• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జ్ఞాపకశక్తీ... ఏకాగ్రతా పెర‌గాలంటే?

పరీక్షల ముందు రెట్టింపు ఉత్సాహంతో, ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి! ఆ ఆకాంక్షను ఈ పోషకాహారంతో నిజం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందామా?

మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, చురుగ్గా పనిచేయడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతో తోడ్పడతాయి. అంతేకాదు జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను పెంచడానికీ¨, కుంగుబాటును తగ్గించడానికీ సహాయపడతాయి. ఇవి సాల్మన్, ట్యునా చేపలు, అవిసె, చియా గింజలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. 

తృణధాన్యాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. బ్రౌన్‌రైస్, తృణ ధాన్యాలు, చిరుధాన్యాల్లోని విటమిన్‌-బి నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు శక్తిని పెంచుతుంది. ఎక్కువ గంటలపాటు చదివినా విద్యార్థులు అలసిపోకుండా ఉండాలంటే వీటిని తీసుకోవడం మంచిది. 

జ్ఞాపకశక్తి పెరిగి, ఇనుము, విటమిన్‌-ఎ, డి, ఇ, బి-12 శరీరానికి అందాలంటే గుడ్డు తినడం మర్చిపోవద్దు. పరీక్షల సమయంలో ఆరోగ్యంగా, బలంగా, చురుగ్గా ఉండాలనుకుంటే ఉడికించిన గుడ్డును తినడం అలవాటు చేసుకోవాలి. 

నేర్చుకోవడం, ఆలోచనా సామర్థ్యం, తార్కికంగా ఆలోచించడం, జ్ఞాపకశక్తి, సమస్యా పరిష్కార నైపుణ్యం లాంటి మానసిక సామర్థ్యాలు పెరగాలంటే.. ఎరుపు, ఆరెంజ్, పచ్చ రంగుల్లోని కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. 

వీటితోపాటు కాస్త నీరసంగా అనిపించినప్పుడు డార్క్‌చాక్లెట్‌ను నోట్లో వేసుకోవడం మర్చిపోవద్దు. ఇది రక్తపోటును నియంత్రించడమే కాకుండా మెదడుకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది. 


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌