• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉపాధికి టీఎంసీ ఆహ్వానం

మెడికల్, నాన్‌ మెడికల్‌ కొలువులు  

 మే 7 దరఖాస్తు చివరి తేదీ


టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) 87 మెడికల్, నాన్‌ మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారిని ముంబయి, గువాహటి, విశాఖపట్నాల్లోని టీఎంసీ ఆసుపత్రుల్లో నియమిస్తారు. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొత్తం 87 ఉద్యోగాల్లో.. మెడికల్‌ ఆఫీసర్‌ ‘ఈ’- 8, మెడికల్‌ ఫిజిసిస్ట్‌-2, ఆఫీసర్‌ ఇన్‌ఛార్జ్‌-1, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-2, అసిస్టెంట్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌-1, ఫిమేల్‌ నర్స్‌-58, కిచెన్‌ సూపర్‌వైజర్‌-1, టెక్నీషియన్‌ ‘సి’-1, టెక్నీషియన్‌ ‘ఎ’-4, స్టెనోగ్రాఫర్‌-6, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-3 ఉన్నాయి. 


1. ఫిమేల్‌ నర్స్‌: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ పాసై.. ఆంకాలజీ నర్సింగ్‌లో డిప్లొమా పూర్తిచేయాలి. లేదా బేసిక్‌/ పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ (నర్సింగ్‌) చేయాలి. 

ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌/ స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ కావడానికి అర్హత సాధించాలి. 

వయసు 30 సంవత్సరాలు మించకూడదు.  

టీఎంసీలో నర్సింగ్‌ ఆంకాలజీ డిప్లొమా చేసి బాండ్‌ కాలంలో పనిచేసిన వారికి గరిష్ఠ వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

50 పడకల ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం తప్పనిసరి. 

అభ్యర్థులు హెపటైటిస్‌-బి వాక్సినేషన్‌ పూర్తిచేసుకోవాలి.  

పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీకి ముందు పనిచేసిన అనుభవం ఉన్నా పరిగణనలోకి తీసుకుంటారు. 

2. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ‘సి’: బీఎస్సీ (ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ బయాలజీ/ న్యూక్లియర్‌ మెడిసిన్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఆర్‌పీఏడీ/ ఏఈఆర్‌బీ నిర్వహించిన పీజీడీఎఫ్‌ఐటీ/ డీఎంఆర్‌ఐటీ అండ్‌ ఆర్‌ఎస్‌ఓ లెవెల్‌-2 (న్యూక్లియర్‌ మెడిసిన్‌) పరీక్ష పాసవ్వాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం తప్పనిసరి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. లేదా బీఎస్సీ న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ (మూడేళ్ల ప్రోగ్రామ్‌) పూర్తిచేసి, ఆర్‌పీఏడీ/ ఏఈఆర్‌బీ నిర్వహించిన ఆర్‌ఎస్‌ఓ లెవెల్‌-2 (న్యూక్లియర్‌ మెడిసిన్‌) పరీక్ష పాసవ్వాలి. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం. లేదా ఎమ్మెస్సీ (న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ) పూర్తిచేసి, ఆర్‌పీఏడీ/ ఏఈఆర్‌బీ నిర్వహించిన ఆర్‌ఎస్‌ఓ లెవెల్‌-2 (న్యూక్లియర్‌ మెడిసిన్‌) పరీక్ష పాసవ్వాలి. 

3. స్టెనోగ్రాఫర్‌: డిగ్రీ పాసై, షార్ట్‌హ్యాండ్‌ వేగం నిమిషానికి 80 పదాలు, టైప్‌రైటింగ్‌ వేగం నిమిషానికి 40 పదాలు ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.  

ఎంఎస్‌-ఆఫీస్‌లో కనీసం మూడు నెలల కోర్సు పూర్తిచేయాలి. 

కంప్యూటర్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా/ డిగ్రీ చేసినవారికి ఎంఎస్‌ - ఆఫీస్‌ కోర్సు నుంచి మినహాయింపు ఉంటుంది. 

సెక్రటేరియల్‌ కోర్సుల్లో డిప్లొమా చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.

ప్రముఖ సంస్థలో ఏడాది సెక్రటేరియల్‌ అనుభవం తప్పనిసరి. 

4. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: డిగ్రీ పాసై, ఎంఎస్‌-ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి. 

ఏడాది క్లరికల్‌ అనుభవం తప్పనిసరి.

5. టెక్నీషియన్‌ ‘ఎ’: సైన్స్‌ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీలో ఆరు లేదా ఏడాది వ్యవధి ఉన్న డిప్లొమా కోర్సు పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు. ఏడాది పని అనుభవం తప్పనిసరి.  

ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు దరఖాస్తు ఫీజు లేదు. మిగిలినవారందరికీ రూ.300. 

గరిష్ఠ వయసులో.. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి పదిహేనేళ్లు, టీఎంసీ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

ఉద్యోగాన్ని బట్టి రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, వైద్య, వసతి, రిటైర్‌మెంట్‌ సదుపాయాలూ ఉంటాయి. ఎంపికైనవాళ్లు ఒకేచోట ఐదేళ్లపాటు పనిచేయాలి. ఆ తర్వాత దేశంలోని టీఎంసీ ఆసుపత్రుల్లో ఎక్కడికైనా బదిలీ చేస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 07.05.2024

వెబ్‌సైట్‌: https://tmc.gov.in
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌లో గేమ్‌ ఛేంజర్‌!

‣ సాయుధ దళాల్లో చేరతారా?!

‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్‌ లా!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

Posted Date : 30-04-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.