• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నేర్చుకున్న పాఠాలు మరచి పోకుండా ఉండాలంటే?

కొంతమంది విద్యార్థులు సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా.. ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు. అయినా కొద్ది రోజులకే నేర్చుకున్నదంతా మర్చిపోతుంటారు. దీంతో  పరీక్షలు దగ్గరపడేసరికి ఒత్తిడి పెరిగి, ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. ఈ సమస్యకు నిపుణులు ఎలాంటి పరిష్కారాలను సూచిస్తున్నారో తెలుసుకుందామా... 

ఆటంకాలు ఉండకూడదు: చదువుకునే ప్రదేశాన్ని నిశ్శబ్దంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే మీ దృష్టిని పూర్తిగా చదివే అంశం మీదే కేంద్రీకరించడానికి వీలవుతుంది. చదివింది గుర్తుండాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం. ఏకాగ్రత నిలవడానికి ప్రశాంతమైన వాతావరణం ఎంతో అవసరం. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని చదవడం అలవాటు చేసుకుంటే మంచిది. 

సంక్షిప్త నామాలుగా: మీ దగ్గరున్న సమాచారాన్ని చిన్న పదాలు, వాక్యాలుగా విభజించుకోవచ్చు. పదాల్లోని మొదటి అక్షరాన్ని గుర్తుంచుకుంటే మొత్తం పదం, ఆ తర్వాత సంబంధిత వాక్యం వెంటనే గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. 

అర్థంచేసుకుంటూ చదవాలి: విషయాలను బట్టీపట్టడానికే ప్రాధాన్యం ఇవ్వకూడదు. అర్థంచేసుకుంటూ చదివితే ఎక్కువ కాలంపాటు గుర్తుండిపోతుంది. సమాచారం అంతటినీ ఒకేసారి చదివి గుర్తుపెట్టుకోవాలని అనుకోకూడదు. వ్యాసాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించుకుని చదివితే గుర్తుంచుకోవడం సులువవుతుంది.

రూపాన్ని మర్చిపోవద్దు: ప్రముఖుల పేర్లను గుర్తుంచుకునే క్రమంలో వారి రూపాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ పేరున్న వ్యక్తి ఇలా ఉంటారు.. అని ఒకసారి అనుకుంటే.. సంబంధిత వ్యక్తి ఫోటో చూడగానే వారి పేరు టక్కున స్ఫురణకు వస్తుంది. 

అంతర్‌సూత్రం ఆధారంగా: కొన్ని పేర్లను వాటి వెనుక ఉండే అంతర్‌సూత్రం ఆధారంగా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఉదాహరణకు రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్‌ క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాచేస్తే మధ్యలో ఏ ఒక్క రాష్ట్రం పేరునూ మర్చిపోయే అవకాశం ఉండదు. అలాగే గ్రహాల పేర్లను వాటి పరిమాణం ఆధారంగా చిన్నవాటి నుంచి పెద్దవాటిని గుర్తుపెట్టుకోవచ్చు. 

సమీక్షతో ఫలితం: విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో కొన్ని పాఠాలను చదువుతారు. తిరిగి సంవత్సరాంతంలో మాత్రమే మళ్లీ వాటిని చదువుతారు కొందరు. అలాకాకుండా సమయం ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సమీక్షించుకుంటే మంచిది. దీంతో అవన్నీ మీకు ఎంతవరకు గుర్తున్నాయో తెలుస్తుంది. మర్చిపోతే మళ్లీ ఒకసారి చదవడానికి అవకాశం ఉంటుంది.

నోట్సు రాస్తే మంచిది: ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలతో నోట్సు రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. పరీక్షల ముందు వీటిని ఒకసారి చదువుకుంటే ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. అలాగే చదివిన వాటిని ఎప్పటికప్పుడు చూడకుండా రాయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల విషయం ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది. సగం మాత్రమే గుర్తుంటే మిగతా సగాన్ని మళ్లీ చదువుకుని, చూడకుండా రాయొచ్చు. 

చోటు మారుస్తుండాలి

ఎప్పుడూ ఒకేచోట కూర్చుని చదవడం వల్ల ఒక్కోసారి కాస్త విసుగ్గా అనిపించొచ్చు. చదివే ప్రదేశాన్ని అప్పుడప్పుడూ మారుస్తుండాలి. కుటుంబసభ్యుల మాటలు, టీవీ, స్మార్ట్‌ఫోన్‌ వల్ల మీ ఏకాగ్రతకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోవాలి. గాలీ, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటే మంచిది. అలాగే మధ్యలో కాస్త చిరాగ్గా అనిపించినప్పుడు పరిసరాలను గమనించడం ద్వారానూ సేదతీరొచ్చు. ఆ తర్వాత మళ్లీ చదవడం మొదలుపెట్టొచ్చు. 

ఇష్టంగా నేర్చుకోవాలి

పాఠాలను ఎప్పుడూ పరీక్షల దృష్టితోనే చదవకూడదు. ఇష్టంగా చదివితే నేర్చుకోవడం ఎప్పుడూ కష్టంగా ఉండదు. నేర్చుకోవడంలోని ముఖ్యోద్దేశం.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే కాకూడదు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడూ ఉండాలి. ఇది ఉంటే పాఠాలేవీ విసుగ్గా అనిపించవు. కొత్త విషయాలనూ ఎంతో ఇష్టంగా నేర్చుకోగలుగుతారు. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ SSC CHSL: ఇంటర్‌ ఉంటే.. కొట్టేయవచ్చు కేంద్రం కొలువు!

‣ అటవీ ఉత్పత్తుల వృద్ధిలో నైపుణ్యం పెంచే కోర్సులు

‣ సైబర్‌ భద్రతకు రక్షకులు కావలెను!

‣ వ్యక్తిత్వ వైఖరులు... ఉద్యోగ లక్షణాలు

‣ సివిల్స్‌ సాధించాలంటే ఏ గ్రూపు ఎంచుకోవాలి?

‣ ఉద్వేగ ప్రజ్ఞ ఉందా మీకు?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌