• facebook
  • whatsapp
  • telegram

Verb + Subject Order = Question

Chandan: Is Harish a good player?

                    (హరీష్ మంచి ఆటగాడేనా?)

Chethan: He is, of course. (కచ్చితంగా)

Chandan: Was he your classmate?

                   (అతడు నీ క్లాస్‌మేటా?)

Chethan:Yes, he was.

                  (అవును)

Chandan:: How long has he been here?

                   (ఎంతకాలంగా ఉన్నాడిక్కడతను?)

Chethan: For the past two months.

                       (రెండు నెలలుగా).    

Chandan:: Are you his relative?

                   (నువ్వు అతడికి బంధువా?)

Chethan: No. I am not. But we are close friends. But why are you eager to know all this?

                    (కాదు. కానీ మేం మంచి స్నేహితులం. కానీ ఎందుకంత ఆసక్తిగా అడుగుతున్నావు?)

Chandan:: I like his game very much. The way he handles the ball, and the way he passes are all impressive.

                   (అతడి ఆట తీరు నాకు నచ్చింది. అతడు బంతి వాడే విధానం, దాన్ని అందించే తీరు నిజంగా గొప్ప అభిప్రాయాన్ని కలిగిస్తుంది.)

Chethan:You are a player yourself. You must know. Are you interested in meeting him?

                   (నువ్వూ ఆటగాడివే కదా. నీకూ తెలియాలవన్నీ. అతడిని కలుసుకోవాలనుందా నీకు?)

Chandan:: I am. (అవును)

          పై సంభాషణలోని questions చూడండి. మళ్లీ ఒకసారి ఆంగ్లంలో questions అడిగే తీరు గుర్తు చేసుకుందాం. మామూలు statement అయితే, sub + verb order ఉంటుంది కదా? అదే question అయితే, verb + subject order, అంటే, questionలో ఎప్పుడూ verb ముందూ, ఆ తర్వాత subject వస్తుందనేది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం.
    పై సంభాషణలో questions చూడండి.

1) Is Harish a good player?

    Is (verb) + Harish(subject)...

2) Was he your classmate?

     was (verb) + he (subject) ...

3) How long has he been here?     

          ఇది 'Wh' question, అంటే, 'why, when, what, where, which, who, whose and how' - వీటిల్లో దేంతోనైనా ప్రారంభమయ్యే ప్రశ్న. ఎలాంటి question అయినా, ఎప్పుడూ, subject ముందు verb వస్తోంది కదా? 

4) Are you his relative?

5) Why are you eager to know all this?

     ఇదీ 'Wh' question కదా? ఇందులో కూడా are (verb) + you (sub) రావడం గమనించండి.

6) Are you interested...? ఇది కూడా Are (verb) + you (sub) order ఉన్న question.

NOW LOOK AT THE FOLLOWING QUESTIONS:

Is he coming?

      ఈ question లో subject, 'he'; verb: is coming. This verb has two words in it:

      1) is 2) coming. మనం ఇంతకు ముందు చూశాం కదా- verb లో రెండు, అంతకంటే ఎక్కువ మాటలుంటే మొదటి మాట, Helping verb, మిగతా మాటలన్నీ Main verb అవుతాయని.

Look at this question:

Where is he going?

      ('wh'word) + Helping verb + Sub + Main verb.

'wh' question లో కూడా, రెండు అంతకు మించి మాటలున్నప్పుడు, మొదటి మాట, helping verb, మిగతా మాటలు, main verb అవుతాయి 
  

     'wh' question లో కూడా, subject, Helping verb కూ, main verb కూ మధ్య వస్తోంది కదా? 

            కాబట్టి English లో question అడిగేటప్పుడు గుర్తుంచుకుందాం. 'wh' question లో కానీ, 'non-wh' question లో కానీ, subject ఎప్పుడూ, verb తర్వాత కానీ, Helping verb తర్వాత కానీ వస్తుంది.

Another point. Remember (గుర్తుంచుకోండి.)

             The answer to a 'wh' question is always a statement; the answer to a 'non-wh' question is always begins with 'yes' or 'no'.

e.g.: 1) Is he a good player? (Non-'wh' question)

Ans : Yes/No

e.g.: : 2) Where are you going? ('wh' question)

AnsI am going home (statement).

* పై విషయాన్ని గుర్తుంచుకుని, కింది answers వచ్చేలా questions వేయండి.

e.g.: :కింది ఉదాహరణలు గమనించండి.

Yes, Hyderabad is a big city? 

1) ఈ answer, 'yes'తో ప్రారంభం అవుతోంది కదా? కాబట్టి ఇది, non 'wh' question కు answer. ఆ question.

     Is Hyderabad a big city?

2) No, he was not here yesterday. ఈ answer వచ్చే question కూడా, 'non-wh' question అవుతుంది. 'No' తో మొదలవుతోంది కాబట్టి. ఆ question:

     Was he here yesterday?

3) Srikanth was here last night. ఈ answer, statement. కాబట్టి ఇది answer గా ఉండే question, 'wh' question. ఆ question:

     a) When was Srikanth here?

     b) Where was Srikanth here?

     c) Who was here yesterday?

ముఖ్య విషయం: Statement answer అయితే, అదే statement, పై ఉదాహరణలోలా, ఒక 'wh' questoin కే కాకుండా, రెండు మూడు

                          'wh' questions కు answer కావచ్చు. ఇది కూడా చూడండి.

4) Sita is studying science.

ఇది కూడా statement కాబట్టి, ఇది answer గా వచ్చే question కూడా 'wh' question అవుతుంది. అది 

      a) Who is studying?

      b) What is Sita doing?

      c) What is Sita studying?

పై విషయాలను గుర్తుంచుకుని, కింది answers వచ్చేలా, questions వేయండి. 

      1) Yes, Ramu is my friend.

      2) Surendra will be here tomorrow.

      3) Karim is playing cricket.

      4) No, he cannot sing.

      5) Girija is singing beautifully.

      6) He was wasting money.

      7) Tarun is not on the team because he is ill.

      8) Yes, he can run faster than his brother.

      9) Surekha's father is a landlord.

      10) Sachin is a great cricketer.

      (ఇది చాలా ముఖ్యమైన exercise. Answers ను గమనించి questions అడగండి. రాయడమే కాకుండా, బిగ్గరగా practice చేయండి. మనం questions అడిగే తీరుని బట్టి మనకే మాత్రం English వచ్చనేది తెలుసుకోవచ్చు) మీ answers ను కింద ఇచ్చిన answers తో సరిచూసుకోండి.

1) Is Ramu your friend?

2) ఇది statement కదా? కాబట్టి ఇది answer గా ఉండే questions, రెండు, మూడు ఉండొచ్చు.

      a) Who will be here tomorrow?

      b) When will Surendra be here?

      c) Where will Surendra be tomorrow?

3) ఇది కూడా statement, కాబట్టి it is an answer to more than are question.

      a) Who is playing cricket?

      b) What is Karim playing?

      c) What is Karim doing?

4) Can he sing? (Answer is 'No' - so, it is an answer to a 'Non wh' question)

5)  a) Who is singing beautifully?

      b) How is Girija singing?

      c) What is Girija doing?

6)  a) What was he doing?

      b) What was he wasting?

      c) Who was wasting money?

7)  a) Why is Tarun not on the team?

      b) Who is not on the team and why?

8) Can he run faster than his brother?

9)  a) Who is a landlord?

      b) Whose father is a landlord?

      c) What is Surekha's father?

      (Englishలో ఎవరైనా ఏ ఉద్యోగం చేస్తారనే అర్థంతో, వాళ్లేం చేస్తారు? అని అడగడానికి, what is he/ she doing? అనరు.

      What is he/ she? అంటారు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. 'లేదంటే what does he/ she do (for a living)? అంటాం. అయితే ఇది కొంచెం తక్కువ)

10)  a) Who is a great cricketer?

        b) What kind of cricketer is Sachin?

* ఇప్పుడు ఈ questions ను English లో అడగండి.

        1) అతడిక్కడున్నాడా (ఇప్పుడు)?

        2) సుశీల బాగా పాడగలదా? (can తో ప్రారంభించండి) (can = గల)

        3) రహీం రేపొస్తాడా ఇక్కడికి? (will రేపు (future) కాబట్టి) 

        4) నేను చెయ్యాలా అది? (must/ have to/ should వాడండి) 

        5) సునీల్ ఎప్పుడొస్తాడిక్కడికి? (will-future కాబట్టి) 

        6) ఆ రోజుల్లో అతడు బాగా పాడగలిగేవాడు (గతంలో సామర్థ్యం (గలిగాడు) కాబట్టి could వాడండి) 

        7) అవెక్కడ దొరుకుతాయి? (will, available వాడండి) 

        8) అక్కడ ఎన్ని పుస్తకాలున్నాయి? (How many .... తో ప్రారంభించండి) 

        9) ఆ ప్రదర్శన ఎప్పుడు? (When తో ప్రారంభిస్తాం కదా?) 

        10) నిన్న శంకర్ ఎందుకున్నాడు అక్కడ ?

    ఈ Answers తో సరిచూసుకోండి. (ఈ questions అన్నీ రాయడం కంటే కూడా బిగ్గరగా practice చేయడం ముఖ్యం).

Answers:   1) Is he here now?                  

                   2) Can Suseela sing well?

                   3) Will Rahim come here tomorrow?

                   4) Should I/ must I/ Have I to do it?

                   5) When will Sunil come here?

                   6) He could sing well those days.

                   7) Where are/ will they be available?

                   8) How many books are there?

                   9) When is the show?

                10) Why was Sankar there yesterday?

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌