• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విద్యా రుణాల వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంత?

భార‌త్‌లో రూ. 50 ల‌క్ష‌లు.. విదేశాల్లో అయితే రూ. 1 కోటి వ‌ర‌కు

ఉన్న‌త విద్య కోరుకునే వారికి 6.70% వ‌డ్డీ రేటు నుండే విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయి. మీకు మంచి విద్యార్హ‌త‌లు ఉండి, ఉన్న‌త విద్య చ‌ద‌వ‌డానికి అర్హ‌త పొందితే దేశంలో, విదేశాల‌లోని ప్ర‌ముఖ సంస్థ‌ల‌లో చ‌దువుకోడానికి విద్యా రుణం కోసం బ్యాంకుల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. భార‌త్‌లో విద్యాభ్యాసం చేస్తే రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు, విదేశాల‌లో అయితే రూ. 1 కోటి వ‌ర‌కు మొత్తాన్ని విద్యా రుణంగా పొందేందుకు అర్హులు.

విద్యా నేప‌థ్యం, త‌ల్లిదండ్రుల ఆదాయం, మంచి క్రెడిట్ స్కోర్ మీ రుణ అర్హ‌త‌ను నిర్ణ‌యించ‌డంలో కీల‌క‌మైన అంశాలు. భార‌త్‌లో ఖ‌రీదైన వ్య‌వ‌హారాల‌లో ఉన్న‌త విద్య ఒక‌టి. దేశం లోప‌ల‌, వెలుప‌ల ఉన్న ప్ర‌ఖ్యాత విద్యా సంస్థ‌ల్లో చేర‌డానికి చాలా కృషి, న‌గ‌దు కూడా అవ‌స‌రం. బ్యాంకులు ఉన్న‌త విద్య‌కు రుణ‌ స‌హాయం చేయ‌డానికి కృషి చేస్తున్నాయి. అనేక బ్యాంకులు విద్యార్ధుల కెరీర్ వృద్ది, తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం ఉన్న అర్హ‌త క‌లిగిన విద్యార్ధుల‌కు రుణాల‌ను అందిస్తున్నాయి. 

డాక్యుమెంటేష‌న్ ప్ర‌క్రియ కూడా క‌నిష్టంగా ఉండేలా బ్యాంకులు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. త‌ద్వారా విద్యార్ధులు ఎటువంటి అవాంత‌రాలు లేకుండా విద్యా రుణాల‌ను పొంద‌వ‌చ్చు. బ్యాంకులు కూడా నిజ‌మైన విద్యార్ధుల‌కు మాత్ర‌మే రుణాల‌ను మంజూరు చేసేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. వివిధ బ్యాంకులు నిర్ణ‌యించిన ప్ర‌మాణాల‌ను బ‌ట్టి విద్యా రుణాల‌ను ఆమోదించే ప్ర‌క్రియ మార‌వ‌చ్చు.

రుణాన్ని తిర‌స్క‌రించ‌కుండా ఉండ‌టానికి విద్యా రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసేట‌పుడు మీ విద్యా పత్రాలు అన్నీ ద‌గ్గ‌ర ఉంచుకోవ‌డం చాలా కీల‌కం. అడ్మిష‌న్ వివ‌రాలు, స‌ర్టిఫికెట్లు, ప్ర‌వేశ ప‌రీక్ష స్కోర్లు మొద‌లైన మీ గ‌త‌, ప్ర‌స్తుత విద్యా సంస్థ‌ల నుండి అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను సేక‌రించి పెట్టుకోవ‌డం చాలా అవ‌స‌రం.

అర్హ‌త‌లు

భార‌తీయ బ్యాంకుల నుండి విద్యా రుణం పొంద‌డానికి మీరు త‌ప్ప‌నిస‌రిగా భార‌తీయులై ఉండాలి. మీ వ‌య‌స్సు 18-35 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. మీ త‌ల్లిదండ్రుల ఆదాయం స్థిర‌మైన‌ది అయి ఉండాలి. మీరు ఎక్క‌డ చ‌దువుకుంటార‌ని అనుకుంటున్నారో ఆ విశ్వ‌విద్యాల‌యం దేశంలో ఉన్నా విదేశాలలో ఉన్నా కూడా ప్ర‌భుత్వంచే గుర్తించ‌బ‌డాలి. ఈ నిబంధ‌న‌లు, ష‌ర‌తులు బ్యాంకుని బ‌ట్టి మార‌వ‌చ్చు. కాబ‌ట్టి మీరు విద్యా రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసే ముందు మొత్తం ప్ర‌క్రియ‌ను చెక్‌ చేయ‌డం ముఖ్యం.

విద్యార్ధులు వారి కోర్సు వ్య‌వ‌ధి ముగిసిన త‌ర్వాత రుణ చెల్లింపు ప్రారంభించ‌వ‌చ్చు. విద్యార్ధుల‌కు రుణ చెల్లింపు స‌మ‌యం త‌గినంత ఉంటుంది. 8 ఏళ్ల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80ఈ కింద విద్యా రుణం వ‌డ్డీని ప‌న్ను మిన‌హాయింపులుగా క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. దీని కోసం, మీ బ్యాంకు నుండి స‌ర్టిఫికేట్ అవ‌స‌రం.

7 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధికి రూ. 10 ల‌క్ష‌ల విద్యా రుణానికి వ‌డ్డీ రేట్లు, ఈఎంఐలు ఈ క్రింద పట్టిక‌లో ఉన్నాయి.

ఈ డేటా 23 ఫిబ్ర‌వ‌రి, 2022 నాటిది.

గ‌మ‌నిక

రూ.  10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణంపై బ్యాంకులు అందించే అత్య‌ల్ప వ‌డ్డీ రేటు ప‌ట్టిక‌లో ఇవ్వ‌బ‌డింది. ఈఎంఐ 7 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో, రూ. 10 ల‌క్ష‌ల రుణం కోసం టేబుల్‌లో పేర్కొన్న వ‌డ్డీ రేటు ఆధారంగా లెక్కించ‌బ‌డుతుంది. రుణ ఈఎంఐలు తెల‌ప‌డానికి సూచికంగా రుణం రూ. 10  ల‌క్ష‌లుగా ఇవ్వ‌డం జ‌రిగింది, అవ‌స‌రాన్ని బట్టి ఎక్కువ కూడా ఇవ్వ‌బ‌డుతుంది. బ్యాంకు నియ‌మ‌ నిబంధ‌న‌లు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ‌డ్డీ రేట్ల‌లో మార్పులుండ‌వ‌చ్చు. ఈఎంఐలో ప్రాసెసింగ్ ఫీజు గాని, ఇత‌ర ఛార్జీలు గాని క‌ల‌ప‌బ‌డ‌లేదు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ క్యాంపస్‌ కొలువు కొట్టాలంటే?

‣ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

‣ నిరుద్యోగులకు రైల్వే ఉచిత శిక్షణ

‣ మర్యాదలకూ మేనేజర్లు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌