• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఫార్మసీలో మేటి సంస్థలివీ!  


కేంద్ర మానవ వనరుల విభాగానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) 2016 నుంచి పలు విభాగాల్లో విద్యా సంస్థలకు ఏటా ర్యాంకులు కేటాయిస్తోంది. ఈ సారి ఫార్మసీలో జామియా హమ్‌దార్డ్‌ మొదటి స్థానంలో నిలిచింది. 2020, 2019, 2017 ర్యాంకుల్లోనూ ఈ సంస్థ టాప్‌లో మెరిసింది. దేశవ్యాప్తంగా 75 సంస్థలకు ఫార్మసీ ర్యాంకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫార్మసీ కోర్సులు, ప్రవేశ వివరాలతోపాటు జాతీయ స్థాయిలో, తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫార్మా విద్యా సంస్థలేవో తెలుసుకుందాం!

ఔషధాల తయారీలో ఫార్మసిస్టుల సేవలు కీలకం కావడంతో మేటి ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు గిరాకీ ఉంది. ఆసుపత్రులు, ఔషధాల విక్రయాల్లోనూ వీరికి అవకాశాలుంటాయి. ఏదో ఒక అనారోగ్యంతో బాధ పడేవారి సంఖ్య పెరగడం, సీజనల్‌ వ్యాధులు, కొత్త రోగాలు పుట్టుకురావడంతో ఫార్మసీ చదివినవారికి అవకాశాలు ఎప్పుడూ లభిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో వివిధ సంస్థలు ఫార్మసీలో డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి. మేటి సంస్థల్లో ఈ కోర్సులన్నీ లభిస్తున్నాయి. 

ఫార్మసీలో స్పెషలైజేషన్లు పీజీ స్థాయిలో పరిచయమవుతాయి. చాలా సంస్థల్లో 8 స్పెషలైజేషన్లలో నచ్చినది ఎంచుకునే వీలుంది. పేరున్న కొన్ని విద్యా సంస్థలు ఔషధ తయారీ కంపెనీలతో కలిసి పరిశోధన కోర్సులూ అందిస్తున్నాయి. జామియా హమ్‌దార్డ్‌ సన్‌ ఫార్మాతో కలిసి ఫార్మాస్యూటికల్‌ మెడిసిన్‌లో పీహెచ్‌డీ కోర్సు నిర్వహిస్తోంది. పరిశ్రమలతో అవగాహన, పరిశోధనలకు ప్రాధాన్యం, బోధనలో ఉన్నత ప్రమాణాలు తదితర కారణాలతో ఫార్మాస్యూటికల్‌ చదువుల్లో పవర్‌ హౌస్‌గా హమ్‌దార్డ్‌ సంస్థ కొనసాగుతోంది. ఇక్కడ ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు సైతం ఉంది. 

బీఫార్మసీ కోర్సులో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అర్హులు. జాతీయ స్థాయి సంస్థలు జేఈఈ/ నీట్‌ ర్యాంకులతో సీట్లు భర్తీ చేస్తాయి. తగినంత మంది ర్యాంకర్లు లేనట్లయితే కొన్ని సంస్థలు ఇంటర్‌ మార్కుల మెరిట్‌ ప్రకారం అవకాశం కల్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సంస్థలకు ఎంసెట్‌ స్కోరు ప్రామాణికం.

టాప్‌ టెన్‌ విద్యాసంస్థలు ఇవీ

1. జామియా హమ్‌దార్డ్, న్యూదిల్లీ

2. పంజాబ్‌ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌

3. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్, పిలానీ

4. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, మొహాలీ

5. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, ముంబై

6. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, హైదరాబాద్‌

7. జేఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, ఊటీ

8. మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్, ఉడిపి

9. జేఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, మైసూరు

10. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, గాంధీనగర్‌

తెలుగు రాష్ట్రాల్లో ఏ ర్యాంకులు?

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, హైదరాబాద్‌ 6 

ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం 30

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి 44

కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌ 48

శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి 54

రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, అనంతపురం 55

అనురాగ్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ 61

శ్రీ వెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, చిత్తూరు 62

చలపతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్, గుంటూరు 69

విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, నర్సాపూర్‌ 72

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నచ్చినవి ఎంచుకో... స్వేచ్ఛగా చదువుకో!

‣ నవోదయలో నేరుగా తొమ్మిదిలోకి!

Posted Date : 10-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌