• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమ్మర్‌ జాబ్‌తో లాభాలెన్నో..

స్వల్పకాలవ్యవధి ఉద్యోగ వివరాలు

అకడమిక్‌ పరీక్షలు పూర్తయ్యాయి.. వేసవి సెలవులు మొదలయ్యాయి.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. ఏదైనా కోర్సు నేర్చుకోవడం, ఆటలాడటం ఇలా ఎవరికి తోచింది వారు చేస్తారు కదా.. అయితే ఈసారి సరదాగా ఈసారి సమ్మర్‌ జాబ్‌ ట్రై చేద్దామా! దీంతో లాభాలెన్నో! అవేంటంటే..

ఉద్యోగం అనగానే.. వెంటనే గుర్తొచ్చేది జీతం! అవును, దాదాపు ఉద్యోగులంతా జీతం కోసమే పనిచేస్తుంటారు. కానీ సమ్మర్‌ జాబ్‌ ఉద్దేశం మాత్రం కేవలం జీతమే కాదు.. వేసవి సెలవుల్లో తక్కువ కాలవ్యవధికే చేసే ఈ పనితో లాభాలు మాత్రం ఎక్కువే. ఈ స్వల్పకాలపు ఉద్యోగాల వల్ల కలిగే దీర్ఘకాల ప్రయోజనాలేంటో చూసేద్దాం.

నమ్మకం

కొన్ని సర్వేల ప్రకారం హైస్కూల్‌ వయసు దాటాక, ఉద్యోగ జీవితం ప్రారంభం కావడానికి ముందు... ఎంతోకొంత పని అనుభవం ఉన్న విద్యార్థులు వృత్తి జీవితంలో చక్కని ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్నారని తేలింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెగ్గుకురాగలమనే నమ్మకమే మనల్ని చాలా విషయాల్లో ముందుకు నడిపించేది. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి నిలబడేందుకు ప్రయత్నించడం.. చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించడం దగ్గర్నుంచి పెద్దపెద్ద పాఠాలు నేర్చుకోవడం వరకూ చాలా నేర్పించగలదు.

మనల్ని మనం తెలుసుకునేలా..

చదువయ్యాక ఎలాంటి పని నచ్చుతుందో తెలుసుకోలేక డైలమాలో ఉంటే... దాన్ని తొలగించేందుకు ఈ సమ్మర్‌ జాబ్‌ కొంతమేర పనిచేస్తుంది. కొందరికి వినియోగదారులకు సేవలు అందించడం నచ్చుతుంది... మరికొందరికి వారిని డీల్‌ చేయడం అంటేనే హడల్‌. కొందరికి అంకెలతో పనిచేసే ఉద్యోగాలైనా, రోజంతా ఒక్కచోటే ఉండే డెస్క్‌ జాబ్స్‌ అయినా నచ్చవచ్చు. కానీ ఇంకొందరికి అది బోరింగ్‌గా అనిపించవచ్చు. ఇలాగే.. మనకు ఏది నచ్చుతుందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

పరిచయాలు..

సాధారణంగా విద్యార్థిగా ఉన్నప్పుడు చుట్టూ అదే వయసుగల స్నేహితులే ఉంటారు. కానీ ఉద్యోగంలో అలా కాదు.. విభిన్న వయసుల వారు, మనస్తత్వాలు కలిగిన వారు,  వివిధ రకాల పరిస్థితుల నుంచి వచ్చిన వారితో పరిచయం, స్నేహం.. మన ఆలోచనాధోరణిని విస్తృతం చేయడం మాత్రమే కాదు.. కొత్త అవకాశాలను సృష్టించగలదు కూడా.

సమయపాలన

కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలియాలి అంటే.. లక్ష్యాలు ఉన్నప్పుడే సాధ్యం. అది ఉద్యోగం జీవితంలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే సమ్మర్‌ జాబ్‌లో టైం మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ బాగా నేర్చుకునే వీలుంటుంది. ఇది తర్వాత ఉద్యోగ జీవితంలోనే కాదు... ఉన్నత చదువుల్లోనూ ఉపయోగపడుతుంది.

ప్రాధాన్యం

సమ్మర్‌ జాబ్‌ తక్కువ కాలమే చేస్తారు కాబట్టి అది పూర్తిస్థాయిలో వృత్తి అనుభవం ఇవ్వలేకపోవచ్చు, కానీ రెజ్యుమెలో ఇతరుల కంటే మనల్ని ప్రత్యేకంగా చూపగలదు. అంతేకాదు... అది పని చేయడం పట్ల మనకున్న ఆసక్తిని, శ్రద్ధనూ  తెలియజేస్తుంది. కేవలం డిగ్రీలే కాకుండా ఎంతో కొంత పని అనుభవం ఉండటం మంచిదనే కదా ఎవరైనా అనుకునేది!

ఇవి మాత్రమే కాదు, పని - వ్యక్తిగత జీవితాన్ని సరిచూసుకోవడం, డబ్బుతో వ్యవహరించాల్సిన తీరు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ .. ఇలా ఇంకా చాలా నేర్చుకోవచ్చు. మీకూ ఈ పద్ధతి నచ్చితే వెంటనే ఉద్యోగానికి ప్రయత్నించండి మరి!
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ బార్క్‌లో 4,162 కొలువులు

‣ మ్యూజిక్‌లో బెస్ట్‌ కోర్సులివిగో..

‣ చదువుకుంటూ సంపాదించు!

‣ దివ్యమైన కోర్సులకు వేదిక

Posted Date : 28-04-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌