• facebook
  • whatsapp
  • telegram

డెసిషన్ మే'కింగ్' రిలేష‌న‌ల్ ఆప‌రేట‌ర్లు !

'సీ'లాంగ్వేజి లో వున్న రిలేషనల్ ఆపరేటర్లు బైన‌రీ ఆపరేటర్లు, అవి రెండు operands ను కలిగి ఉంటాయి. ఆ రెండు operands, వేరియబుల్స్ అయినా అవ్వవచ్చు, లేదా constants అయినా కావ‌చ్చు లేదా expressions అయినా కావ‌చ్చు . ఈ రిలేషనల్ ఆపరేటర్ల ఫ‌లితం విలువ స‌త్యం (True) లేదా అస‌త్యం (False) అవుతుంది. దానినే సంఖ్యాపరంగా 1 లేదా 0 (సున్నా) అని చెప్పవచ్చు. అంటే స‌త్యం అయితే 1, అస‌త్యం అయితే 0 అవుతుంది.
గమనిక: సీ లాంగ్వేజిలో ఏదైనా పాజిటివ్ లేదా నెగెటివ్‌ విలువ‌ను logical గా స‌త్యం అనుకుంటుంది, సున్నాను అస‌త్యం అనుకుంటుంది.
'సీ 'లాంగ్వేజి లో ఈ కింద ఇచ్చిన ప‌ట్టిక‌లో రిలేషనల్ ఆపరేటర్లు, వాటి ఉదాహరణలు ఉన్నాయి. ఇందులో A,B విలువ‌ల‌ను 10, 89

ఉదాహరణ: 1
మూడు అంకెలు ఉండే ఒక integerను ఇన్‌పుట్ లాగా తీసుకొని, అది ఇరువైపుల ఒకేవిధంగా వ‌చ్చేపదం (Palindrome) అయితే 1 లేకపోతే 0 అని ప్రింట్ చేసేలా ప్రోగ్రాం రాయండి ?

ప్రోగ్రాం రాసే విధానం
* ఒక సంఖ్యను తిప్పి రాసినా అదే సంఖ్య వ‌చ్చే వాటిని palindrome అని అంటాం.
ఉదా: 292, 393, 22322.
* ఇచ్చిన ప్రశ్న ప్రకారం ప్రోగ్రాంలో మూడు అంకెలు ఉండే సంఖ్యల‌పై మాత్రమే రాయాలి
* మ‌నం ఇచ్చిన నెంబ‌రులోని మొదటి అంకెను 100 తో భాగించి (divide) త‌ర్వాత‌ వ‌చ్చే సంఖ్యను చివ‌రి అంకెతో పోల్చి చూడాలి.
* చివ‌రి అంకె రావాలంటే మ‌నం ఇచ్చిన నెంబ‌ర్‌ని 10తో modulus చేయాలి . రెండు ఒక‌టే అయితే 1 లేకపోతే 0 (సున్నా) వస్తుంది.

ప్రోగ్రాం:
#include
int main()
     {
     int firstdigit, lastdigit, dec, n;
     printf("Enter an integer\n");
     scanf("%d",&n);
     lastdigit=n%10;
     firstdigit=n/100;
     dec=(firstdigit==lastdigit);
     printf("Result=%d\n", dec);
     return (0);
     }

Output:

​​​​​​
* ప్రోగ్రాంలో 387 ఇన్‌పుట్ గా ఇచ్చాం అది palindrome కాదు కాబ‌ట్టి 0 వ‌చ్చింది
మ‌రోసారి ప్రోగ్రాం ర‌న్ చేసి ఇన్‌పుట్‌గా 757 ఇవ్వండి. 757 palindrome కాబ‌ట్టి 1 వ‌చ్చింది.

ఉదాహరణ: 2
విద్యార్థి ప‌రీక్షలో ఒక స‌బ్జెక్ట్‌లో సాధించిన మార్కుల‌ను ఇన్‌పుట్‌గా ఇస్తే పాస్ అయితే మార్కుల‌ ప్రింట్ రావాలి, లేదా 0 (సున్నా) ప్రింట్ చేసే విధంగా ప్రోగ్రాం రాయండి.
గ‌మ‌నిక: ఇక్కడ పాస్ మార్క్స్ 35

ప్రోగ్రాం రాసే విధానం
* దీన్ని సాల్వ్ చేయడానికి, మ‌నం ఒక‌ logic ఉప‌యోగిద్దాం.
(relational expression)*variable
* ఒక రిలేషనల్ ఆపరేటరు ఫ‌లితం విలువ స‌త్యం (True) లేదా అస‌త్యం (False) అవుతుంది. దాన్నే సంఖ్యాపరంగా 1 లేదా 0 అని చెప్పవచ్చు
* ఇచ్చిన విలువ relational expression స‌త్యం అయితే మార్కులు వ‌స్తాయి. అస‌త్యం అయితే 0 వ‌స్తుంది. ఎందుకంటే relational expression ఉండే బ్రాకెట్ విలువ 1 లేదా 0 అవుతుంది.

ప్రోగ్రాం:
#include
int main()
     {
     int dec, n;
     printf("Enter a student marks\n");
     scanf("%d",&n);
     dec=(n>=35)*n;
     printf("Result=%d\n", dec);
     return (0);
     }


ఇచ్చిన మార్కులు 35 కంటే త‌క్కువ‌గా ఉన్నాయి అంటే విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. అందుకే అవుట్‌పుట్ 0 వ‌చ్చింది
ఇప్పుడు ఇన్‌పుట్‌గా 78 ఇవ్వాలి.
* రాసిన ప్రోగ్రాం ప్రకారం ఇచ్చిన మార్కులు 35 కంటే ఎక్కువ‌గా ఉన్నాయి. కాబ‌ట్టి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాడు అప్పుడు అవుట్ పుట్ 78గా ప్రింట్ అవుతుంది.


ఉదాహరణ: 3
ఒక విద్యార్థి ప‌రీక్ష మార్కుల‌ను ఇన్‌పుట్‌గా ఇవ్వాలి. పాస్ అవ్వడానికి క‌నీసం మార్కులు స్థిరంగా 35 కాకుండా, ఎంత ఇస్తే అంత కంటే ఎక్కువ వ‌చ్చాయా లేదా లెక్కించి అత‌ను పాస్ అయ్యాడో లేదో ప్రింట్ చేయాలి ?

ప్రోగ్రాం:
#include
int main()
     {
     int dec, pm, n;
     printf("Enter a student marks\n");
     scanf("%d",&n);
     printf("Enter minimum marks required to pass\n");
     scanf("%d", &pm);
     dec=(n>=pm)*n;
     printf("Result=%d\n", dec);
     return (0);
     }
Output

* ప్రోగ్రాంలో మ‌నం పాస్ మార్కులు 50 అని నిర్ణయిస్తే అత‌డి మార్కులు 50 కంటే త‌క్కువ‌గా వ‌స్తే ఫెయిల్‌ ఎక్కువ వ‌స్తే పాస్ అయిన‌ట్టు ప్రింట్ చేయాలి.
ఇటువంటి ప్రోగ్రాలు పోటీ ప‌రీక్షల్లో క‌ట్ఆఫ్ నిర్ణయించ‌డానికి ఉప‌యోగిస్తారు
ఉదా: ఐబీపీఎస్ ప‌రీక్షలో ప్రతి యేటా క‌ట్ ఆఫ్ మార్కులు మార‌తాయి. ప‌రీక్ష అనంత‌రం 100 క‌ట్ఆఫ్ అని ఇస్తే అంత‌కంటే ఎక్కువ‌గా ఉన్నవాళ్లు పాస్ అయితారు త‌క్కువ వ‌చ్చిన వాళ్లు అర్హత పొంద‌రు.

ఉదాహరణ: 4
ముగ్గురు విద్యార్థులు ఒక స‌బ్జెక్ట్‌లో సాధించిన మార్కుల‌ను ఇన్‌పుట్‌గా ఇచ్చి వారిలో ఎంత మంది పాస్ అయ్యారో లెక్కించి ప్రింట్ చేసే విధంగా ప్రోగ్రాం రాయండి ?
ప్రోగ్రాం రాసే విధానం:
* ఈ ప్రోగ్రాంలో ముందు ముగ్గురు విద్యార్థుల మార్కులు ఇన్‌పుట్ గా తీసుకోవాలి
* వారి మార్కుల‌ను విడివిడిగా 35తో పోల్చిచూడాలి .
* 35 కంటే ఎక్కువ అయితే 1 త‌క్కువ అయితే 0 వ‌చ్చే విధంగా ప్రోగ్రాం రాయాలి.
* వ‌చ్చిన మూడు విలువ‌ల‌ను కూడితే వచ్చే విలువను ప్రింట్ చేయాలి.
ప్రోగ్రాం :

#include
int main()
     {
     int a, b, c, np;
     printf("Enter three students marks\n");
     scanf("%d%d%d",&a,&b,&c);
     np=(a>=35) + (b>=35) +(c>=35) ;
     printf("Number of students passed=%d\n", np);
     return (0);
     }


ఉదాహరణ: 5
ముగ్గురు విద్యార్థులు ఒక స‌బ్జెక్ట్‌లో సాధించిన మార్కుల‌ను ఇన్‌పుట్‌గా ఇచ్చి వారిలో పాస్ అయిన వారి మార్కుల‌ స‌గ‌టు ప్రింట్ అయ్యేలా ప్రోగ్రాం రాయండి ?
గ‌మ‌నిక: పాస్ మార్కు 35
ప్రోగ్రాం రాసే విధానం
* ముందుగా ఎంత మంది విద్యార్థుల పాస్ అయ్యారో గుర్తించేలా ప్రోగ్రాం రాయాలి.
* ప్రతి విద్యార్థి మార్క్స్న ల‌ను 35 తో పోల్చాలి.
*ఎక్కువ అయితే 1 లేకపొతే 0 వస్తుంది. అంటే, పాస్ అయితే 1 లేకపోతే 0 లాగా తీసుకుంటాం. వీటిని కలిపితే ఎంత మంది పాస్ అయ్యారో వస్తుంది.
* ఉదాహ‌ర‌ణ 2 లో రాసిన ప్రోగ్రాం logic ఉప‌యోగించుకొని పాస్ అయిన విద్యార్థుల మొత్తం మార్కులను క‌నుక్కోవాలి.
* అలా వ‌చ్చిన వారి మార్కుల‌ను క‌ల‌పాలి, త‌రువాత ఎంత మంది పాస్ అయ్యారో ఆ సంఖ్యతో మార్కుల‌కు స‌రాస‌రి క‌నుక్కొవాలి
ఉదా ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు పాస్ అయ్యారు. పాస్ అయిన విద్యార్థుల మార్కుల‌ మొత్తం 150 అయితే 150/2 విలువ‌ను లెక్కించాలి

ప్రోగ్రాం :

#include
int main()
     {
     int a, b, c, np, sp;
     float average;
     printf("Enter three students marks\n");
     scanf("%d%d%d",&a,&b,&c);
     np=(a>=35) + (b>=35) +(c>=35) ;
     sp=(a>=35)*a + (b>=35)*b + (c>=35)*c;
     average=sp/(float)np;
     printf("Average marks of passed students=%f\n", average);
     return (0);
     }
Output

ఇప్పుడు 31, 32, 29 ఇన్‌పుట్‌గా ఇవ్వండి . అవుట్‌పుట్ గ‌మ‌నించండి. అంద‌రూ పెయిల్ అయ్యారు కాబ‌ట్టి భాగించే విలువ 0 అవుతుంది something / 0 విలువ‌ను కంప్యూట‌ర్‌ లెక్కించ‌లేదు.


మీరు ఇంకో experiment చేయండి. పైన ఇచ్చిన ప్రోగ్రాంలో typecasting తీసివేసి యావరేజ్ కనుక్కోవడానికి ప్రయ‌త్నించండి. కొన్ని compilers లో devided by zero అనే error రావచ్చు, కొన్నింటిలో మీ ప్రోగ్రామ్ hang అవ్వవచ్చు. ఎందుకంటే 0/0, కంప్యూటరు కూడా ఏమీ చెయ్యలేదు. ఇది మాథ్స్ లాగానే un-determined.

ఉదాహరణ: 6
ముగ్గురు విద్యార్థుల‌ ప‌రీక్ష మార్కుల‌ను ఇన్‌పుట్‌గా ఇవ్వాలి. పాస్ అవ‌డానికి క‌నీసం మార్కులు స్థిరంగా 35 అన‌కుండా, ఎంత ఇస్తే అంత కంటే ఎక్కువ వ‌చ్చాయో లేదో లెక్కించి అత‌డు అర్హత సాధించాడా లేదా గుర్తించాలి , పాస్ అయిన వారి మార్కుల స‌గ‌టును ప్రింట్ చేయాలి ?

ప్రోగ్రాం రాసే విధానం
* ఉదాహ‌ర‌ణ 1,2,3,4,5 అన్ని ప్రోగ్రాంల‌ను ప‌రిశీలించి ఈ ప్రోగ్రాం రాయండి
ప్రోగ్రాం :
#include
int main()
     {
     int a,b,c,np,sp,pm;
     float average;
     printf("Enter three students marks\n");
     scanf("%d%d%d",&a,&b,&c);
     printf("Enter minimum marks to pass\n");
     scanf("%d",&pm);
     np=(a>=pm) + (b>=pm) +(c>=pm) ;
     sp=(a>=pm)*a + (b>=pm)*b + (c>=pm)*c;
     average=sp/(float)np;
     printf("Average marks of passed students=%f\n", average);
     return (0);
     }
Output


Conditional operator (షరతుల ఆపరేటర్లు)

దీన్నే compact if అని కూడా అంటారు. దీన్ని రెండు విధాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చు.
1) (expr) ? expr1: expr2;
2)Variable=(expr)? expr1: expr2;

* మొదటి ప‌ద్ధతిలో , expr స‌త్యం (True) అయితే expr1 రన్ అవుతుంది, లేకపోతే expr2 రన్ అవుతుంది.
* రెండో పద్థతిలో expr స‌త్యం అయితే expr1 రన్ అయి వచ్చిన విలును ఇచ్చిన వేరియబుల్ కు assign చేస్తుంది లేకపోతే expr2 రన్అయి వచ్చిన విలును ఇచ్చిన వేరియబుల్ కు assign చేస్తుంది.

ఉదాహరణ: 7
ఒక విద్యార్థి టెస్ట్ మార్కులు తీసుకొని అత‌డు పాస్ లేదా ఫెయిల్‌ అయినట్లు ప్రింట్ చేసే విధంగా ప్రోగ్రాం రాయండి ?
గ‌మ‌నిక: ఇక్కడ పాస్ మార్కులు 35
ప్రోగ్రాం :

#include
int main()
     {
     int n;
     printf("Enter a student marks\n");
     scanf("%d",&n);
     (n>=35)?printf("Passed\n"):printf("Failed\n");
     return (0);
     }

Output 1
ఇన్‌పుట్‌గా 70 ఇస్తే అవుట్‌పుట్‌


Output 2

ఇన్‌పుట్‌గా 30 ఇస్తే అవుట్‌పుట్‌

ఉదాహరణ: 8
ఒక విద్యార్ధి టెస్ట్ మార్కుల‌ను ఇన్‌పుట్‌గా ఇచ్చి అత‌డు పాస్ అయ్యాడో లేదో ప్రింట్ చేయాలి. ఇక్కడ పాస్ అవ‌డానికి క‌నీసం మార్కులు స్థిరంగా 35 కాకుండా, ఎంత ఇస్తే అంత కంటే ఎక్కువ వ‌చ్చాయో లేదో లెక్కించి అత‌ను పాస్ అయ్యాడో లేదో గుర్తించాలి ?
ప్రోగ్రాం :

#include
int main()
     {
     int n,pm;
     printf("Enter a student marks\n");
     scanf("%d",&n);
     printf("Enter minimum marks needed to pass\n");
     scanf("%d",&pm);
     (n>=pm)?printf("Passed\n"):printf("Failed\n");
     return (0);
     }
Output 1

ఇన్‌పుట్‌గా 70 ఇస్తే అవుట్‌పుట్‌


Output 2

ఇన్‌పుట్‌గా 30 ఇస్తే అవుట్‌పుట్‌

ఉదాహరణ: 9
ఒక విద్యార్థి ఐదు స‌బ్జెక్టుల మార్కులు తీసుకొని అత‌డు పాస్ అయ్యాడో లేదో ప్రింట్ చేయాలి. ఏ ఒక్క స‌బ్జెక్ట్‌లో ఫెయిల్ అయినా ప‌రీక్షలో ఫెయిల్ అయిన‌ట్టు లెక్కించాలి. ?
గ‌మ‌నిక: స‌బ్జెక్ట్ పాస్ మార్కు 35

ప్రోగ్రాం రాసే విధానం
* ప్రోగ్రాంలో ప్రతి స‌బ్జెక్ట్ మార్కుల‌ను 35తో పోల్చాలి.
* అంటే పాస్ అయితే 1 లేదా 0 అవుతుంది.
* పాస్ అయిన స‌బ్జెక్ట్‌ల‌ను కూడితే 5 వ‌స్తే విద్యార్థి ప‌రీక్షలో పాస్ అయిన‌ట్టుగా రావాలి లేదా ఫెయిల్ అని వ‌చ్చేలా ప్రోగ్రాం రాయాలి.

ప్రోగ్రాం:

#include
int main()
     {
     int a, b, c, d, e, np;
     printf("Enter a student marks in five tests\n");
     scanf("%d%d%d%d%d",&a,&b,&c,&d,&e);
     np=(a>=35) + (b>=35) + (c>=35) + (d>=35) + (e>=35);
     (np==5)?printf("Passed\n"):printf("Failed\n");
     return (0);
     }

Output 1
ఇన్‌పుట్‌గా 67, 56, 39, 49, 99
ఇస్తే అవుట్‌పుట్‌


Output 2

ఇన్‌పుట్‌గా 89, 91, 31, 33, 56ఇస్తే అవుట్‌పుట్‌

ఉదాహరణ: 10
ఒక విద్యార్థి ఐదు స‌బ్జెక్టుల మార్కులు తీసుకొని అత‌డు పాస్ అయ్యాడో లేదో ప్రింట్ చేయాలి. ఏ ఒక్క స‌బ్జెక్ట్‌లో ఫెయిల్ అయినా ప‌రీక్షలో ఫెయిల్ అయిన‌ట్టు లెక్కించాలి. పాస్ అవ్వడానికి క‌నీసం మార్కులు స్థిరంగా 35 కాకుండా, ఎంత ఇస్తే అంత కంటే ఎక్కువ వ‌చ్చాయో లేదో లెక్కించి అత‌డు పాస్ అయ్యాడో లేదో గుర్తించి ప్రింట్ చేయాలి
ప్రోగ్రాం:

#include
int main()
     {
     int a,b,c,d,e,np,pm;
     printf("Enter a student marks in five tests\n");
     scanf("%d%d%d%d%d",&a,&b,&c,&d,&e);
     printf("Enter minimum marks required to pass a test\n");
     scanf("%d",&pm);
     np=(a>=pm) + (b>=pm) + (c>=pm) + (d>=pm) + (e>=pm);
     (np==5)?printf("Passed\n"):printf("Failed\n");
     return (0);
     }
Output


ఉదాహరణ: 11

ఒక విద్యార్థి ఐదు స‌బ్జెక్టుల మార్కులు తీసుకొని అత‌డు పాస్ అయ్యాడో లేదో ప్రింట్ చేయాలి. ఏ ఒక్క స‌బ్జెక్ట్‌లో ఫెయిల్ అయినా ప‌రీక్షలో ఫెయిల్ అయిన‌ట్టు లెక్కించాలి. అంతే కాకుండా విద్యార్థి కి వ‌చ్చిన మార్కుల‌ను బ‌ట్టి
First Class ,Second Class, Third Class, Failed , అని కూడా ప్రింట్ చేయాలి?

ప్రోగ్రాం రాసే విధానం
* ప్రోగ్రాంలో ప్రతి స‌బ్జెక్ట్ మార్కుల‌ను 35తో పోల్చాలి.
* అంటే పాస్ అయితే 1 లేదా 0 అవుతుంది.
* పాస్ అయిన స‌బ్జెక్ట్‌ల‌ను కూడితే 5 వ‌స్తే విద్యార్థి ప‌రీక్షలో పాస్ అయిన‌ట్టుగా రావాలి లేదా ఫెయిల్ అని వ‌చ్చేలా ప్రోగ్రాం రాయాలి.
* విద్యార్థి అన్ని పాస్ అయితే 300 కన్నా ఎక్కువ వ‌స్తే ఫ‌స్ట్ క్లాస్ అని, 250 కన్నా ఎక్కువ అయితే సెకండ్ క్లాస్ అని, లేకపోతే థర్డ్ క్లాస్ అని వ‌చ్చేలా ప్రోగ్రాం రాయాలి.
* ఇలా రావ‌డం కోసం ఈ ప్రోగ్రాంలో conditional if లోపల conditional if వాడాలి. ఇలా వాడ‌టాన్నే nesting అని అంటారు.

ప్రోగ్రాం:
#include
int main()
     {
     int a,b,c,d,e,np,s;
     printf("Enter a student marks in five tests\n");
     scanf("%d%d%d%d%d",&a,&b,&c,&d,&e);
     np=(a>=35) + (b>=35) + (c>=35) + (d>=35) + (e>=35);
     (np==5)?((s=a+b+c+d+e)>=300?printf("First Class\n"): ( (s>=250)? printf("Second Class\n"):printf("Third Class\n") ) ):printf("Failed\n");
     return (0);
     }

Output


ఉదాహరణ: 12

ఒక విద్యార్థి ఐదు స‌బ్జెక్టుల మార్కులు తీసుకొని అత‌డు పాస్ అయ్యాడో లేదో ప్రింట్ చేయాలి. ఏ ఒక్క స‌బ్జెక్ట్‌లో ఫెయిల్ అయినా ప‌రీక్షలో ఫెయిల్ అయిన‌ట్టు లెక్కించాలి. అంతే కాకుండా విద్యార్థి కి వ‌చ్చిన మార్కుల‌ను బ‌ట్టి
Class 1
Class 2
Class 3
Failed
అని కూడా ప్రింట్ చేయాలి?
#include
int main()
     {
     int a,b,c,d,e,np,s;
     printf("Enter a student marks in five tests\n");
     scanf("%d%d%d%d%d",&a,&b,&c,&d,&e);

     np=(a>=35) + (b>=35) + (c>=35) + (d>=35) + (e>=35);

     (np==5)?printf("Class %d\n", (4- ((s=a+b+c+d+e)>=300) - (s>=250)-(s>=175) )): printf("Failed\n");
     return (0);
     }

ఈ ప్రోగ్రాం అవుట్‌పుట్‌ను మీరు రన్ చేసి క‌నుక్కోండి.

ఉదాహరణ: 13
ఐదుగురు విద్యార్థులు ఒక స‌బ్జెక్ట్‌లో సాధించిన మార్కుల‌ను ఇన్‌పుట్‌గా ఇచ్చి వారిలో పాస్ అయిన వారి మార్కులు స‌గ‌టు ప్రింట్ అయ్యేలా ప్రోగ్రాం రాయండి ?
దీనిలో ఏ run-time error లేకు0డా రాయాలి.

ప్రోగ్రాం రాసే విధానం
* ఉదాహరణ 5 లో రాసిన ప్రోగ్రాంలో run-time error వ‌చ్చింది. అది రాకుండా ప్రోగ్రాం రాయాలి
* something /0 విలువ రాకుండా జాగ్రత్త ప‌డాలి. అందుకోసం
* స‌గ‌టు లెక్కించేట‌ప్పుడు కొంత‌మంది అయినా పాస్ అయిన వాళ్లు ఉంటేనే division జ‌రిగేట‌ట్లు కండీష‌న్ ఉప‌యోగించాలి. అలా అయితే అంద‌రూ ఫెయిల్ అయితే division జ‌ర‌గ‌దు అప్పుడు something /0 రాదు కాబ‌ట్టి run-time error ఉండ‌దు.
( np విలువ‌ 0 కాకపొతే, స‌గ‌టు కాలిక్యులేట్ చేయాలి. np విలువ‌ 0 కాకపొతే స‌త్యం అవుతుంది. అప్పుడు స‌గ‌టు లెక్కించే విధంగా ప్రోగ్రాం రాయాలి.

ప్రోగ్రాం
#include
int main()
     {
     int a,b,c,d,e,np,sp;
     printf("Enter Five students marks in a test\n");
     scanf("%d%d%d%d%d",&a,&b,&c,&d,&e);
     np=(a>=35) + (b>=35) + (c>=35) + (d>=35) + (e>=35);
     sp=(a>=35)*a + (b>=35)*b + (c>=35)*c + (d>=35)*d + (e>=35)*e;
     (np)?printf("Passed students Average Marks=%f\n", sp/(float)np):printf("All are failed!\n");
     return (0);
     }

Output


ఉదాహరణ: 14
రెండు అంకెలను ఇన్‌పుట్ గా ఇస్తే ఆ రెండు అంకెలు ఒకే రేఖ పై ఉన్నాయో లేదో ప్రింట్ చేసేలా ప్రోగ్రాం రాయండి ?

ప్రోగ్రాం రాసే విధానం
* coordinate geometry కి సంబంధించిన ప్రోగ్రాం.
* ఒక లైన్ సాధార‌ణ రూపం ax+by+c = 0 ఈ ఈక్వేషన్ లో రెండు పాయింట్లను ప‌త‌క్షేపించాలి.దాని విలువ సున్నా వ‌స్తే ఆ రెండు పాయింట్లు లైన్‌పై ఉన్నట్లు లేక‌పోతే లేదు అని వ‌చ్చేలా ప్రోగ్రాం రాసుకోవాలి.
* x, y పాయింట్‌ల‌ను ఇన్‌పుట్‌గా ఇస్తాం
* త‌రువాత లైన్ ఈక్వేషన్ కి సంబంధించిన Parameters a,b,c గా ఇవ్వాలి.
ప్రోగ్రాం :
#include
int main()
     {
     float a,b,c,x,y;
     printf("Enter x and y co-ordinates of the point\n");
     scanf("%f%f",&x,&y);
     printf("Enter coefficients of line\n");
     scanf("%f%f%f",&a,&b,&c);
     ( a*x+b*y+c==0)? printf("On the given Line\n"): printf("Not on the given Line\n");
     return (0);
     }

Output


ఉదాహరణ: 15
రెండు అంకెలను ఇన్‌పుట్ గా ఇస్తే ఆ రెండు అంకెలు ఒకే రేఖ పై ఉన్నాయో లేదో చెప్పటంతో పాటు దాని వాలు (slop) , ఇంట‌ర్‌సెప్ట్‌ (intercept) ల‌ను క‌నుక్కునే విధంగా ప్రోగ్రాం రాయాలి?

ప్రోగ్రాం రాసే విధానం
* ఈ ప్రోగ్రాంలో వాలు , ఇంటర్సెప్ట్ క‌నుక్కొవాలి కాబ‌ట్టి coordinate geometry లోని y=mx+c సూత్రం ఉప‌యోగించుకోవాలి.
* ఇక్కడ పాయింట్లతో పాటు m, c parameters విలువ‌లు ఇవ్వాలి.

ప్రోగ్రాం :
#include
int main()
     {
     float m,c,x,y;
     printf("Enter x and y co-ordinates of the point\n");
     scanf("%f%f",&x,&y);
     printf("Enter slope and intercept of line\n");
     scanf("%f%f",&m,&c);

     ( y==(m*x+c))? printf("On the given Line\n"): printf("Not on the given Line\n");
     return (0);
     }

Output

NB Venkateswarlu
M.Tech(IIT-Kanpur)
Ph.D (BITS),PDF(UK),
Sr.Prof., CSE, AITAM, Tekkal

Posted Date : 02-02-2021 .