• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కమ్యూనిటీ సైన్స్‌లో బీఎస్‌సీ 

ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే కోర్సు.. బీఎస్‌సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌. దీనిలో ప్రవేశాల కోసం ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది! 

గ్రామీణ ప్రజల, రైతుల సంక్షేమం ప్రధాన అజెండాగా ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులు అందిస్తోంది. ఈ యూనివర్సిటీ అందిస్తున్న మరో డిగ్రీ కోర్సు- కమ్యూనిటీ సైన్స్‌. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీ‡ఏఆర్‌) సిఫారసులతో రైతు కుటుంబాలకూ, పల్లె ప్రజలకూ ఉపయోగపడే పాఠ్యాంశాలతో ఈ కోర్సును తీర్చిదిద్దారు. ఐసీఏఆర్‌ 5వ డీన్‌ల కమిటీ సిఫారసుల మేరకు బీఎస్‌సీ (హోంసైన్స్‌)గా వ్యవహరిస్తున్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సును బీఎస్‌సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌గా మార్పు చేశారు. రాష్ట్ట్ర్రంలోని గుంటూరు జిల్లా లాంఫారమ్‌లోని కమ్యూనిటీ సైన్స్‌ కళాశాల ద్వారా ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును అందిస్తున్నారు. 

కోర్సు స్వరూపం

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) అందిస్తున్న వ్యవసాయం, ఉద్యాన శాస్త్రాలతో పాటు డిగ్రీ కోర్సులతో సమానంగా అందిస్తున్న వృత్తివిద్యా కోర్సు కమ్యూనిటీ సైన్స్‌. దీనిలో ఫుడ్‌సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్, అపారెల్‌ అండ్‌ టెక్స్‌టైల్స్, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ సైన్స్, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్, ఎక్స్‌టెన్సన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల పాఠ్యాంశాలతో పాటు ఇంగ్లిష్, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, జనరల్‌ అగ్రికల్చర్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, యోగా కోర్సులను కూడా అభ్యసించాల్సి ఉంటుంది. 

నాలుగో సంవత్సరంలో విద్యార్థులు తాము తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను సమాజంలో అమలుపరిచేందుకు గ్రామీణ పని అనుభవ కార్యక్రమం నిర్వహిస్తారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశపరీక్షల ద్వారా చేరవచ్చు. సామాజిక అధ్యయనం, శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు, పర్యవేక్షణ, వనరుల యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ, అంగన్వాడీ కేంద్రాల మెరుగుపరిచే వివిధ అంశాలను సమర్థంగా నిర్వహించగలిగే పరిజ్ఞానం, నైపుణ్యం సాధించేందుకు ప్రత్యేకించి రూపొందించిన కోర్సు ఇది.

ఎవరు అర్హులు?

బీఎస్‌సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌లో ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీ, డిప్లొమా హºంసైన్స్‌ ఉత్తీర్ణులైన అమ్మాయిలు, అబ్బాయిలు అర్హులు. ఆసక్తి ఉన్నవారు  https://angrau.ac.in/ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, పూరించి ఈనెల 18 లోపు అందేలా పంపాలి. దరఖాస్తులను ‘రిజిస్ట్రార్, ఆడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్, ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, లాం, గుంటూరు- 522034’ చిరుమానాకు పోస్టుద్వారా గానీ, నేరుగా గానీ అందజేయవచ్చని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.గిరిధర్‌ కృష్ణ తెలిపారు. 

- వేణుగోపాల్, న్యూస్‌టుడే, తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం)
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటర్వ్యూకు వెళుతున్నారా?

‣ సులువుగా కనుక్కుందాం!

Posted Date : 13-10-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌