గణితానికి సంబంధించి అన్ని అధ్యాయాలను పూర్తిగా సాధన చేయాలి. ముఖ్యంగా సూత్రాలను గుర్తుంచుకోవాలి. ప్రతి అధ్యాయంలో పట్టు సాధించడానికి, కేటాయించిన సమయంలో పరీక్ష రాయాలంటే ప్రాక్టీస్ పేపర్లు, మోడల్ పేపర్ల ఎక్కువగా సాధన చేయాలి
స్కూల్ అసిస్టెంట్ గణితం
* 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించి సన్నద్ధం కావాలి.
* ముఖ్యంగా సదిశా బీజ గణితం, కలన గణితం, త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితంలోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
* గత ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే ఎక్కువగా రేఖాగణితం, బీజగణితంలోని ప్రశ్నలు వచ్చాయి.
* ప్రతి చాప్టర్లోని వివిధ రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే పూర్తి స్థాయి మార్కులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
* రోజువారీ ప్రణాళికతో సిద్ధమైతే మీరే విజేతగా నిలవొచ్చు.
* అన్ని అధ్యాయాలు పూర్తయ్యాక ప్రాక్టీస్ పేపర్లను సాధన చేయడం వల్ల మన లోటుపాట్లు తెలియడంతో పాటు నిర్దిష్ట సమయంలో పూర్తిచేస్తున్నామా, లేదా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఆన్లైన్లో మాక్ టెస్ట్లు రాయడం వల్ల చాలా ఉపయోగకరం. రాజ్యాంగ షెడ్యూల్లోని అన్ని భాషల్లోనూ ఆర్ఆర్బీల నియామక పరీక్షలు నిర్వహించాలని ఆర్జేడీ నేత మనోజ్ ఝా కోరారు.