• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరిశోధన సంస్థలో అవకాశాలు


 

న్యూదిల్లీలోని స్వయంప్రతిపత్తి గల పరిశోధన సంస్థ.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్టు పద్ధతిలో రెండేళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. 

పోస్టులను బట్టి రాత/ స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. 

1. సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-1: డిగ్రీ పాసై.. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా ఐదేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. బీ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసినవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 45 సంవత్సరాలు. 

2. రిసెర్చ్‌ ఆఫీసర్‌-1: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీఈ/ బీటెక్‌/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. 
లేదా  బీ ఎంసీఏ ఉత్తీర్ణులై మూడేళ్ల అనుభవం ఉండాలి. బీ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఎంఎస్సీ చేసి.. మూడేళ్ల అనుభవం సంపాదించాలి. బీ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీఎస్సీ పూర్తిచేసి.. ఆరేళ్ల అనుభవం ఉండాలి. బీ నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్, ఫైర్‌వాల్, సర్వర్‌ అడ్మినిస్ట్రేషన్‌ పనుల్లో అనుభవం ఉండాలి. బీ వెబ్‌సైట్‌ అడ్మినిస్ట్రేషన్, గ్రాఫిక్‌ డిజైన్, వెబ్‌ డిజైన్, అకడమిక్‌ వెబ్‌సైట్ల కంటెంట్‌ క్రియేషన్‌లో మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. బీ 40 సంవత్సరాలు మించకూడదు. 

3. ఎస్టేట్‌ ఆఫీసర్‌-1: డిగ్రీ పాసై కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. సూపర్‌వైజర్‌ స్థాయిలో ఎస్టేట్‌ నిర్వహణ అనుభవం ఉండాలి. బీ గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు. 

4. అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌-2: బీకాం పాసై ఐదేళ్ల అనుభవం ఉండాలి. వాణిజ్య లేదా పరిశోధన సంస్థలో మూడేళ్లు పనిచేసినవారికి ప్రాధాన్యం.బీ వయసు 40 సంవత్సరాలు మించకూడదు. 

5. సూపరింటెండెంట్‌ (కంప్యూటర్‌)-1: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో బీఈ/ బీటెక్‌ పాసై నాలుగేళ్ల అనుభవం ఉండాలి. బీ మాస్టర్‌ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఉత్తీర్ణులై రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. 

లేదా బీ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో ఎమ్మెస్సీ పాసై రెండేళ్ల అనుభవం. 

లేదా బీ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో బీఎస్సీ పాసై ఐదేళ్ల ఉద్యోగానుభవం. బీ నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్, ఫైర్‌వాల్, సర్వర్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. బీ గరిష్ఠ వయసు 40 ఏళ్లు.  

6. సీనియర్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌-1: లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం. బీ గ్రంథాలయ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేవారికి ప్రాధాన్యమిస్తారు. బీ 35 సంవత్సరాలు మించకూడదు. 

7. క్లర్క్‌-1: డిగ్రీ పాసై ప్రభుత్వ/ ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగానుభవం ఉండాలి. ఎంఎస్‌ - ఆఫీస్‌ పరిజ్ఞానం తప్పనిసరి.బీ గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు. 

8. డ్రైవర్‌ గ్రేడ్‌-2: పదోతరగతి పాసై, కారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. మోటార్‌ మెకానిజం తెలిసి... మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. బీ వయసు 30 సంవత్సరాలు మించకూడదు. 

9. మాలి: పదో తరగతి పాసై.. తోట పని, హిందీ మాట్లాడటంలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.బీ గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు. 

10. మెసెంజర్‌-1: పదోతరగతి పాసై.. ఇంగ్లిష్‌ చదవడం, రాయడం తెలియాలి. బీ వయసు 25 సంవత్సరాలు మించకూడదు. 


గమనించాల్సినవి 

ప్రభుత్వ కార్యాలయాలు/ యూనివర్సిటీలు/ పరిశోధన సంస్థల్లో పనిచేస్తోన్నవారు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను ఇంటర్వ్యూ/ పరీక్ష సమయంలో సమర్పించాలి. 

ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ప్రతి పోస్టుకూ వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. 

డ్రైవర్, మాలి, మెసెంజర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులను పోస్టులో పంపాలి. మిగతా పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. 

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘సెక్రటరీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ, 18/2 సత్సంగ్‌ విహార్‌ మార్గ్, స్పెషల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, న్యూదిల్లీ’ చిరునామాకు పంపాలి. 

ప్రత్యేక కేటగిరీలకు చెందిన వర్గాలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తుకు చివరి తేదీ: ప్రకటన ప్రచురితమైన తేదీ (2.5.2024) నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి. 

వెబ్‌సైట్‌: www.nipfp.org.in
 

Some more information

‣  "From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"

Posted Date : 13-05-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం