• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కుదురుగా కూర్చుంటున్నారా?

 

 

రోజూ కాలేజీకి వెళ్లే విద్యార్థులు గంటలతరబడి కూర్చోవాల్సి వస్తుంది. పోటీ పరీక్షలకు చదివే అభ్యర్థులైతే ఇక చెప్పాల్సిన పనేలేదు, పుస్తకాల ముందే రోజు గడిచిపోతుంటుంది. మరి ఇంతింతసేపు కుర్చీకి అతుక్కుపోతున్నప్పుడు.. మీరు సరిగ్గా కూర్చుంటున్నారో లేదో గమనిస్తున్నారా?

 

నీ సరిగ్గా కూర్చోవడం వల్ల శరీరానికి, మెదడుకు చాలా లాభాలున్నాయి. స్థిరమైన భంగిమ వల్ల వెన్నెముక, మెడ, భుజాలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. చక్కని ఏకాగ్రత కుదిరేందుకు తోడ్పడి చదువుతున్న అంశాలపై దృష్టి పెరుగుతుంది. త్వరగా అలసిపోకుండా చదవగలుగుతాం. 

 

అలా కాకుండా ఎలా పడితే అలా కూర్చోవడం వల్ల ఒళ్లంతా భారంగా అనిపిస్తుంది. తిమ్మిర్లు మొదలవుతాయి. పఠనంపై ఆసక్తి తగ్గుతుంది. కండరాలకు అనవసర శ్రమ కలుగుతుంది. దీనివల్ల ఒక్కోసారి తలనొప్పి కూడా రావొచ్చు.

 

కూర్చునేటప్పుడు మరీ ముందుకు వంగకుండా, అలాగే మరీ వెనక్కి జారిపోకుండా వెన్ను నిటారుగా ఉంచాలి. కుర్చీ వెనుకభాగం మనకు దన్నుగా ఉండాలి. 

 

పాదాలు నేలకు తాకేలా ఉంచుతూ మోకాళ్లు కుర్చీకి సమాంతరంగా ఉండేలా కూర్చోవాలి. మరీ ముందుకు పడిపోయినట్లు, లేదా లోతులోకి కూరుకుపోయినట్టు ఉండకూడదు. 

 

చేతులకు బల్ల ఊతంగా ఉండాలి. వాటిని గాల్లో ఉంచడం మంచిది కాదు. 

 

కొన్నిసార్లు చదివేటప్పుడు ల్యాప్‌ట్యాప్‌ లేదా కంప్యూటర్‌ను కూడా వినియోగించాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో కీబోర్డు, మౌస్, స్క్రీన్‌ను మన ఎత్తుకు తగినట్టుగా మార్చుకోవాలి.

 

చదివేటప్పుడు ఎక్కువగా ఉపయోగించే వస్తువులను.. అంటే పెన్, హైలైటర్, అవసరమైన పుస్తకాలన్నింటినీ పక్కనే ఉంచుకోవాలి. అందువల్ల అస్తమానూ చేతులు చాచి భుజాలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చదువుకునే వారికి చక్కటిచోటు ముంబయి

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Posted Date : 08-07-2022 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌