• facebook
  • whatsapp
  • telegram

ప‌ది నుంచి పీజీ వ‌ర‌కు ఆర్మీలో ఉద్యోగాలివీ...

ర‌క్షణ‌ ద‌ళంలో ఉద్యోగ‌మంటే దేశానికి సేవ‌చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే. అయితే సేవ‌తోపాటు సంతృప్తి, ఆక‌ర్షణీయ వేత‌నం, ప‌లు ర‌కాల భ‌త్యాలు, వ‌స‌తులు ఇప్పుడు డిపెన్స్ ఉద్యోగుల‌కు ల‌భిస్తున్నాయి. ప‌దో త‌ర‌గ‌తి పూర్తవ్వగానే ఆర్మీలో కెరీర్ ప్రారంభించొచ్చు. ఇంట‌ర్ అర్హత‌తోనే ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందుకోవ‌చ్చు. అర్హత‌, అభిరుచుల మేర‌కు ఆర్మీలో ప‌ది నుంచి పీజీ వ‌ర‌కూ ప‌లు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ వివ‌రాలు చూద్దాం...
 

నాన్ మెట్రిక్ అర్హత‌తో...
ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులు కాలేక‌పోయినా, ప‌ది వ‌ర‌కు చ‌ద‌వ‌క‌పోయినా నాన్ మెట్రిక్ తో సోల్జర్ ట్రేడ్స్‌మెన్ విభాగంలో ఆర్మీలో ఉద్యోగం పొందే అవ‌కాశం ఉంది. ఇందులో జ‌న‌ర‌ల్ డ్యూటీస్‌, స్పెసిఫైడ్ డ్యూటీస్ అనే రెండు విభాగాలు ఉన్నాయి. జ‌న‌ర‌ల్ డ్యూటీస్‌కి వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. అలాగే స్పెషిఫైడ్ డ్యూటీస్‌కి వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లు. క‌నీసం ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిన‌వాళ్లు ఈ ఉద్యోగాల‌కు పోటీప‌డొచ్చు.

 

ప‌దో త‌ర‌గ‌తితో...
సోల్జర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ: ప‌దో తర‌గ‌తిలో 45 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులైతే చాలు సోల్జర్ జ‌న‌ర‌ల్ డ్యూటీకి అర్హత ల‌భించిన‌ట్టే. వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. ప్రక‌ట‌న‌లు ఏడాదిలో ప‌లుసార్లు ప్రాంతాల‌ వారీ వెలువ‌డ‌తాయి. రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ముందు ప‌రుగు పోటీ ఇత‌ర ఫిజిక‌ల్ టెస్టులు నిర్వహిస్తారు. వీటిలో ఎంపికైన‌వారికి రాత ప‌రీక్ష ఉంటుంది. అందులోనూ ఉత్తీర్ణులైతే వైద్య, ఆరోగ్య ప‌రీక్షలు నిర్వహించి ఉద్యోగానికి అవ‌కాశం క‌ల్పిస్తారు.

 

ఇంట‌ర్ అర్హత‌తో...
సోల్జర్ టెక్నిక‌ల్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణులు పోల్జర్ టెక్నిక‌ల్ పోస్టుల‌కు అర్హులు. వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి. ఆయా ప్రాంతాల‌వారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.
సోల్జర్ క్లర్క్‌, స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌: ఏ గ్రూప్‌తోనైనా ఇంట‌ర్ పాసైన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు. అయితే ఇంట‌ర్‌లో 50 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. అలాగే ప్రతి స‌బ్జెక్టులోనూ క‌నీసం 40 శాతం మార్కులు రావాలి. వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి. ఆయా ప్రాంతాల‌వారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.

 

సోల్జర్ న‌ర్సింగ్ అసిస్టెంట్‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ, ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు సోల్జర్ న‌ర్సింగ్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులు. అలాగే ప్రతి స‌బ్జెక్జులోనూ క‌నీసం 40 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. వయోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి. ఆయా ప్రాంతాల‌వారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.
 

డిగ్రీ అర్హత‌తో...
హ‌వ‌ల్దార్ ఎడ్యుకేష‌న్‌: డిగ్రీ లేదా పీజీతోపాటు బీఎడ్ చ‌దివిన‌వాళ్లు హ‌వ‌ల్దార్ ఎడ్యుకేష‌న్ పోస్టుల‌కు అర్హులు. వ‌యోప‌రిమితి 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి.
రెలిజియ‌స్ టీచ‌ర్ (జేసీవో): డిగ్రీతోపాటు సంబంధిత మ‌త డినామినేష‌న్ ఉండాలి. వ‌యోప‌రిమితి 27-34 ఏళ్లలోపు ఉండాలి.
జేసీవో(క్యాట‌రింగ్‌): 10+2తోపాటు క‌నీసం ఏడాది వ్యవ‌ధి ఉండే హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేయాలి. వ‌యోప‌రిమితి 21 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి.
స‌ర్వేయ‌ర్ అటోమేటెడ్ కార్టోగ్రాఫ‌ర్‌: డిగ్రీలో మ్యాథ్స్ చ‌దివిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు. అలాగే వీళ్లు ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌తోపాటు సైన్స్ కోర్సులు చ‌ద‌వుండ‌డం త‌ప్పనిస‌రి. వ‌యోప‌రిమితి 20-25 ఏళ్లలోపు ఉండాలి.

వెబ్‌సైట్లు: http://joinindianarmy.nic.in, https://www.upsc.gov.in/

Posted Date : 17-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌