• facebook
  • whatsapp
  • telegram

మొద‌టి 'సీ' ప్రోగ్రాం రాద్దాం ...రండి!

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ (Android) , విండోస్ (Windows) అనే పేర్లు తెలియనివారుండరు. వీటన్నింటినీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. వీటిని ఉపయోగించి హార్డ్‌వేర్ ద్వారా మనకు కావాల్సిన పనులన్నింటినీ చేస్తాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను అందరికీ సాధారణంగా (Common) అవసరమైన పనులు చేసేవిధంగా రూపొందిస్తారు.
కొన్నిసార్లు మనకు కొత్త అవసరాలు ఏర్పడతాయి. అలాంటప్పుడు మనకు కావాల్సిన పని కోసం ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేయాలి. దీనికోసమే ప్రోగ్రామింగ్ చేయాల్సి వస్తుంది. ప్రోగ్రామింగ్ చేయడానికి C, C++, java లాంటి కంప్యూటర్ భాషలను ఉపయోగిస్తాము. ఈ లాంగ్వేజీలన్నీ ఆంగ్లభాషకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి మనకేం కావాలో సులభంగానే చెప్పవచ్చు. కానీ కంప్యూటరు బైనరీ సిస్టం (సున్నాలు, ఒకట్లు)పై పనిచేస్తుంది. దీన్ని 'మెషిన్ లాంగ్వేజీ' అంటారు. కాబట్టి మనం పైన పేర్కొన్న లాంగ్వేజీలలో ప్రోగ్రామ్ రాసిన తర్వాత మెషిన్ లాంగ్వేజీలోకి మార్చాల్సి ఉంటుంది. దీనికోసం కంపైలర్ (Compiler) అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. C లాంగ్వేజ్‌కు, java కు వేర్వేరు కంపైలర్లు ఉంటాయి. ఇప్పుడు C లాంగ్వేజీ గురించి నేర్చుకుందాం...
సాధారణంగా ప్రతి లాంగ్వేజీకి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక వాక్యంలో కర్త, కర్మ, క్రియల మాదిరిగా ఒక్కో నియమానికి ఒక్కో ప్రాధాన్యం ఉంటుంది. లాంగ్వేజీ నేర్చుకోవడం అంటే దానికి సంబంధించిన నియమాలను తెలుసుకోవడమే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ఉత్తరం రాసేటప్పుడు మనం To address, From address, Yous sincerely లాంటివి వాడినట్లే, C ప్రోగ్రామ్‌లో మూడు ముఖ్యమైనవాటిని ఉపయోగిస్తాం. అవి:
1) #include బ్లాక్
2) main బ్లాక్
3) function బ్లాక్
ముందుగా Function బ్లాక్ లేకుండా ఉండే చిన్న ది ప్రోగ్రాములను ఎలా రాయాలో తెలుసుకుందాం.
గత 3 దశాబ్దాలుగా చాలా మంది C ప్రోగ్రాములను తయారుచేశారు. మనం వాటిని ఉపయోగించుకొని మన ప్రోగ్రామును రాయాలనుకుంటే, ఆ విషయాన్ని కంపైలరుకు తెలియజేయడానికి కొన్ని లైన్లను రాస్తాం. ఇలాంటివాటిని include బ్లాక్‌లో రాయాలి. ఉదాహరణకు Keyboard నుంచి డేటాను తీసుకోవడానికి, Screen పై విషయాలను రాయడానికి Ready Made Programms అనేకం ఉన్నాయి. వాటిని వాడుకోవడానికి కింది పేర్కొన్నవిధంగా రాయాలి.
# include
అదేవిధంగా, sin, cos, logrithm విలువలను కనుక్కోవడానికి కూడా ready made ప్రోగ్రాములు చాలానే ఉన్నాయి. వాటిని మన ప్రోగ్రామ్‌లో వాడుకోవడానికి # include అని రాయాలి.
main బ్లాక్ ప్రోగ్రామును కిందివిధంగా రాస్తాం.

ఈ main programనే డ్రైవర్ అంటారు. మన ప్రోగ్రామ్ main నుంచి start అవుతుంది. అందువల్ల దీన్ని ప్రోగ్రామ్‌కు Entry Point అంటారు.
ఇప్పుడు run చేస్తే కిందివిధంగా output వచ్చేలా చిన్న సీ ప్రోగ్రామును రాద్దాం.. కావాల్సిన
Output:
Hello Welcome to EENADU Pratibha
Hello
Welcome
to
EENADU
Pratibha
Hello Welcome to EENADU Pratibha
దీని కోసం printf అనే readymade ప్రోగ్రామును ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించుకోవడానికి ముందుగా include రాయాలి. Screenపై ఏదైనా మెసేజ్‌ను రాయాలని printfకు చెప్పాలంటే ఆ మెసేజ్‌ను రెండు double quotes మధ్యలో ఉంచాలి. అదేవిధంగా, వాటిలోపల \t వాడితే Tabగా పనిచేస్తుంది. Next లైనుకి వెళ్లాలంటే \nను ఉపయోగించాలి.
సీ ప్రోగ్రామ్.
#include
int main()
{
printf ("Hello Welcome to EENADU Pratibha \n");
printf ("Hello \n Welcome \n to \n EENADU \n Pratibha \n");
printf ("Hello \t Welcome \t to \t EENADU \t Pratibha\t ");
return (0);
}
Output:

      ఈ ప్రోగ్రామును run చేయడానికి Turbo C/ C++ ను ఎలా వాడాలో తెలుసుకుందాం.Windows desktop పై ఉండే Turbo C/ C++ ఐకాన్‌ను నొక్కితే ఈ సాఫ్ట్‌వేర్ windows వస్తుంది. దీంట్లో కింద సూచించిన కమాండ్లను ఉపయోగించి ప్రోగ్రామింగ్ చేయవచ్చు.
* Compile చేసి run చేయడానికి "Ctr+F9"
* Compile చేయడానికి "Alt+F9"
* Save చేయడానికి "F2"
* ఉన్న ప్రోగ్రామును Load చేయడానికి "F3"
* ప్రోగ్రామ్ నుంచి బయటకు రావడానికి "Alt+X"
* Result స్క్రీన్‌కు వెళ్లడానికి "Alt+F5"
తర్వాతి పాఠాల్లో ప్రాక్టికల్ ప్రోగ్రాములను ఎలా రాయాలో తెలుసుకుందాం...

 

 

 

NB Venkateswarlu
M.Tech,Ph.D, AITAM, Tekkali

Posted Date : 02-02-2021 .