• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

1411 ఖాళీల‌తో ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

దిల్లీ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌  కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోపాటు హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. పూర్తి వివరాలు...

విభాగాలవారీ ఖాళీలు: ఓపెన్‌ 604, ఓబీసీ 353, ఈడబ్ల్యుఎస్‌ 142, ఎస్సీ 262, ఎస్టీ 50. మొత్తం 1411 ఉన్నాయి. వీటికి పురుషులే అర్హులు. 

అర్హత: 10+2 (సీనియర్‌ సెకండరీ)/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. హెవీ మోటర్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. దీంతోపాటుగా వాహనాల నిర్వహణపై తగిన పరిజ్ఞానం అవసరం. 

వయసు: జులై 1, 2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. 02.07.1992 -01.07.2001 మధ్య జన్మించినవారై ఉండాలి. గరిష్ఠ వయసు పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలినవారు రూ.100 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. 

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్యం, కొలతల పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

పరీక్ష: ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులను తగ్గిస్తారు. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో అడుగుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ 20, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 20, న్యూమరికల్‌ ఎబిలిటీ 10, రోడ్‌సెన్స్, వెహికల్‌ మెయింటెనెన్స్, ట్రాఫిక్‌ రూల్స్‌/సిగ్నల్స్, వాహన, పర్యావరణ కాలుష్యం (పెట్రోల్‌ అండ్‌ డీజిల్‌ వెహికల్, సీఎన్‌జీ ఆపరేటెడ్‌ వెహికల్, శబ్ద కాలుష్యం) మొదలైన అంశాల్లో 50 ప్రశ్నలు ఉంటాయి. 

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. 

ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌: పరీక్షలో అర్హత సాధించినవారికి పరుగుతోపాటు లాంగ్‌జంప్, హైప్‌జంప్‌లు నిర్వహిస్తారు. 1600 మీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో చేరుకోవాలి. లాంగ్‌ జంప్‌లో 12 1/2 అడుగుల దూరానికి దూకాలి. హైజంప్‌లో 3 1/2 అడుగుల ఎత్తుకు ఎగరాలి. లాంగ్‌జంప్, హైజంప్‌లో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడానికి మూడు అవకాశాలు ఇస్తారు. ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌లో అర్హత పొందినవాళ్లకు ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు కనీసం 170 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 81 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు 4 సెం.మీ. విస్తరించాలి.

ట్రేడ్‌ టెస్ట్‌: ఫిజికల్‌ ఎండ్యూరెన్స్, మెజర్‌మెంట్‌ టెస్టులు పాసైన అభ్యర్థులను ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ పరీక్షలో 50 మార్కులకు కనీసం 25 సాధించాలి. హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఇందులో కనీసం 25 మార్కులు సాధించాలి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌/రోడ్‌సెన్స్‌/ ప్రాథమిక డ్రైవింగ్‌ రూల్స్‌కు సంబంధించిన పరీక్షను 25 మార్కులకు నిర్వహిస్తారు. కనీసం 12.5 మార్కులు పొందాలి. వాహనాల నిర్వహణ పరిజ్ఞానానికి సంబంధించిన పరీక్షకు 25 మార్కులు కేటాయించారు. దీంట్లో కనీసం 12.5 మార్కులు సాధించాలి. పీఈ అండ్‌ ఎంటీ, ట్రేడ్‌ టెస్ట్‌లను దిల్లీలోనే నిర్వహిస్తారు. వీటిల్లో ప్రతిభ చూపిన అభ్యర్థుల తుది జాబితాను దిల్లీ పోలీస్‌ వెబ్‌సైట్‌  https://delhipolice.nic.in/ లో అందుబాటులో ఉంచుతారు.  

వేతనం: విధుల్లో చేరినవారికి మూల వేతనం (లెవెల్‌-3) రూ.21,700 అందుతుంది. ఆలవెన్సులతో సుమారు రూ.40 వేలు పొందవచ్చు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 29.07.2022

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: అక్టోబరు, 2022లో ఉంటుంది. 

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

‣ న‌వ్విస్తే జీతం ఇస్తారు!

‣ శిక్ష‌ణ లేదు సొంత నోట్స్‌తో సాధించా!

‣ ఏదైనా ఎక్స్‌ట్రా చేయండి!

‣ పీజీసెట్‌కి సిద్ధమేనా?

Posted Date : 15-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌