• facebook
  • whatsapp
  • telegram

నేవీలో 362 ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ ఉద్యోగాలు

* అర్హత: పదోతరగతి, ఐటీఐ


 

భారత నౌకాదళం 362 ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. పదోతరగతి అనంతరం ఐటీఐ కోర్సులు పూర్తిచేసినవారు వీటికి పోటీపడవచ్చు. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ప్రతిభతో నియామకాలు చేపడతారు. 

ఎంపికైనవారు అండమాన్‌ అండ్‌ నికోబార్‌ కమాండ్‌లో విధులు నిర్వర్తించాలి. వీరికి లెవెల్‌-1 స్కేలు వేతనం దక్కుతుంది. 

ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పెద్ద మొత్తంలో దరఖాస్తులు వస్తే పదో తరగతి మార్కుల మెరిట్‌ ప్రకారం ఒక్కో ఖాళీకి 25 మందిని చొప్పున పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తారు. 

వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతితో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌/ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 25, జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 25, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. వ్యవధి 2 గంటలు. పరీక్షలో విజయవంతమైతే, వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. ప్రశ్నలు ఏ అంశాల్లో ?  

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: మ్యాథ్స్‌ ఆపరేషన్స్, సిరీస్, ఆడ్‌మెన్‌ అవుట్, లాజికల్‌ వెన్‌ డయాగ్రమ్‌లు, ఎనాలజీ, వర్డ్‌ బేస్డ్‌ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డ్రాయింగ్‌ ఇన్‌ఫరెన్స్, కోడింగ్‌ డీకోడింగ్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. 

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: నంబర్‌ సిస్టమ్స్, టైమ్‌ అండ్‌ వర్క్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, సరాసరి, లాభనష్టాలు, రాయితీ, శాతాలు, కాలం-దూరం, వడ్డీలు, స్టాటిస్టికల్‌ చార్టులు, చలనజ్యామితి, త్రికోణమితిల్లో ప్రశ్నలు ఉంటాయి. 

జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: పదసంపద, వ్యాకరణం, వాక్య నిర్మాణం, సమానార్థాలు, వ్యతిరేక అర్థాలు, వాడుక...తదితర అంశాల నుంచి అడుగుతారు. 

జనరల్‌ అవేర్‌నెస్‌: పొరుగు దేశాలతో భారత్‌ సంబంధాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళికాంశాలు, భౌతిక, రసాయనశాస్త్రాలు, పర్యావరణం, ఆర్థిక, వర్తమాన అంశాలు, విధివిధానాలు, భారత రాజ్యాంగం, సైన్స్‌ పరిశోధనల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

ఈ ప్రశ్నలన్నీ సాధారణ స్థాయిలోనే ఉంటాయి. వీటికి జవాబులు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్‌ పుస్తకాలు బాగా చదువుకుంటే అధిక మార్కులు సాధించవచ్చు. ఇప్పటికే బ్యాంకు, రైల్వే పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు ఈ పరీక్షను సులువుగానే ఎదుర్కోగలరు. విధులు, వేతనం..

ఉద్యోగంలో చేరినవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. అన్నీ కలిపి రూ.30 వేల వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు. వీరు ప్రధానంగా సబ్‌మెరైన్లు, షిప్పుల ఉత్పత్తి/నిర్వహణ విధుల్లో పాల్గొంటారు. వీటికి సంబంధించిన వివరాలు నమోదు, ఫైళ్లను తీసుకెళ్లడం, కార్యాలయం, ఫర్నిచర్, పార్కులు మొదలైనవి శుభ్రపరచడం..తదితరాలు వీరి బాధ్యతల్లో భాగం. అలాగే కార్యాలయాల్లో చేయాల్సిన నాన్‌ క్లరికల్‌ సహాయక కార్యక్రమాల్లో వీరు భాగమవుతారు. 

మొత్తం ఖాళీలు: 362

అర్హత: పదోతరగతితోపాటు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్‌ అవసరం. 52 ట్రేడుల్లో ఎందులోనైనా ఏడాది లేదా రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: సెప్టెంబరు 25, 2023 నాటికి 18-25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 26 ఉదయం 10 గంటల నుంచి, సెప్టెంబరు 25 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు. ఈ సమాచారం ఈమెయిల్, మొబైల్‌కు అందుతుంది. పరీక్షను పోర్టు బ్లెయిర్‌లో నిర్వహిస్తారు.  

వెబ్‌సైట్‌: https://karmic.andaman.gov.in/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పర్యటనలే ఉద్యోగమైతే!

‣ ‘నెట్‌వర్క్‌’తో లాభాలెన్నో!

‣ ఆన్‌లైన్‌ దరఖాస్తు చాలు.. 15 రోజుల్లో విద్యారుణం!

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

Posted Date : 24-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌