• facebook
  • whatsapp
  • telegram

బిర్లా విజ్ఞాన కేంద్రం సంచాలకులు సిద్ధార్థ తో ఇంటర్వ్యూ

* చందమామపై ఇళ్లు!
* ఈ శతాబ్దిలోనే సాకారం
* అంతరిక్ష పరిశోధనల్లో అగ్రదేశాల సరసన భారత్‌

అంతుచిక్కని అంతరిక్ష రహస్యాలను ఛేదించుకొంటూ వస్తున్న ఆధునిక మానవుడికి చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు సాధ్యమేనని అంటున్నారు హైదరాబాద్‌లోని బిర్లా విజ్ఞాన కేంద్రం (సైన్స్‌ సెంటర్‌) సంచాలకులు సిద్ధార్థ. చంద్రుడిపై నీరు ఉందనే విషయం మన శాస్త్రవేత్తలు కనుగొన్న తర్వాత ఆ దిశగా ఆశావహ పరిస్థితి నెలకొందన్నారు. ఈ శతాబ్ధంలోనే చంద్రుడిపై నివాసం ఉండాలన్న కల సాకారమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. పాలపుంతలో భూమిని పోలిన గ్రహాలు 1700 కోట్ల వరకూ ఉన్నాయని నాసా లెక్కకట్టిన నేపథ్యంలో సిద్ధార్థను ఈనాడు పలకరించింది.

» నాసా శాస్త్రవేత్తలు తాజాగా భూమి లాంటి గ్రహాలు కోట్లలోనే ఉన్నాయని ప్రకటించారు. కొత్త గ్రహాల అన్వేషణలో ఇది ఎంత వరకు దోహదం చేస్తుంది?
ఎప్పటి నుంచో గెలాక్సీలో గ్రహాలు చాలా ఉన్నాయని అనుమానిస్తున్నారు. 10వేల కోట్ల నక్షత్రాలు ఉంటాయని అంచనా. అయితే ఇన్నాళ్లూ సందిగ్ధం ఉండేది. నాసా తాజాగా వీటిలో 1700కోట్ల గ్రహాలు భూ పరిమాణంలో ఉన్నాయని నిర్ధారించింది. అంటే 17 శాతం. ఇదేమి గొప్ప ఆవిష్కరణ కాదు.

» రానురాను భూమి నివాసయోగ్యం కాకుండా పోతోంది. ఈ నేపథ్యంలో గ్రహాంతరయానం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్తగా కొనుగొన్న గ్రహాలపైకి అంతరిక్షయానం సాధ్యమా..?
కొత్త గ్రహాలపైకి అంతరిక్షయానం ఇప్పుడే సాధ్యం కాదు. పరిశోధనలు అంతదూరం వెళ్లలేదు. ఇప్పుడంత సాంకేతికత లేదు. భవిష్యత్తులో బాగా వృధ్ధి చెందిన తర్వాతే వాటి గురించి ఆలోచించగలం.

» ఇతర గ్రహాల్లో నివాసం ఎప్పటికి సాధ్యం?
భూతాపానికి సంబంధించి సంకేతాలు అందుతున్నాయి. అతివృష్టి-అనావృష్టి, 50 ఏళ్లలో లేనంతగా వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు అర్కిటిక్‌పై మంచు మొత్తం కరిగిపోతుందన్నారు. కానీ అలా జరగలేదు. ఈ విషయంలో కచ్చితమైన శాస్త్రీయత లభ్యం కావడం లేదు. అయితే, భూతాపం ప్రమాదం మాత్రం పొంచి ఉంది. మరో వంద, రెండు వందల ఏళ్లలో మనం భయపడుతున్న పరిస్థితులు ఉత్ఫన్నం కావచ్చు. ఈలోగానే బహుశా ఈ శతాబ్ధిలోనే చంద్ర మండలంపై నివాసం కలలు సాకారమయ్యే అవకాశం ఉంది. అంగారకుడిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

» మనదేశం క్షిపణి ప్రయోగాలతో పోలిస్తే అంతరిక్ష పరిశోధనల్లో అగ్రదేశాలతో పోటీపడలేకపోతోంది. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడం వరకే పరిమితం అవుతున్నాం కారణం?
క్షిపణి ప్రయోగాల్లో మన సత్తా ఏమిటో ఇప్పటికే నిరూపించుకున్నాం. అగ్రదేశాల సరసన నిలిచాం. అలాగని అంతరిక్ష పరిశోధనల్లో మనంమేమీ తీసిపోలేదు. ప్రపంచంలోని మొదటి ఐదుదేశాల్లో మనకు స్థానం ఉంది. చైనా మన కంటే ఒకింత ముందు ఉంది. మన వద్ద ఆధునిక సాంకేతికత లేకపోవడం, నిధుల సమస్యలు ప్రధాన అవరోధాలు. ఈ తరహా పరిశోధనలకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే నిధులు పెరుగుతున్నాయి.

» రాబోయే రోజుల్లో భారత్‌ ముందున్న సవాళ్లు?
భూమి చుట్టూ పరిభ్రమించే స్పెస్‌క్రాఫ్ట్‌లో మన సాంకేతికతతో భారతీయులు వెళ్లాలి. ఈ తరహా సాంకేతికత ఇప్పుడు మన ముందున్న సవాల్‌.

» ఇటీవల కొత్త గ్రహాల కొనుగొన్నట్లు వింటున్నాం. ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు?
మూడు నాలుగేళ్ల క్రితం నాసా కెప్లర్‌ టెలిస్కోపును ప్రయోగించింది. వాటి ఫలితాలు ఇప్పుడు కన్పిస్తున్నాయి. కొత్త గ్రహాల సమాచారం వెలుగులోకి వస్తోంది.

» యువతరంలో అంతరిక్ష పరిశోధనల వైపు ఆసక్తి ఉన్నా ఆచరణలో వెనకబాటుకు కారణాలు?
చిన్నతనం నుంచి పాఠాల్లో చదువుకోవడం వల్ల ఈ తరహా పరిశోధనలు ప్రతిఒక్కరికీ ఆసక్తి కల్గిస్తుంటాయి. వాస్తవంలోకి వచ్చే సరికి ఉద్యోగం కోసం ఇంజినీరింగ్‌ వంటి కోర్సుల వైపు చూస్తున్నారు. అమెరికా, రష్యా వంటి దేశాలు అంతరిక్షంపై ప్రత్యేకంగా కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో మా విజ్ఞాన కేంద్రం యువతరంలో స్ఫూర్తినింపుతోంది. వారికి కావాల్సిన సమాచారం అందిస్తోంది. ఆపై బాధ్యత ప్రభుత్వానిది.

Posted Date: 02-11-2019

SLIDER

మరిన్ని