• facebook
  • whatsapp
  • telegram

I owe it all to my mother

ఇంగ్లిష్‌లో ఒకే రకంగా ఉండి తికమకపెట్టే జంట పదాలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని పదాల భేదాలను ఉదాహరణల సాయంతో నేర్చుకుందాం!

Raghav: In spite of government controls and NGO's (Non- government organizations) efforts felling of trees goes on and whole forests are hewn off (ప్రభుత్వ నియంత్రణ చర్యలున్నప్పటికీ, ప్రభుత్వేతర సంస్థల ప్రయత్నాలున్నప్పటికీ చెట్లు నరకడం కొనసాగుతూనే ఉంది).

Nakul: Conservationists of all hues have been protesting against the indiscriminate deforestation but to no purpose  (అన్ని రకాల ప్రకృతి వనరుల సంరక్షకులూ విచక్షణరహితంగా అడవులను ధ్వంసం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రయోజనమేమీ కనపడడం లేదు).

Raghav: If it continues our woes will have no end. It will worsen resulting in the earth becoming hotter (ఇలా కొనసాగితే మన బాధలకంతుండదు. అవి ఇంకా తీవ్రమవుతాయి.... భూ ఉష్ణోగ్రత ఎక్కువై).

Nakul: To certain extent environmental degenaration owes to corrupt officials and politicians (కొంతమటుకూ పర్యావరణ క్షీణత మన అవినీతి అధికారుల, రాజకీయవ్యక్తుల వల్ల కూడా).

Raghav: Our first government after shaking off foreign yoke should have given first priority to ending corruption in public life (పరాయిపాలన వదిలించుకున్న తర్వాత మన మొట్టమొదటి ప్రభుత్వం ప్రజాజీవితంలో అవినీతి నిర్మూలనకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఉండాల్సింది).

Nakul: India can never be free from corruption. Can egg yolk be separated from an egg? India and corruption are like an egg and the yolk (భారత్‌కు అవినీతి నుంచి విముక్తిలేదు. గుడ్డు, దాని పచ్చసొన వేరుగా ఉంటాయా? భారత్‌, అవినీతి కూడా అంతే).

Notes: 1. fell = cut down = నరకటం

2. conservationists = (పర్యావరణ) పరిరక్షకులు

3. Indiscriminate = విచక్షణ రహితమైన

4. Deforestation = నిర్వనీకరణ (అడవుల్లోని చెట్లను విచక్షణ రహితంగా నరికేయడం)

5. To no purpose = నిష్ప్రయోజనం

ఈ జంటలు చూడండి

Now look at the following pairs of words from the conversation above:

1) i. hew   ii. hue

2) i. owe   ii. woe

1) i. Hew = cut down something large with a tool = పెద్ద వస్తువును దేన్నయినా పనిముట్లతో నరకడం/ కోయడం

* Hew (present) hewed (past) hewed/ hewn (past participle)

a) Sahadev: (Do) You have a saw mill near your home? (మీ ఇంటి దగ్గర రంపపుకోత పరికరం ఉందా?)

    Bhanu: Yea. That's our whole problem. Till rather late in the night they hew timber logs. Not merely the noise but also the dust and smell of the hewn blocks pollute the whole place (అవును. అదే మా సమస్యంతా. రాత్రి కాస్త పొద్దు పోయేవరకు వాళ్లు దుంగలను కోస్తూ ఉంటారు. ఆ దుమ్మూ, కోసిన దుంగల వాసనా ఆ ప్రదేశాన్నంతా కాలుష్యం చేస్తాయి.

b) Sandhya: Can we never be free from this menace of rising temperatures? (ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రమాదం నుంచి మనం విముక్తి పొందగలమా?)

    Harini: Unless the large scale hewing and felling of huge trees in forests go on we have no hope (పెద్ద మొత్తాన అడవులను నరకడం, కోయడం ఆగేవరకు మనకా ఆశ లేదు).

తేడా: fell = చెట్టు నరికివేయడం; Hew = చెట్ల మానులు కోయడం

ii. Hue = 1. colour/ shade of colour = రంగు/ ఒకే రంగులో ఉండే రకాలు (shade of colour)

                2. A type of opinion/ belief- భిన్న అభిప్రాయాలు/ నమ్మకాలూ

a) Pranav: How did you know he got angry when he didn't say anything? (అతనేం చెప్పనపుడు అతనికి కోపం వచ్చిందని నీకెలా తెలుసు?)

    Ranga: When I said that he was not selected, I saw a reddish hue on his face (అతను ఎంపిక కాలేదని నేను చెప్పినపుడు అతని మొహం ఎరుపెక్కింది).

* Of all hues = of all varieties of opinion (రకరకాల అభిప్రాయాలు)

b) Vasudha: The anti- dowry bill and the women empowerment bill, thank God, were passed unanimously (వరకట్న నిషేధ బిల్లూ, స్త్రీ సాధికారకత బిల్లూ రెండూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి).

(Unanimous = ఏకగ్రీవం)

    Saranya: Yea, Political parties of all hues supported them, sincerely of course, but with an eye on women's votes too (అవును. అన్నిరకాల/ రంగుల రాజకీయపార్టీలూ ఆ బిల్లులను సమర్థించాయి, మనస్ఫూర్తిగానే కాకుండా, స్త్రీల ఓట్ల మీద దృష్టితో కూడా).

2. i) Owe = ఈ పదానికి రెండు, మూడు అర్థాలున్నాయి.

i) Owe = to be in debt = అప్పుండడం

a) He owes me ten thousand rupees = He has to pay me ten thousand rupees (for either borrowing from me/ having taken/ bought something from me

(అతను నాకు పదివేల రూపాయలు బాకీ- నా దగ్గర ఆ మొత్తంలో అప్పు తీసుకున్నందుకు/ నా దగ్గరేమైనా కొనుక్కున్నందుకు/ నా దగ్గర తీసుకున్నందుకు).

2. To feel that you should do some good for somebody because they have done good to you = మనకితరులు చేసిన మంచికి మనం కూడా ప్రతిగా వాళ్లకు ఏదైనా చేయాలనిపించడం.

Kumar: Do you need this book for the exam? Take it then. I've (I have) done with it (పరీక్షకు ఈ పుస్తకం కావాలా, అయితే తీసుకో. నాకు దానితో పనయిపోయింది).

Mohan: Oh, thank you. I need it very much. If I pass the exam, I owe into you (for giving me the book) (ధన్యవాదాలు. అది నాకు చాలా అవసరం. నేను పరీక్ష పాసయితే దీనివల్ల/ నీకు రుణపడి ఉంటాను (పుస్తకం సరైన సమయంలో ఇచ్చినందుకు)

b) Manish: Who do you remember at this hour of success (ఇప్పుడు నీ విజయ సందర్భంలో ఎవరిని గుర్తుకు తెచ్చుకుంటావు?)

    Sunanda: I owe it all to my mother (ఇదంతా మా అమ్మ చలవ/ వల్ల. ఆమెకు రుణపడి ఉన్నాను).

c) India owes its independence to the sacrifices of the freedom fighters = (భారత్‌ తన స్వాతంత్య్రానికి స్వాతంత్య్ర యోధులకు రుణపడి ఉంటుంది).

ii) Woe(s) = బాధలు = troubles and problems (బాధలు, సమస్యలు)

a) Nagaraj: What do you think our woes as a nation due to? (ఒక జాతిగా మన బాధలు, సమస్యలు దేనివల్ల అంటావు?)

   Narendra: Easy to answer. All our woes are due to corruption and a lack of honesty among our leaders (సులభంగా జవాబు చెప్పొచ్చు. మన బాధలు అన్నీ కూడా అవినీతి వల్ల, మన నాయకుల్లో నిజాయతీ లేకపోవడం వల్ల).

b) Rajeev: He is not in good health and hasn't the money for treatment (అతని ఆరోగ్యం బాగాలేదు, వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవు).

   Kishore: His woes are due to his vices and his unwise investments (అతని బాధలన్నీ అతని దురలవాట్ల వల్లా, తెలివిలేని పెట్టుబడుల వల్లా).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.