• facebook
  • whatsapp
  • telegram

void టైప్ అంటే ఏమిటి?

ఏదైనా function ఏమీ రిటర్న్ చేయకపోతే దానిని void టైప్ అని అంటారు. ఉదాహరణకు:
void xyz(void) { }.
Example 1: ఈ ప్రోగ్రాంలో ఒక functionను రాసి దానిని main నుంచి call చేస్తున్నాం. రాసిన function ఒక integer(పూర్ణాంకం) తీసుకొని దాని అంకెల మొత్తాన్ని రిటర్న్ చేస్తుంది. ఒక main program దానిని call చెయ్యడం ఎలాగో చూపించడానికి రాశాం.
#include
#include
int sum_of_digits(int n)
{
     int sum = 0;
     while (n > 0)
     {
     sum += n % 10;
     n = n/10;
     }
return sum;
}
int main()
     {
     int n, s;
     printf("Please enter a non-negative integer number\n");
     scanf("%d", &n);
     if(n < 0){
     printf("The number must be non-negative!\n");
     exit( -1);
     }
     s = sum_of_digits(n);
     printf("The sum of digits of %d is %d\n", n, s);
     return 0;
}
పైన ఇచ్చిన ప్రోగ్రాంను రన్ చేసినప్పుడు కంప్యూటరు మీద ఇలా ఉంటుంది.


Example 2: ఒక function ఒక విద్యార్థి మార్కులను తీసుకుని గ్రేడ్ రిటర్న్ చేయాలి. అలాగే, వేరొక function విద్యార్థి గ్రేడ్ తీసుకొని గ్రేడ్ పాయింట్లను రిటర్న్ చేయాలి. main() ప్రోగ్రాం పై రెండింటిని call చేయాలి.

ఎన్ని మార్కులు వస్తే ఏ గ్రేడ్ ఇవ్వాలి? అనేది character variables అనే పాఠంలో రాసిందే ఇక్కడ కూడా వాడుతున్నాం.

#include

char Grade(int n) /* Takes an integer and returns a character */
     {
     return(‘A’ + (4 - n/20) +( n ==100) );
     }
int Points(char g) /* Takes a character and returns integer */
     {
     return(2 * ( 70-g) );
     }
int main()
{
     int m, p;
     char v;
     printf(“Enter a student mark\n”);
     scanf(“%d”, &m);

     v = Grade(m);/* function call*/
     p = Points(v); /* function call*/
     printf(“Marks=%d Grade=%c Points=%d\n”, m, v, p);
     return (0);
}

పైన ఇచ్చిన ప్రోగ్రాంను రన్ చేసినప్పుడు కంప్యూటరు మీద ఇలా ఉంటుంది.


Example 3: ఏదైనా function ఒక character తీసుకొని అది ‘Vowel’ అయితే 1 లేకుంటే 0 రిటర్న్ చేయాలి. ఇక్కడ రెండు విధాలుగా రాశాం. అలాగే main program లో ఒక string ను రీడ్ చేసి దానిలో ఎన్ని ‘Vowels’ ఉన్నాయో పై functionతో కనుక్కొని ప్రింట్ చేస్తాం.

#include
#include

/* Takes a character and returns 1 if it is a vowel. Else returns 0 */
int Isvowel(char V)
     {
     V = toupper(V);
     return((V==‘A’) || (V==‘E’) || (V==‘I’) || (V==‘O’) || (V==‘U’));
     }

(లేదా)
int I is vowel(char V)
      {
     V = toupper(V);
     switch(V)
      {
     case ‘A’ :
     case ‘E’ :
     case ‘I’ :
     case ‘O’ :
     case ‘U’ : return(1);
     default : return(0);
     }
     }
int main()
{
     int i, n = 0;
     char x[20];
     printf(“Enter a string\n”);
     scanf(“%s”, x);

     for(i = 0; x[i] != ‘\0’; i++)
     if(I is vowel(x[i])) n++;
     /* Here, we are x[i], ith character of the string x to check
     whether it is vowel or not. If vowel, n value is
     incremented. Thus, n value is number of vowels. */

     printf(“No of Vowels in the given string=%d\n”, n);
     return (0);
}
పైన ఇచ్చిన ప్రోగ్రాంను రన్ చేసినప్పుడు కంప్యూటరు మీద ఇలా ఉంటుంది.

 

 

 

NB Venkateswarlu
M.Tech(IIT-Kanpur)
Ph.D (BITS),PDF(UK),
Sr.Prof., CSE, AITAM, Tekkali

Posted Date : 03-02-2021 .