• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వదిలేయడాన్ని వదిలేయండి!

కొత్త కోర్సులో చేరడం, పరిచయం లేని సబ్జెక్ట్‌ చదవడం, నూతన నైపుణ్యాన్ని అభ్యసించడం... ఇలా ఏ కొత్త పనైనా ఉత్సాహంగా మొదలుపెట్టి... సగం వరకూ పూర్తిచేసి... ఆ తర్వాత చేతులెత్తేసే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ ఇది సరికాదు. ముఖ్యంగా విద్యార్థి దశలో... భవిష్యత్తును నిర్దేశించే లక్ష్యాల సాధనలో అలసత్వం అస్సలు కూడదు.  చదువులోనూ, కెరియర్‌లోనూ విజయవంతం కావాలని భావించే వారెవరైనా తమ టాస్క్‌లను మధ్యలోనే వదిలేయకుండా పూర్తిచేయాలి. అలా చేయాలంటే...

తెలుసుకుందాం..

ఎంతటి కార్యదక్షత ఉన్న వారైనా... ఏదో ఒక సమయంలో మానసికంగా అలసిపోవడం మామూలే. సవాళ్లు ఎదురైనప్పుడు అసలు ఈ పని ఎందుకు మొదలుపెట్టామా అని కూడా అనిపించొచ్చు. కానీ ఆ భావన నుంచి ఎంత త్వరగా బయటకొస్తే అంత వేగంగా పనిలో నిమగ్నం కాగలం.  

ఒక్కసారి ఇది చేయాలి అని నిర్ణయించుకున్నాక... మళ్లీ ఆప్షన్‌ తీసుకోకూడదు. ఎవరికైనా ఒక పని చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు అనే ఆప్షన్‌ ఉంటే... అందులో వందశాతం కృషి చేయలేరు. పూర్తయ్యే తీరాలి అనుకున్నప్పుడే పూర్తిగా తలమునకలవుతారు. ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. 

ఎప్పుడూ ప్రేరణ కోల్పోకూడదు. మనిషిని నడిపించేది అంతర్లీనంగా ఉండే స్ఫూర్తే. దాన్ని నిరంతరం కలిగి ఉండాలి. 

కొన్నిసార్లు సహనం చాలా అవసరం. ముఖ్యంగా దీర్ఘకాల లక్ష్యాలను చేరుకునేటప్పుడు ఎంతో ఓపిగ్గా ఉండాల్సి వస్తుంది. విసుగు చెందితే లక్ష్యాలు నీరుగారడమే కాక, అప్పటివరకూ పడిన శ్రమంతా వృథా అయ్యే ప్రమాదం ఉంది.

ఆచరిద్దాం..

ఈ పని ఎందుకు మొదలుపెట్టామనే కారణాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలి, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కారణం మన మనసుకు ఎంత దగ్గరైనది అయితే... చేసే పనిలో నాణ్యత, వేగం అంత ఎక్కువగా ఉంటాయి. మరింత శ్రమించగలుగుతాం. 

నిరాశగా అనిపించినప్పుడు పాత విజయాలను గుర్తుచేసుకుంటే కొత్త ఉత్సాహం వస్తుంది. చిన్నదే అయినా, సక్సెస్‌పై మనల్ని మనం అభినందించుకోవాలి. అదే స్ఫూర్తితో కొత్త పనులు చేసేందుకు ప్రయత్నించాలి. 

అవరోధాలు అవసరమేనన్న విషయాన్ని గుర్తించాలి. ఎవరైనా విజయాల నుంచి కంటే, అపజయాల నుంచే ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. అడ్డంకులు ఎదురైనప్పుడే సమస్యల పరిష్కారం అర్థమవుతుంది. అందువల్ల వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలి. 

కొన్నిసార్లు పని పూర్తిచేయలేక మొత్తంగా వదిలేద్దాం అనిపిస్తుంటే... ముందు చిన్న విరామం తీసుకోవడం ఉత్తమం. దాన్నివల్ల మనసు తేలికపడి కొత్త ఆలోచనలు వస్తాయి. టాస్క్‌ను ఎలా పూర్తిచేయాలో తెలుస్తుంది.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫార్మా నిపుణులకు తరగని డిమాండ్‌!

‣ ప్రసిద్ధ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ!

‣ మహిళలకు ప్రత్యేకం.. ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ అన్ని విభాగాల‌కు స‌మ ప్రాధాన్యం

Posted Date : 30-08-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌