• facebook
  • whatsapp
  • telegram

ర‌క్ష‌ణ రంగంలో కొలువులు

458 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

 

 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు రక్షణ విభాగంలో ఉద్యోగానికి పోటీ పడే అవకాశం ఇప్పుడొచ్చింది. పదో తరగతి ఉత్తీర్ణుల నుంచి ఫీల్డ్‌ అమ్యూనిషన్‌ డిపో.. ట్రేడ్స్‌మన్‌ మేట్, ఫైర్‌మెన్, ఎంటీఎస్‌ మొదలైన 458 పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.  

 

దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయః పరిమితిలో సడలింపు ఉంటుంది. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ (స్క్రీనింగ్‌), రాత/ మెడికల్‌ పరీక్ష, ఇంటర్వ్యూలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారు. 

 

ఇవీ పోస్టులు

ట్రేడ్స్‌మన్‌ మేట్‌ (మజ్దూర్‌): 330

జేఓఏ (ఎల్‌డీసీ): 20

మెటీరియల్‌ అసిస్టెంట్‌ (ఎంఏ): 19

ఎంటీఎస్‌: 11

ఫైర్‌మెన్‌: 64

ఏబీఓయూ ట్రేడ్స్‌మన్‌ మేట్‌: 14

 

వేతనశ్రేణి

ట్రేడ్స్‌మన్‌ మేట్‌ (మజ్దూర్‌): లెవెల్‌ 1కు రూ.18,000-56,900. 

జేఓఏ లెవెల్‌-2కు రూ. 19,900-56,900

మెటీరియల్‌ అసిస్టెంట్‌: లెవెల్‌ 5కు  రూ. 29,200-92,300

ఎంటీఎస్‌: లెవెల్‌ 1కు రూ.18,000-56,900

ఫైర్‌మన్‌: లెవెల్‌ 1కు రూ.18,000-56,900

ట్రేడ్స్‌మన్‌ మేట్‌: లెవెల్‌ 1కు రూ.18,000-56,900

 

విద్యార్హతలు 

ట్రేడ్స్‌మన్‌ మేట్‌ (మజ్జూర్‌): గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్‌/ పదో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 

జేఓఏ (ఎల్‌డీసీ): ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. 

మెటీరియల్‌ అసిస్టెంట్‌: ఏదైనా డిగ్రీ / తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. లేదా మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పాసై ఉండాలి. 

ఎంటీఎస్‌/ ఫైర్‌మన్‌/ ట్రేడ్స్‌మన్‌ మేట్‌: పదో తరగతి/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.

 

దరఖాస్తు విధానం: సంస్థ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి ఆర్డినరీ/ రిజిస్టర్‌/ స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపాలి. 

 

దరఖాస్తు ఫీజు లేదు.దరఖాస్తుకు చివరి తేది: ఈ ఉద్యోగ ప్రకటన ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ పత్రికలో జులై 10న వెలువడింది. అభ్యర్థులు ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేయాలి.

 

చిరునామా: కమాండెంట్, 41 ఫీల్డ్‌ అమ్యూనిషన్‌ డిపో, పిన్‌-909741, కేరాఫ్‌ 56 ఏపీవో. 

 

వెబ్‌సైట్‌:  https://joinindianarmy.inc.in/

Posted Date : 22-07-2021

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌