Post your question

 

    Asked By: విజయ్‌

    Ans:

    నిబంధనల ప్రకారం, ఏ యూనివర్సిటీ అయినా యూజీసీకి చెందిన డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) జారీ చేసే నిర్దేశాలకు లోబడి దూరవిద్య కోర్సులను నిర్వహించాలి. ఈ బ్యూరో నియమావళి ప్రకారం- ఏ యూనివర్సిటీ అయినా దాని భౌగోళిక పరిధిలోనే స్టడీ సెంటర్‌లను నిర్వహించాలి. తదనుగుణంగా వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు సంబంధించిన స్టడీ సెంటర్‌లను రెండు తెలుగు రాష్ట్రాల్లో  క్రమంగా మూసివేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా తెలంగాణలో ఉన్న స్టడీ సెంటర్‌లను 2020 నుంచీ మూసివేసింది. 2013లో యూజీసీ పబ్లిక్‌ నోటీస్‌ ద్వారా యూనివర్సిటీలు/ డీమ్డ్‌ టుబి యూనివర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షల చట్టబద్ధతపై స్పష్టతనిచ్చింది. ఇదే విషయంపై గతంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులు.. యూనివర్సిటీలు ఇచ్చే దూరవిద్య డిగ్రీలు యూజీసీ నిబంధనలకు లోబడే ఉండాలంటూ తీర్పులిచ్చాయి. ఈ విషయంపై కోర్టు తీర్పుల గురించి మరిన్ని వివరాలకోసం ‘ఇండియన్‌ కానూన్‌’ వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2013 నుంచి 2020 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్‌యూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ స్టడీ సెంటర్‌లో చదివి, డిగ్రీ పొందినవారి సర్టిఫికెట్‌లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో చెల్లుబాటు గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు యూజీసీని కోరుతూ లేఖలు రాశాయి. నిర్ణయం వచ్చేవరకు వేచి ఉండకుండా అవకాశం ఉంటే మరో డిగ్రీని యూజీసీ డెబ్‌ నిబంధనలను పూర్తిగా అమలుచేస్తున్న యూనివర్సిటీల దూరవిద్య  ద్వారా చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి.వందన

    Ans:

    పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. ఇంత పోటీని తట్టుకొని ఉద్యోగం సంపాదించాలంటే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం అవ్వాల్సిందే. జనరల్‌ నాలెడ్జ్, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రాంతీయ భౌగోళిక, సామాజిక, సంస్కృతి, వారసత్వం, ఆర్ధికం, కళలు, సాహిత్యం, పాలన విధానాలపై అవగాహన ఏర్పర్చుకోండి. దీంతోపాటు భారత రాజ్యాంగం, భారత భౌగోళిక అంశాలు, భారత ఆర్ధిక వ్యవస్థ, భారత జాతీయోద్యమం అంశాలపై కూడా పట్టు సాధించండి. దైనందిన జీవితంలో సైన్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, అంతర్జాతీయ సంబంధాలు, సమకాలీన సంఘటనలపై కూడా ప్రశ్నలుంటాయి. విజయం సాధించాలంటే రోజుకు కనీసం 8 గంటలు చదవాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంకగణిత/ సంఖ్యా సామర్థ్యాలకు సంబంధించిన సూత్రాలను ఒకచోట రాసుకొని, రోజూ ప్రాక్టీస్‌ చేయండి.
    ఏ  పోటీ పరీక్షలోనైనా సరైన సమాధానాన్ని ఒక నిమిషంలోపే గుర్తించగలిగే సామర్థ్యం ముఖ్యం. సోషల్‌ మీడియాలో వ్యాపించే నెగెటివ్‌ ప్రచారాలకు దూరంగా ఉండండి. ప్రామాణిక పుస్తకాల నుంచి సమాచారాన్ని సేకరించి మీరే సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోండి. మార్కెట్‌లో/ సోషల్‌ మీడియాలో దొరికే స్టడీ మెటీరియల్‌ నాణ్యతను పరిశీలించాకే, దానిపై ఆధారపడండి. ప్రశాంతమైన మనసుతో, ఎలాంటి ఆందోళనకూ గురి అవ్వకుండా పరీక్షకు సన్నద్ధమై మీ లక్ష్యాన్ని చేరుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: kishore kumar

    Ans:

    మీరు నిజామాబాద్‌జిల్లాకు చెందుతారు.  4, 5, 6 తరగతులు కూడా అక్కాకడే చదివారు కాబట్టి, ప్రత్యేకంగా సర్టిఫికెట్‌  అవసరం లేదు . 1, 2, 3 తరగతులకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం నుంచి రెసిడెన్స్‌సర్టిఫికెట్‌తీసుకుంటే సరిపోతుంది.

    Asked By: sujatha

    Ans:

    You can take study certificate from your school itself. If records are not available you can take residence certificate from MRO offfice for that particular period.