• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అపజయాన్ని తట్టుకోండి..

విజయాన్ని ఎంత సంతోషంగా స్వీకరిస్తామో అపజయాన్నీ అంతే దృఢంగా తట్టుకోవడం అవసరం. అప్పుడే చిన్న చిన్న అపజయాలకు భయపడకుండా ఉంటాం. మరి ఓడినప్పుడు కూడా పెదాలపై చిరునవ్వు చెదిరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామా!

తెలుసుకుందాం: 

ఈ ప్రపంచంలో ఓటమి చవిచూడని వ్యక్తి ఒక్కరు కూడా ఉండరన్న విషయం తెలుసుకోవాలి. తప్పులు అత్యంత సహజం. 

బాధాకరమే అయినా ఓటములు కొత్త పాఠాలు చెప్పగలవు. వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. 

ఎటూ ఫెయిల్‌ అయ్యేదానికి ఎందుకు ప్రయత్నించడం అనుకోకూడదు. మళ్లీ ప్రయత్నమే చేయకపోతే విజయం ఎలా దక్కుతుంది?

మానసిక పరిపక్వత సాధించాలంటే అపజయం తప్పనిసరి. అప్పుడే ఒక విషయాన్ని మరోకోణంలో అర్థం చేసుకోవడం మొదలుపెడతాం. ఆ క్రమంలో ఎదుగుతాం.

ఏది ఓటమి అనే విషయం తెలుసుకోవడం కూడా ముఖ్యమే. కొన్నిసార్లు మన అభిప్రాయం, ఆలోచన పొరపాటయ్యే అవకాశం ఉంది కదా!

ఆచరిద్దాం: 

మీ ఫ్రెండే ఈ పరిస్థితిలో ఉంటే తనకి మీరు ఎలా ధైర్యం చెబుతారు? మీకు మీరే అలా చెప్పుకోవాలి.  ఇదే ‘సెల్ఫ్‌ కంపాషన్‌’. 

జరిగినదాన్నే తలుచుకుని బాధపడటం వల్ల అక్కడే ఆగిపోతారు. కొంత సమయం తీసుకుని మన ఎమోషన్స్‌ను పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నాక తిరిగి మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలి. 

కారెల్‌ డ్వెక్‌ లాంటి ప్రముఖ సైకాలజిస్టుల రిసెర్చ్‌ వీడియోలు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. అటువంటి వాటిని చూడటం వల్ల ‘సిచ్యువేషన్‌ హ్యాండ్లింగ్‌’ అర్థమవుతుంది.  

‘ఫ్యామిలీ ఈజ్‌ అల్టిమేట్‌’ అనేది నిజం. విజయంలోనే కాదు, అపజయంలోనూ మనవాళ్లు మనతో ఉంటారు. మానసికంగా కోలుకునేందుకు వారి సాయం తీసుకోవాలి. 

ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రేరణ (మోటివేషన్‌)ను కోల్పోకూడదు. ఈ అపజయానికి కారణం ఏంటని వెతికే ‘సెల్ఫ్‌ అనాలిసిస్‌’ అవసరం.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇగ్నోలో.. బీ.ఎడ్, నర్సింగ్‌ కోర్సులు

‣ యూజీలో ప్రవేశానికి సీయూఈటీ

‣ చరిత్రపై ఎన్ని అపోహలో!

‣ భగ్గుమంటున్న ధరల ముప్పు

‣ తెల్లబంగారానికి యంత్ర సొబగు

‣ వినయం... విధేయం నేర్చుకుంటే విజయం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌