గట్టి పట్టు ఉండాలి. అలాకాకుండా మీరు బీఎస్సీ డిగ్రీ చదవాలనుకొంటే డిగ్రీలో బయాలజీ, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులతో పాటుగా కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి సబ్జెక్టులు ఉండేలా చూసుకోండి. మీకు డిగ్రీ పూర్తవ్వడానికి మరో మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి, ఈ మూడు సంవత్సరాల్లో డిగ్రీతో పాటు జావా, సీ‡, సీ‡ ప్లస్‌ ప్లస్, పీ‡హెచ్‌పీ‡, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్‌ లాంటి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లను నేర్చుకోండి. వీటితో పాటుగా ఎంఎస్‌ ఎక్సెల్‌లో కూడా నైపుణ్యం సంపాదించండి. మీరు డిగ్రీ చివరి సంవత్సరంలోకి వచ్చాక సీనియర్‌లనూ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నవారినీ సంప్రదించి త్వరగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందాలంటే ఎలాంటి ప్రత్యేక కోర్సులు చేయాలో తెలుసుకొని, వాటిలో శిక్షణ పొందితే మీ లక్ష్యం నెరవేరుతుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: Kadaari

  Ans:

  If you are from sc category then to get a seat in Aiims Delhi you should target  at least 675 marks  in neet according to the year 2021.  It may vary from year to year.

  Asked By: ఇ.తరుణి

  Ans:

  మీరడిగిన కోర్సులు చాలా ఉన్నాయి. ఎంఎస్‌ ఆఫీస్, స్పోకన్‌ ఇంగ్లిష్, బ్యూటీషియన్, ఫొటోగ్రఫీ, నెట్‌వర్కింగ్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, మొబైల్‌ రిపెయిర్, ఈకామర్స్, సోషల్‌ వర్క్, డిజిటల్‌ మార్కెటింగ్, రిటైలింగ్, టాలీ (అకౌంటింగ్‌), యాక్టింగ్, యాంకరింగ్, నెట్‌వర్క్‌ మార్కెటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, యానిమేషన్, మల్టీమీడియా, న్యూట్రిషన్, వెబ్‌ డిజైనింగ్, హోటల్‌ మేనేజ్‌మెంట్, టూరిస్ట్‌ గైడ్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, ఫాషన్‌ డిజైన్, ఇంటీరియర్‌ డిజైన్, యోగా, గ్రాఫిక్‌ డిజైనింగ్, పబ్లిక్‌ రిలేషన్స్, ఇన్సూరెన్స్, ఆర్గానిక్‌ ఫార్మింగ్, స్టాక్‌ మార్కెట్, రియల్‌ ఎస్టేట్‌ లాంటి వాటిగురించి ఆలోచించవచ్చు. ఇంటినుంచే చేయగలిగే ఉద్యోగాల విషయానికొస్తే- పైన చెప్పినవాటిలో శిక్షణ పొందిన తరువాత ఇంటినుండి ఉద్యోగం చేసే అవకాశం ఉన్నవాటిని ఎంచుకోండి. డేటా ఎంట్రీ, కంటెంట్‌ రైటింగ్, ట్రాన్స్‌లేషన్, వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్, గ్రాఫిక్‌ డిజైనింగ్, వర్చువల్‌ అసిస్ట్టెంట్, ప్రూఫ్‌ రీడర్, మెడికల్‌ కోడింగ్, కాపీ రైటింగ్, ఇన్‌కమ్‌ టాక్స్‌ కన్సల్టెంట్, ఆన్‌లైన్‌ ట్యూటర్, వెబ్‌సైట్‌ టెస్టర్‌ లాంటి వాటికి ఇంటి నుంచే పనిచేయొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఇ. తరుణి

  Ans:

  ఇంటర్‌ (ఎంపీసీ) పాసై సీఏలో చేరాను అన్నారు. ఆ ఆలోచన మార్చుకొని మళ్ళీ ఇంజినీరింగ్‌ వైపునకు ఎందుకు వెళ్లాలనుకొంటున్నారో కనీసం మూడు కారణాలు రాసుకోండి. ఆ కారణాలను మీ కుటుంబ సభ్యులతో, మీ శ్రేయోభిలాషులతో పంచుకొని, అవి సహేతుకమైనవో కావో నిర్ధారించుకోండి. ఆపైనే నిర్ణయం తీసుకోండి. సీఏ కోర్సు, ఇంజినీరింగ్‌ కంటే తక్కువేమీ కాదు. ప్రతి సంవత్సరం ఇంజినీర్లు లక్షల్లో మార్కెట్‌లోకి వస్తూ ఉంటే, సీ‡ఏలు మాత్రం కొన్ని వేలమంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. ఇంజినీరింగ్‌ చదివినవారిలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. కానీ, సీఏ కోర్సు చేసినవారికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒకవేళ సీఏ చదవడం కష్టమనిపిస్తే, మీ సీనియర్‌ల సలహాలు తీసుకొని ముందుకెళ్లండి. ముందుగా మీ జీవితం, భవిష్యత్తుపై మీకో స్పష్టత అవసరం. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, జీవితంలో ఎలా స్థిరపడాలనుకొంటున్నారు అనేవి దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌