• facebook
  • whatsapp
  • telegram

Why Were You So Happy Yesterday?

[In the Lesson No. 8 we have learnt that we use the verbs am, is and are for

1) Present states of being and 2) Regular states of being. అంటే I am, he/ she (names in the singular)/ it (anything/ idea in the singular) is and we/ you/ they (names of persons/ things) are for

                  Being now (ప్రస్తుతం ఉండటం)

                  Regular states of being/ being always

                 (క్రమం తప్పకుండా/ ఎల్లప్పుడూ ఉండటం)]

 In this lesson we learn the uses of "was" and "were".

Was and were tell us of past states of being.

అంటే గతం (past) లో ఉండటాన్ని తెలియజేయడానికి Singular subjects తో "was"; Plural subjects తో "were" వాడతాం.    

a) I was there yesterday.

(నిన్న నేను అక్కడ ఉన్నాను) - గతం

b) My book (It - singular) was on the table last night.

నిన్న రాత్రి నా పుస్తకం టేబుల్‌పై ఉంది (Past)

c) Where was he yesterday?

నిన్న (Past) అతడు ఎక్కడ ఉన్నాడు?

d) Why was Sarada (she) here this morning?

(ఈరోజు ఉదయం శారద ఇక్కడ ఎందుకు ఉంది? - (Past))

e) We (plural) were at the party last night (Past).

(మేం నిన్న రాత్రి పార్టీలో ఉన్నాం.)

f) Where were your parents (They - plural) last week (Past)?

( కిందటివారం మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు)?

g) Why were you so happy yesterday (Past)?

( నిన్న నువ్వు చాలా సంతోషంగా ఉన్నావేంటి?)

"Regular states of being", "States of being always" ను తెలియజేయడానికి I తో "am", He/ she/ it తో "is"; we/ you/ they తో "are" వాడతాం కదా!    

అదేవిధంగా Regular actions (క్రమం తప్పకుండా చేసే పనులకు);

Actions done always (ఎల్లప్పుడూ చేసే పనులకు) వాడే verbs ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

Look at the following

A                       B

Come               Comes

Go                    Goes

Write               Writes

Sing                 Sings

పైన A, B ల కింద ఇచ్చిన Verbs ను Regular actions/ Actions done always ను తెలియజేయడానికి వాడతాం.

A లో పేర్కొన్నవాటికి "s" లేదా"es" చేరిస్తే, B లో పేర్కొన్న verbs వస్తాయి.

Note: I, we, you, they (నేను, మనం/మేం, నువ్వు/మీరు, వాళ్లు/అవి)తో A లో పేర్కొన్న verbs వాడతాం. He, she, it (అతడు, ఆమె, అది)తో B లో పేర్కొన్న verbs ను ("_s"/ "_es"చేర్చినవి) వాడతాం.

 

a) Fans (They) give air.

     A fan (It) gives air.

b) I go to movies once a week.

    My sister (She) goes to movies once a week.

c) Planes (They = అవి) fly.

    A plane (It = అది) flies. 

d) Dogs (They) bite.

    A dog (It) bites.    

Fill in the blanks in the following with the proper form of the verb given after the brackets of each pair of sentences.

Answers: i) Planes (They = అవి) carry passengers.

A plane (It = అది) carries passengers.

ii) Trees (They = అవి) give shade.

A tree (It - అది) gives shade.

iii) Mothers (They = వాళ్లు) love their children.

A mother (She = ఆమె) loves her children.

iv) Teachers (They = వాళ్లు) teach.

A teacher (He/ she = ఆమె/ అతడు) teaches.

v) Parents (They = వాళ్లు) take care of their children.

A parent (he/ she = ఆమె/ అతడు) takes care of his/ her children.

 గమనించండి:

I, we, you & they            He, she, it

Come                                   Comes

Go                                        Goes

Walk                                    Walks

Teach                                 Teaches

వీటన్నింటినీ క్రమం తప్పకుండా (Regular actions)చేసే పనులకు వాడతాం. అంటే రోజూ, సాధారణంగా, నిర్ణీత సమయాల్లో చేసే పనులకు వాడతాం.

Note: Come, go, walk etc.,ఇవి Ist Regular Doing Words (I RDWs).

Comes, goes, walks etc., - ఇవి IInd Regular Doing Words (II RDWs)

I get up at 6 everyday.

(నేను రోజూ ఆరింటికి నిద్ర లేస్తాను)

We start for college at 9.

(మేం కాలేజీకి తొమ్మిందింటికి బయలుదేరుతాం - (రోజూ))

You sing well.

(మీరు బాగా పాడతారు - సాధారణంగా) 

You meet him every day.

(నువ్వు రోజూ అతడిని కలుసుకుంటావు)

Kamala (she) sings for movies.

(కమల సినిమాలకు పాటలు పాడుతుంది)

Suman (he) meets me everyday.

(సుమన్ రోజూ నన్ను కలుసుకుంటాడు)

The train (It) arrives here at 10 (Everyday)

( ఆ రైలు ఇక్కడికి పదింటికి చేరుకుంటుంది. (రోజూ)) 

          అంటే Ist Regular Doing Words (I RDWs): go, come, sing, walk etc., I, we, you, they తో; II RDWs(అంటే I RDWs కు, 's', 'es' చేరిస్తే వచ్చేవాటిని) He, she, it తో Regular actions ను తెలపడానికి వాడతాం. అంటే క్రమం తప్పకుండా చేసే పనులకు, ఎప్పుడూ, వృత్తిలో భాగంగా, తరచుగా చేసే పనులకూ వాడతాం.

అదేవిధంగా am/ is/ are ను కూడా ఇప్పుడూ, ఎప్పుడూ ఉండే విషయాలకు వాడతాం.

1) I am a playback singer = I sing for movies.

2) We are teachers of English = We teach English.

3) They are film actors = They act in movies.

4) Mohan (He) is at college at 9 everyday = He comes to college at 9 everyday.

5) Leela (she) is good at studies = She studies well.

6) Electricity (it) is a source of light = Electricity (it) gives us light.     

గమనించాల్సిన విషయం... Am/ is/ are ....ఎప్పుడూ, ప్రస్తుతం, తరచూ ఉండటాన్ని తెలియజేస్తాయి(Present, Regular, Always, Frequent states of Being).

Ist RDW/ IInd RDW ఎల్లప్పుడూ Regular, Frequent actions ను తెలియజేస్తాయి.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌