• facebook
  • whatsapp
  • telegram

మంచి మార్కులు సాధించాలంటే?

టెట్ కంటెంట్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే పేప‌ర్‌-1, పేప‌ర్-2లో అడిగే ప్ర‌శ్నల‌తోపాటు కింది స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తే ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. 
‣ పేపర్‌-1లోని గణితం, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి అడిగే ప్రశ్నలు అవగాహనను పరీక్షించేలా ఉంటాయి. ఇందుకోసం మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు గల పుస్తకాలు అధ్యయనం చేయాలి.
‣ పేపర్‌-1తో పోలిస్తే పేపర్‌-2లో అడిగే ప్రశ్నలు కఠినస్థాయిలో ఉంటాయి. దీనికిగానూ ప్రధానంగా 6-10వ తరగతి వరకు చదవవలసి ఉంటుంది.
‣ గతంలో టెట్‌-2 రాసి ప్రస్తుతం స్కోరింగ్‌ కోసం ప్రయత్నించేవారు పదో తరగతి వరకే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్‌ స్థాయి వరకు చదవడం ప్రయోజనకరం.
‣ టెట్‌-2 సైన్స్‌ విభాగానికి చెందిన అభ్యర్థులు గణితం, బయోసైన్స్‌, భౌతికశాస్త్ర విభాగాలను చదవాల్సి ఉంటుంది. ఇందులో గణిత అభ్యర్థులు బయోసైన్స్‌పై, బయాలజీ అభ్యర్థులు గణితం, ఫిజికల్‌ సైన్స్‌పై ప్రత్యేక దృష్టిసారించాలి.
‣ సాంఘికశాస్త్ర అభ్యర్థులు భౌగోళికశాస్త్రం, చరిత్రలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ సివిక్స్‌, ఎకనామిక్స్‌ అంశాలను వర్తమానాంశాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి. బోధనా పద్ధతులు (పెడగాజి) సాధారణంగా సైకాలజీ తర్వాత కొంత క్లిష్టమైనదిగా అభ్యర్థులు భావిస్తారు. కానీ దీన్ని ఒక క్రమ పద్ధతిలో అభ్యసిస్తే సగటు అభ్యర్థి కూడా

మంచి మార్కులు సాధించవచ్చు. దీని కోసం...
‣ మొదట పాఠ్యపుస్తకం చదివి ప్రాథమిక భావనలను చక్కగా అర్థం చేసుకోవాలి. 
‣ ప్రాథమిక భావనలతో విషయాన్ని అనుప్రయుక్తం చేసుకుంటూ చదవాలి. 
‣ టెట్‌-1, టెట్‌-2 సైన్స్‌ అభ్యర్థులు శాస్త్ర అంశాల్లో సారూప్యత కలిగిన అంశాలను అనుసంధానం చేసుకుని చదవాలి.

Posted Date : 05-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌