• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నికల్‌ క్యాడర్‌ పోస్టులు

* డిప్లొమా, డిగ్రీతో దరఖాస్తుకు అవకాశం



ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ (ఎన్‌ఐఓహెచ్‌) అహ్మదాబాద్‌ టెక్నికల్‌ క్యాడర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేసింది.  

  ప్రకటించిన మొత్తం 54 పోస్టుల్లో.. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్స్‌)-1, కెమిస్ట్రీ-06, బయోకెమిస్ట్రీ-2, బయోమెడికల్‌-03, మైక్రోబయోలజీ-03, టాక్సికాలజీ-01, ఎన్నిరాన్‌మెంటల్‌ సైన్స్‌-01, ఎంఎల్‌టీ-03 ఫిజియాలజీ-02, పబ్లిక్‌ హెల్త్‌-04, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌-01, ఫిజిక్స్‌-01, టెక్నీషియన్‌ (1)-16, ల్యాబొరేటరీ అటెండెంట్‌(1)-10 ఉన్నాయి. 

  టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్స్‌): ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ ఫస్ట్‌క్లాసులో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. 

 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (కెమిస్ట్రీ): కెమిస్ట్రీ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌ అవసరం. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.  

 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (బయోకెమిస్ట్రీ): బయోకెమిస్ట్రీ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌ ఉండాలి. 

 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (బయోమెడికల్‌): బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్, లేదా బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ ఫస్ట్‌క్లాస్, లేదా బయోమెడికల్‌ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌ అవసరం.  

 టెక్నికల్‌ అసిస్టెంట్‌ మైక్రోబయాలజీ: మైక్రోబయాలజీ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌ ఉండాలి. 

 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ట్యాక్సికాలజీ): టాక్సికాలజీ/ఫోరెన్సిక్‌ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులవ్వాలి.  

 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌): ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌ అవసరం.  

 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎంఎల్‌టీ): మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌ ఉండాలి. 

 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఫిజియాలజీ): సైన్స్‌ డిగ్రీ (ఫిజియాలజీ) ఫస్ట్‌క్లాస్‌ ఉండాలి. 

 టీఏ (పబ్లిక్‌ హెల్త్‌): సైన్స్‌ డిగ్రీ (పబ్లిక్‌ హెల్త్‌) ఫస్ట్‌క్లాస్‌ అవసరం. 

 టీఏ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌): ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా ఫస్ట్‌క్లాస్, లేదా ఐటీ/సీఎస్‌లో బీఈ/బీటెక్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. 

 టీఏ (ఫిజిక్స్‌): సైన్స్‌ డిగ్రీ (ఫిజిక్స్‌) ఫస్ట్‌క్లాస్‌ ఉండాలి. 

 టెక్నీషియన్‌-1: సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీలో/కంప్యూటర్‌/కెమికల్‌ టెక్నాలజీ/ ఇండస్ట్రియల్‌ సేఫ్టీలో డిప్లొమా ఉండాలి. 

 ల్యాబొరేటరీ అటెండెంట్‌-1: ఈ పోస్టుకు టెన్త్‌ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఏడాది ల్యాబొరేటరీ అనుభవం/ట్రేడ్‌ సర్టిఫికెట్‌ అవసరం. 

అన్ని పోస్టులకూ గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. టెక్నీషియన్‌కు 28, ల్యాబొరేటరీ అటెండెంట్‌కు 25 సంవత్సరాలు. ప్రత్యేక కేటగిరీలఅభ్యర్థులకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. 


ఎంపిక ఎలా?

టెక్నికల్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌-1, ల్యాబొరేటరీ అటెండెంట్‌-1 పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్‌/ఎంసీక్యూ ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు. రాత పరీక్షలన్నింటినీ అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

అభ్యర్థుల షార్ట్‌లిస్టును తయారుచేసి.. రాత పరీక్ష తేదీ, సమయం, అది జరిగే ప్రాంతాలను తెలియజేస్తారు. ఈ వివరాలను కాల్‌ లెటర్‌/అడ్మిట్‌ కార్డ్స్‌ ద్వారా తెలుపుతారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ ఎన్‌ఐఓహెచ్‌ వెబ్‌సైట్‌ను సందర్శిస్తుండాలి. సిలబస్, మార్కుల వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. 

ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే.. వేర్వేరు అప్లికేషన్‌లను పంపాలి. 

ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేెషన్‌ ఉంటుంది. అభ్యర్థులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే ఐసీఎంఆర్‌ లేదా ఎన్‌ఐఓహెచ్‌ కార్యాలయాల్లో ఎక్కడైనా నియమించవచ్చు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 04.08.2023

వెబ్‌సైట్‌: www.niohrecruitment.org

మరింత సమాచారం... మీ కోసం!

‣ నర్సింగ్‌ కోర్సు.. అవకాశాలు అనేకం

‣ సీజీపీడీటీఎంలో 553 ఉద్యోగాలు

‣ డేటా సైన్స్‌లో ప్రత్యేకతలివిగో!

‣ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం

‣ దినసరి కూలీ.. డాక్టరేట్‌ సాధించింది

‣ సీఎస్‌ఈకి ఎందుకీ క్రేజ్‌!

Posted Date : 20-07-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.