• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చివరివరకూ అంతే ఉత్సాహంగా..

ఎంతో ఉత్సాహంగా పని మొదలుపెడతాం. కానీ మధ్యకొచ్చేసరికి తెలియని నీరసం ఆవహిస్తుంది. చేయగలమా లేదా, అవసరమా కాదా అనే సందేహాలు చుట్టుముడతాయి. ముందు ఉన్న మోటివేషన్‌ తగ్గిపోతుంది. 

దీని వల్ల పని పూర్తికాకుండా వదిలేసే ప్రమాదం ఉంది. మరి చదువు, ఉద్యోగ ప్రయత్నాలు, ఏ పనైనా సరే మొదటి నుంచి చివరి వరకూ అదే ఉత్సాహంతో, ప్రేరణ కోల్పోకుండా ఉండాలంటే ఏంచేయాలి..?

‘ఆరంభింపరు నీచ మానవులు..’ అని చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుంది కదా! ఏ పనైనా సరే మధ్యలో మానేయకుండా విజయవంతంగా పూర్తిచేయాలి. అది చదువుకునేందుకు రాసుకున్న టైంటేబుల్‌ అయినా, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలైనా.. వందశాతం కష్టపడాలి. సగం చేసి వదిలేసే వారు మధ్యములని, చివరిదాకా పట్టుబట్టి సాధించేవారే ధీరులని పెద్దలు ఎప్పుడో చెప్పారు! 

ప్రేరణ కోల్పోకూడదంటే ముందు మన లక్ష్యం సాధించదగినది, స్థిరమైనది అయ్యుండాలి. ఎందుకు చేయాలి అనుకుంటున్నాం, ఎలా చేస్తాం అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. చివరివరకూ మోటివేషన్‌ కోల్పోకూడదంటే ఆ లక్ష్యమే మనల్ని ప్రేరేపించేలా ఉండాలి!

లక్ష్యాన్ని మన రోజువారీ జీవితంలో భాగం చేయడం ముఖ్యం. దాని గురించి ఆలోచించాలి, దాని కోసం పనిచేయాలి, పాజిటివ్‌ దృక్పథంతో ఉండాలి, తొందరపాటు కూడదు. 

సాధించాల్సిన అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాలి. ఒకేసారి మొత్తం చేయడం కన్నా, భాగాలుగా పూర్తిచేయడం సులభంగా అనిపిస్తుంది. పైగా కొంత మేరకు సాధించామనే భావనతో మరింత ప్రేరణ కలుగుతుంది. 

మన చుట్టూ ఎప్పుడూ ఆశావహులే ఉండేలా చూసుకోవాలి. ‘నువ్వు చేయలేవులే, ఇది చాలా కష్టం, వాళ్ల వల్లే కాలేదు..’ ఇటువంటి మాటలు చెప్పే వారిని దరిదాపుల్లో కూడా ఉంచుకోవద్దు. ఒకవేళ వారు తప్పించుకునే అవకాశం లేని వ్యక్తులైతే వాళ్ల మాటల్ని చెవికి ఎక్కించుకోవద్దు. మనం పక్కవాళ్ల అంచనాలకు తగ్గట్టు నడుచుకోవడం కంటే.. వారి అంచనాలకు మించి సాధించడంలోనే అసలైన విజయం దాగుంది!

కొన్నిసార్లు బాగా ఇబ్బందిపడుతున్నాం అనిపిస్తే ఒక చిన్న విరామం తీసుకోవడం మంచిదే! అది మరింత కొత్త ఉత్సాహంతో మన పనిని ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి. లక్ష్యాన్ని మనకు మరింత చేరువ చేయాలి. 

అన్నింటికీ మించి మనం మనసు చేతుల్లో బందీ అయిపోకూడదు. అదే మన నియంత్రణలో ఉండాలి. ఎమోషన్‌ - లాజిక్‌ రెండింటినీ వేరువేరుగా చూడాలి. ఆలోచనల్లో స్పష్టత - పనిలో వేగం.. వీటి సాయం తీసుకుని నిరంతర ప్రేరణతో లక్ష్యసాధనలో ముందుకు సాగాలి!

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ నాణ్యమైన బోధన.. నెలనెలా స్టైపెండ్‌!

‣ అత్యున్నత కొలువుకు పోటీపడతారా?

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ‘మ్యాట్‌’!

‣ డెక‌రేష‌న్ల‌కు కొన్ని కోర్సులు!

‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!

Posted Date : 08-02-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌