• facebook
  • whatsapp
  • telegram

 'Wh' Words means  

Snigda: All our friends are here. We can start our programme. 

(మన స్నేహితులందరూ ఉన్నారు. కార్యక్రమం ప్రారంభించవచ్చు.) 

Chitra: Certainly but let's check once again. Is Chandana here?

(తప్పకుండా. అయినా ఒక్కసారి చూసుకుందాం. చందన ఉందా?)

Chandana: I am here of course. Come on. Is Charita coming too?

(నేనిక్కడే ఉన్నా కదా! కానీ, చరిత కూడా వస్తోందా?)

Snigda: Why are you asking? Look. She is standing next to the table.

(ఎందుకు అడుగుతున్నావు? చూడు. తను టేబుల్ పక్కనే నిలబడి ఉంది.)

Chandana: Are you waiting for anyone else, Chitra? Why don't you go ahead and cut the cake? Is n't it getting late?

(నువ్వు ఇంకా ఎవరికోసమైనా చూస్తున్నావా? చిత్రా? కానీ.... కేక్ ఎందుకు కోయడం లేదు? ఆలస్యం కావడం లేదా?)

Who else - ఇక్కడ else = ఇతర/ఇంకా    Who else? ఇంకెవరన్నా;

What else = ఇంకేదైనా,

Why else? = ఇంకెందుకు? / మరే కారణం వల్ల? 

Chitra: All right. No more delay. I am cutting the cake, now itself.

(సరే అయితే. ఇంకేం ఆలస్యం లేదు. ఇప్పుడే కేక్ కోసేస్తున్నా.)

Look at the following sentences

     1) All our friends are here.

     2) She is standing next to the table.

     3) Is Chandana here?

     4) Why are you asking?

    Sentences (1) and (2) ను statements అంటాం. అంటే ఒక విషయాన్ని తెలిపేవి/ చెప్పేవి. ఇప్పుడు statements (1) and (2) లో word order చూద్దాం:

     1) All our friends      are      here. 

               subject           verb

            ఇది statement. ఇందులో word order ఏంటి?

subject ముందూ, verb తర్వాత (subject + verb) వస్తాయి.

     2) She is standing    next to the table

      sub verb

ఇది కూడా statement.  ఇందులో కూడా subject first, verb next కదా. అంటే Englishలో ఏ statementలో అయినా word order:

subject (sub) + Verb (vb).  

ఇంకా వివరంగా చెప్పాలంటే sub+verb word order ఉన్న sentences లన్నీ కూడా statements అవుతాయన్నమాట.

3) Is Chandana here?

ఇది question కదా? దీని word order చూద్దాం: 

Is     Chandana      here?

verb   subject

చూశారా?

Question word order: Verb + subject (statement word order: subject + verb గుర్తుంది కదా?)

అంటే statement word order: sub + verb

question word order: verb + subject. English లో ఇది చాలా ముఖ్యమైన తేడా.

                     Is      India    a big country

దీని word order:    verb      sub

Verb + sub orderలో ఉంది. కాబట్టి ఇది question అవుతుంది. అందుకే sentence చివర question mark (?) పెడతాం. Is india a big country ? ఈ తేడా statement కూ, question కూ మధ్య, బాగా తెలుసుకుని మీ సంభాషణలో ఉపయోగించుకోగలిగితే, మీ Spoken English correct గా ఉంటుంది.

పై సంభాషణ (Conversation) నుంచే ఇంకో question చూద్దాం:

Is Charitha coming?

ఈ question లో Charitha, subject. Is coming, verb కదా? అయితే ఇక్కడి verbలో is, coming అని రెండు మాటలున్నాయి. Verb లో ఇలా రెండు మాటలున్నప్పుడు, మొదటి మాటను Helping Verb (HV) అని, తర్వాతి మాట(ల)ను, Main Verb (MV) అని అంటాం.

             పై question word order:

             Is             Charitha              coming?

             HV    +       sub            +         MV

అంటే question word order రెండు విధాలుగా ఉండొచ్చు.

1) Vb + sub (Are    you    a student?)

             verb     sub

2) HV + sub + MV

(Is + Charitha + coming?)

HV      sub         MV 

గమనించండి: Question లో subject ఎప్పుడూ verb తర్వాత లేదా Helping verb తర్వాత ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. కింది questions చూడండి.

3) What is your name?

     Word order:      'Wh' word + Verb + Sub

4) Why are you asking?

     Word order:      'Wh' word + HV + Sub + MV

     (HV - Helping Verb; MV - Main Verb) 

Qs 3 and 4లో కూడా verb తర్వాత లేదా helping verb తర్వాత subject రావడం చూశారు కదా? అయితే పైన 1, 2 ప్రశ్నలకూ; 3, 4 ప్రశ్నలకూ తేడా గమనించండి. 1, 2 ప్రశ్నలు Verb/ Helping verb తో ప్రారంభమవుతాయి. 3, 4 'Wh' words తో ప్రారంభమవుతున్నాయి కదా?

    'Wh' words అంటే, Wh తో ప్రారంభమవుతాయి. సామాన్యంగా questions అడిగేందుకు వాడే మాటలు:

What = ఏది/ దేన్ని?

When = ఎప్పుడు?

Where = ఎక్కడ?

Which = ఏది? (వస్తువులతో; రెండు అంతకు మించిన వారిలో/ వాటిలో ఏది?)

Why = ఎందుకు?

Who = ఎవరు? ఎవరిని/ ఎవరికి? (ఈ అర్థంతో Whom అని కూడా అంటాం)

Whose = ఎవరి? / ఎవరిది?

పైవన్నీ 'Wh' words.

English లో questions రెండు రకాలు: 

1) 'Wh' words తో ప్రారంభమైన 'Wh' questions. e.g.: Where are you?

2) 'Wh' words లేని 'Non-wh' questions e.g.: Are you an Indian?

                ('Wh' question అయినా Non-wh question అయినా, subject ఎప్పుడూ verb తర్వాత లేదా Helping verb తర్వాత వస్తుందనేది గుర్తుంచుకోవాలి.)

Q: Where is he? ('Wh' question)

A: He is in Hyderabad (Statement)

      చూశారు కదా? 'Wh' questions కెప్పుడూ answer, statement రూపంలోనే ఉంటుంది.

Q: Is he your friend? (Non-wh question)

A: Yes, he is.../ No, he is not...

Non-wh questions కెప్పుడూ answer లో Yes/ No ఉంటుంది.

EXERCISE 

Now, ask questions to get the following answers: (for YES/NO answers, the question is a 'non-wh' question, and for statements, it is 'wh' question)

Q-1: ----- ?

A: Yes, his friends are here

Q-2: ----- ?

A: They are coming tomorrow

Q-3: ----- ?

A: No, Shyam was not here yesterday    

Q-4: ----- ?

A: Yes, Mr. Kiran Kumar Reddy is the CM of A.P.

Q-5: ----- ?

A: Hyderabad is in Andhra Pradesh

Q-6: ----- ?

A: My friend was here yesterday.

Answers to the exercise above. 

Answer 1, Yes తో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది 'Non-Wh' Question.

Q-1: Are his friends here? (Non - Wh)

Answer 2 లో Yes/No లేదు కాబట్టి, ఇది 'Wh' question కావాలి.

Q-2: Who are coming tomorrow? / When are they coming? (Yes/No లేకుండా వచ్చే answer, ఒకటి కంటే, ఎక్కువ questions కు answer కావచ్చు)

Q-3: Was Shyam here yesterday?

Q-4: Is Mr. Kiran Kumar Reddy the CM of AP?

Q-5: Where is Hyderabad?

Q-6: Who was here yesterday? / When was your friend here?

       ఇలా వీలైనన్ని questions మీ friends, brothers and sisters తో practise చేయండి. ఇది చాలా అవసరం.

Q. What was he doing there?

ఈ question లో, was, HV; doing-MV. కదా. దీనికి జవాబు చూడండి.

He was reading a book.

Spoken English నేర్చుకోవడానికి, అంటే English లో ధారాళంగా మాట్లాడాలంటే మీరు చేయాల్సింది: verb conjugation తెలుసుకోవడం. అంటే verb కు, past tense, past participle తెలుసుకోవడం. ఇవి కిందివిధంగా ఉంటాయి. 

        ఈ conjugation తెలిసి ఉండటం చాలా అవసరం. చాలా verbs, past tense, past particple, +ed చేర్చి (Talk, talked, talked) లేదా +d చేర్చి (like, liked, liked) లేదా +t చేర్చి (smell, smelt, smelt) form చేస్తాం.

కొన్ని verbs కు మాత్రం (give, gave, given)

ఒక పద్ధతి లేకుండా (irregular గా) form అవుతాయి. వీటిని నేర్చుకోవడం ముఖ్యం.

ఇవి ఏ grammar book/Oxford, Cambridge, Longman's Dictionaries లో అయినా దొరుకుతాయి. కంఠస్థం చేయండి.

ఇప్పుడు మనం daily life లో ఎక్కువగా వాడే కొన్ని మాటలు (vocabulary) చూద్దాం. 

Parts of the human body

Head, face, eyes, ears, neck, nose, shoulders, fingers, legs లాంటి మాటలు అందరికీ తెలుసు. ఇవి చూడండి.

forehead = నుదురు

eyelids = కనురెప్పలు

eyebrows = కనుబొమ్మలు

eyelash = కనురెప్ప లోపలి భాగం

nose bridge = ముక్కుమీద కళ్లజోడు ఆనేచోటు

right nostril, left nostril = ముక్కు రంధ్రాలు

gums = పంటి చిగుళ్లు

jaw = దవడ

ear lobe = చెవులకు కమ్మలు, రింగులు తగిలించే భాగం

chin = గడ్డం (వెంట్రుకలు లేని)

ribs = పక్క ఎముకలు

spine/backbone = వెన్నెముక

hand = అంటే హస్తం మాత్రమే

wrist = మణికట్టు

arm = మణికట్టు నుంచి భుజాల వరకు ఉండే చేయి

elbow = మోచేయి

forefinger = చూపుడు వేలు

little finger = చిటికెనవేలు

thumb = బొటనవేలు 

stomach = కడుపు/ పొట్ట

waist = నడుము

backside = buttocks = పిరుదులు

lap = ఒడి

knee = మోకాలు

shin = కాలిముందరి భాగం

calf = కాలి వెనుక భాగం

ankle = కాలికి పాదానికీ మధ్య కీలు (చీలమండ)

toes = కాలివేళ్లు

big toe = కాలిబొటనవేలు

heel = మడమ

sole = పాదం అడుగు భాగం

instep = పాదంపైభాగం

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌