• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!

సీఆర్‌పీఎఫ్‌ నియామకాలకు ప్రకటన విడుదల

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ సహకరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 9212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి/ ఐటీఐ పాసైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. మొత్తం 9212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) ఖాళీల్లో పురుషులకు 9105, మహిళలకు 107 కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఖాళీల్లో పురుష అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఉన్నాయి. మహిళా అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌లో 04, తెలంగాణలో 06 ఖాళీలు ఉన్నాయి.  

పురుష అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు: డ్రైవర్‌, మోటార్‌ మెకానిక్‌ వెహికల్‌, కోబ్లర్‌, కార్పెంటర్‌, టైలర్‌, బ్రాస్‌ బ్యాండ్‌, పైప్‌ బ్యాండ్‌, బగ్లర్‌, గార్డెనర్‌, పెయింటర్‌, కుక్‌, వాటర్‌ క్యారియర్‌, వాషర్‌మ్యాన్‌, బార్బర్‌, సఫాయికర్మచారి మొదలైనవి.

మహిళా అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు: బగ్లర్‌, కుక్‌, వాటర్‌ క్యారియర్‌, వాషర్‌ ఉమన్‌, హెయిర్‌ డ్రస్సర్‌, సఫాయికర్మచారి, బ్రాస్‌ బ్యాండ్‌.. మొదలైనవి.

01.08.2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్‌/డ్రైవర్‌ పోస్టుకు మాత్రం 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి దివ్యాంగులు అర్హులు కారు. దరఖాస్తు ఫీజు రూ.100 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎసీ/ఎస్టీ, మహిళా, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. 

ఏ అర్హతలుండాలి?

1. కానిస్టేబుల్‌/ డ్రైవర్‌ పోస్టుకు పదోతరగతి పాసవ్వాలి. హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. రిక్రూట్‌మెంట్‌ సమయంలో నిర్వహించే డ్రైవింగ్‌ టెస్ట్‌ పాసవ్వాలి.

2. మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌ పోస్టుకు పదోతరగతి పాసవ్వాలి. మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌లో రెండేళ్ల ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌ ట్రేడ్‌లో.. మూడేళ్ల జాతీయ లేదా రాష్ట్ర అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

3. ఇతర ట్రేడ్స్‌మెన్‌ పోస్టులకు పదోతరగతి పాసవ్వాలి. సంబంధిత విభాగాల్లో పనిచేసిన నైపుణ్యం ఉండాలి.

4. మేసన్‌/ ప్లంబర్‌/ ఎలక్ట్రీషియన్‌ పోస్టులకు పదోతరగతి పాసవ్వాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. ఐటీఐ సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ)

రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను పీఎస్‌టీ/ పీఈటీ/ ట్రేడ్‌ టెస్టులకు ఎంపికచేస్తారు. పురుష  అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ., మహిళా అభ్యర్థుల ఎత్తు  157 సెం.మీ.ఉండాలి. ఎస్టీ పురుష అభ్యర్థుల ఎత్తు 162.5 సెం.మీ., మహిళా అభ్యర్థుల ఎత్తు 150 సెం.మీ. ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ సైజు 80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి. ఎస్టీ అభ్యర్థుల ఛాతీ సైజు 76 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి. రాత పరీక్షలో ఎంపికైన ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు పీఎస్‌టీ/ పీఈటీలో పూర్తి  సడలింపు ఉంటుంది. అయితే ట్రేడ్‌టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌లో మాత్రం ఎంపికవ్వాలి.

ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ)

కానిస్టేబుల్‌/ డ్రైవర్‌, మోటార్‌ మెకానిక్‌ వెహికల్‌, గార్డెనర్‌, పెయింటర్‌, కార్పెంటర్‌, బ్రాస్‌ బ్యాండ్‌, పైప్‌ బ్రాండ్‌, కోబ్లర్‌, టైలర్‌ అండ్‌ బగ్లర్‌ విభాగాలకు చెందిన పురుష అభ్యర్థులు 5 కి.మీ.ల పరుగును 24 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళా అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 8.30 నిమిషాల్లో పూర్తిచేయాలి.

కానిస్టేబుల్‌/ కుక్‌, వాటర్‌ క్యారియర్‌, బార్బర్‌ అండ్‌ హెయిర్‌ డ్రెస్సర్‌, వాషర్‌మేన్‌ అండ్‌ వాషర్‌ ఉమన్‌, సఫాయి కర్మచారీ విభాగాలకు చెందిన పురుష అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళా అభ్యర్థులైతే 1.6. కి.మీ దూరాన్ని. 12 నిమిషాల్లో ముగించాలి. పరుగులో అర్హత సాధించలేని అభ్యర్థులను నియామక ప్రక్రియ నుంచి తొలగిస్తారు.

ట్రేడ్‌ టెస్ట్‌

సీబీటీ, పీఎస్‌టీ, పీఈటీలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ 50 మార్కులకు ఉంటుంది. దీంట్లో అభ్యర్థులు 20 మార్కులు పొందాలి. సంబంధిత విభాగాల్లో అభ్యర్థులకు ఉండే పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఈ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీంట్లో అర్హత సాధించినవాళ్లను డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, డీటెయిల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)

ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలుంటాయి. పార్ట్‌-ఎలో జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌కు 25 మార్కులు. పార్ట్‌-బిలో జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌కు 25 మార్కులు, పార్ట్‌-సిలో ఎలిమెంటరీ మేథమెటిక్స్‌కు 25 మార్కులు, పార్ట్‌-డిలో ఇంగ్లిష్‌/హిందీ భాషకు 25 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు.

ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/ హిందీ భాషల్లో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులు తగ్గిస్తారు. పరీక్ష తేదీ, కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని సీఆర్‌పీఎఫ్‌ వెబ్‌సైట్‌లోని అడ్మిట్‌కార్డ్‌ ద్వారా తెలియజేస్తారు. సీబీటీలో అడిగే ప్రశ్నలన్నీ మెట్రిక్యులేషన్‌ స్థాయిలో ఉంటాయి. సీఆర్‌పీఎఫ్‌ వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌ లింక్‌ అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగించుకుని అభ్యర్థులు తమ సన్నద్ధతను మెరుగుపరుచుకోవచ్చు.

ప్రశ్నలు ఏ అంశాల నుంచి?

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: నాన్‌-వెర్బల్‌ ప్రశ్నల ద్వారా అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అనాలిసిస్‌, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్‌, స్పేషియల్‌ విజువలైజేషన్‌, స్పేషియల్‌ ఓరియంటేషన్‌, విజువల్‌ మెమరీ, డిస్‌క్రిమినేషన్‌, అబ్జర్వేషన్‌, రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్స్‌, అరిథ్‌మెటికల్‌ రీజనింగ్‌, ఫిగరల్‌ క్లాసిఫికేషన్‌, అరిథ్‌మెటిక్‌ నంబర్‌ సిరీస్‌, నాన్‌-వెర్బల్‌ సిరీస్‌, కోడింగ్‌ అండ్‌ డీకోంగ్‌.. మొదలైనవి ఉంటాయి.

జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నల ద్వారా పర్యావరణం మీద అభ్యర్థికి ఉండే పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వర్తమానాంశాల మీద అభ్యర్థికి ఉండే పట్టునూ పరీక్షిస్తారు. క్రీడలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనమిక్‌ సైన్స్‌, జనరల్‌ పాలసీ, భారత రాజ్యాంగం, సైంటిఫిక్‌ రిసెర్చ్‌ మొదలైన అంశాల మీద ప్రశ్నలు వస్తాయి. వీటిని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఉండదు. రోజూ వార్తాపత్రికలను చదవడం వల్ల జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలపై పట్టును సాధించవచ్చు.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌: ఈ పేపర్‌లో నంబర్‌ సిస్టమ్స్‌, కంప్యుటేషన్‌ ఆఫ్‌ హోల్‌ నంబర్స్‌, డెసిమల్స్‌ అండ్‌ ఫ్రాక్షన్స్‌ అండ్‌ రిలేషన్‌షిప్స్‌, ఫండమెంటల్‌ అరిథ్‌మెటికల్‌ ఆపరేషన్స్‌, పర్సంటేజెస్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, యావరేజెస్‌, ఇంటరెస్ట్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, డిస్కౌంట్‌, మెన్సురేషన్‌, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌, రేషియా అండ్‌ టైమ్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

ఇంగ్లిష్‌/ హిందీ: దీంట్లో ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో అభ్యర్థికి ఉండే ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.

గమనించండి!

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 27.03.2023

దరఖాస్తుకు చివరి తేదీ: 25.04.2023

సీబీటీ అడ్మిట్‌ కార్డ్‌ జారీ: 20.06.2023 నుంచి 25.06.2023 వరకు

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: 01.07.2023 నుంచి 13.07.2023 వరకు

వెబ్‌సైట్‌: http://www.crpf.gov.in 
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!

‣ ఎన్‌ఎఫ్‌సీలో కొలువులు

‣ ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్‌ ఉద్యోగాలు

‣ ఐఐటీలో న్యాయవిద్య

‣ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు నెట్‌!

‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు

‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఇవే!

Posted Date : 22-03-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌