• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇతరులతో పోల్చుకోవద్దు?

‘విశాల్‌కు లెక్కల్లో వందకు వంద.. లేకపోతే తొంభై తొమ్మిదయినా రావడం ఖాయం. రిషితకు సైన్స్‌ అంటే ప్రాణం. తనకూ అంతే తొంభైపైనే రావచ్చు. ఫైనల్‌ పరీక్షల్లోనూ వీళ్లందరికీ మంచి మార్కులే వస్తాయి. నా సంగతి ఏమవుతుందో’ అని రకరకాలుగా ఆలోచిస్తోంది వినీల. ఇలా తమను తాము ఇతరులతో పోల్చుకుంటూ చాలామంది విద్యార్థులు మథనపడుతుంటారు. పరీక్షల ముందు ఇలాంటి ఆలోచనలు మరింత భయపెడుతుంటాయి. మరేం చేయాలి? 

కొన్ని సబ్జెక్టులు సులువుగా అర్థం కావచ్చు. మరికొన్ని కష్టంగా ఉండొచ్చు. అలాంటివాటికి అదనంగా సమయాన్ని కేటాయించి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరులు ఎలా చదువుతున్నారనేది మీకు అనవసరం. మీ దృష్టి ఎప్పుడూ మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం మీదే ఉండాలి. 

మీ బలహీనతలను ఇతరులతో పోల్చుకుని చూసుకోవడం వల్ల మరింత బలహీనపడతారు. వాటిని అధిగమించే మార్గాల గురించి మాత్రమే అన్వేషించాలి. 

నిజానికి పోల్చుకోవడం అనేది... చాలామంది విషయంలో సాధారణంగా జరిగేదే. అది ఒకస్థాయి వరకూ పరిమితమైతే.. ఇతరులతో పోటీపడి చదివే అవకాశం ఉంటుంది. కానీ అదేపనిగా పోల్చుకోవడం వల్ల నమ్మకాన్ని కోల్పోతారు. అదే అలవాటుగా మారితే ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. 

పదేపదే ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం వల్ల.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవచ్చు. ఆ ప్రభావం పరీక్షా ఫలితాల మీదా పడుతుంది. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్టాక్‌ మార్కెట్‌ పాఠాలు కావాలా?

‣ అపజయాన్ని తట్టుకోండి..

‣ సొంతంగా వ్యాపారం.. ఐఐఎం నేర్పిస్తుంది!

‣ ఆస్ట్రేలియా వీసా డబ్బు రిఫండ్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌