• facebook
  • whatsapp
  • telegram

ప‌ది చాలు.. నేవీలో చేరేందుకు!

చెఫ్‌, స్టీవార్డ్‌, హైజీనిస్ట్ పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న‌

రాత, మెడిక‌ల్ ఫిట్‌నెస్ ప‌రీక్ష ద్వారా ఎంపిక‌లు

భార‌త ర‌క్ష‌ణ రంగంలో చేర‌డ‌మంటే యుద్ధం చేయ‌డం ఒక్క‌టే ఉండదు. ఇంకా ఎన్నో రకాల విధులు, బాధ్య‌త‌లు ఉంటాయి. సైనికులకు, అధికారుల‌కు సాయంగా పనులు చేసేవారు ఎందరో ఉంటారు.  ఉదాహ‌ర‌ణ‌కు వంట చేయ‌డానికి సిబ్బంది త‌ప్ప‌నిస‌రి. అలాగే ఆహారం వ‌డ్డించ‌డానికి, గ‌దులు, స‌బ్‌మెరైన్స్ శుభ్రం చేయ‌డానికి మనుషులు కావాలి.  వీటి కోసం కూడా ప్రత్యేకంగా నియామకాలు జరుగుతుంటాయి. తాజాగా అందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. అక్టోబరులో ప్రారంభ‌మ‌య్యే మెట్రిక్ రిక్రూట్‌ (ఎంఆర్‌) బ్యాచ్ కోసం అవివాహిత పురుషుల నుంచి భారత నావికాదళం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. సుమారు 350 చెఫ్‌, స్టీవార్డ్‌, హైజీనిస్ట్ పోస్టులున్నాయి. 

అర్హ‌త‌లు

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించాలి. నేవీ నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు క‌లిగి ఉండాలి. అభ్య‌ర్థులు ఏప్రిల్ 1, 2001 నుంచి సెప్టెంబ‌ర్ 30, 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 

ఎంపిక విధానం

అర్హులైన అభ్య‌ర్థుల‌కు ముందుగా రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అందులో అర్హ‌త సాధించిన వారికి ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. ఇందులోనూ పాసైతే మెడిక‌ల్ టెస్ట్ నిర్వ‌హించి, శిక్ష‌ణ‌కు ఎంపిక చేస్తారు. శిక్ష‌ణ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు.  

ద‌ర‌ఖాస్తు చేయండిలా..

అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జులై 19, 2021న మొద‌లై జులై 23, 2021న ముగుస్తుంది.

రాత ప‌రీక్ష 

రాత ప‌రీక్ష ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్‌మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనిలో రెండు సెక్షన్లు ఉంటాయి. 1) సైన్స్‌ అండ్‌ మ్యాథమేటిక్స్‌) జనరల్‌నాలెడ్జ్. ప్రశ్నల సరళి పదో తరగతి సిలబస్‌స్థాయిలోనే ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు. క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా రాత ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు క‌నీసం మూడు రోజుల ముందు చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్ ప‌రీక్ష ధ్రువ‌ప‌త్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. 

దేహ‌దార్ఢ్య ప‌రీక్ష‌

రాత ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన వారిని మెడిక‌ల్ ఫిట్‌సెస్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. 7 నిమిషాల్లో 1.6 కిలోమీట‌ర్ల  ప‌రుగు పూర్తి చేయాలి. 20 స్క్వాట్స్‌, 10 పుష్ అప్స్ చేయాల్సి ఉంటుంది.

శిక్ష‌ణ ఎక్క‌డ‌?

ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఐఎన్ఎస్ చిల్కాలో 12 వారాల బేసిక్ శిక్ష‌ణతోపాటు కేటాయించిన విభాగంలో ప్రొఫెష‌న‌ల్ శిక్ష‌ణ ఇస్తారు. అనంత‌రం బ్రాంచి/ ట్రేడ్‌ల వారీగా విధుల్లోకి తీసుకుంటారు. 

జీత‌భ‌త్యాలు

అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణ సమ‌యంలో నెల‌కు రూ.14,600 స్టైపెండ్ చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారికి విభాగాల‌ను బ‌ట్టి రూ.21,700 నుంచి రూ.69,100 ఇస్తారు. ఇత‌ర అల‌వెన్సులు అద‌నం. ఆయా పోస్టుల‌కు ఉద్యోగోన్న‌తి కూడా ల‌భిస్తుంది. అందుకు త‌గ్గ‌ట్టు జీతంలో కూడా పెరుగుద‌ల ఉంటుంది. 

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Posted Date : 08-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌