• facebook
  • whatsapp
  • telegram

సాధన చేద్దాం.. సాధించేద్దాం!

* 4,336 బ్యాంకు కొలువులు 
* ఐబీపీఎస్‌ ప్రకటన

బ్యాంకు ఆఫీసర్‌ కొలువు... ఎందరో ఉద్యోగార్థుల కల! ఇలాంటివారికి శుభ వర్తమానం అందిస్తూ 4336 పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్‌ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హత, 20-30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడంచెల పరీక్షలో నెగ్గటం కోసం ఇప్పటినుంచే సమగ్రంగా సన్నద్ధం కావాలి. ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండింటిలోనూ ఒకే విధమైన సబ్జెక్టులున్నాయి. కాబట్టి ప్రిపరేషన్‌ కూడా కలిసే ఉండాలి. మెయిన్స్‌కు సిద్ధమైతే ప్రిలిమ్స్‌కూ సిద్ధమైనట్లే. చివరివరకూ నేర్చుకోవడం కాకుండా సాధనపైనా దృష్టిపెట్టాలి. ఇలా చేస్తే బ్యాంకులో పాగా సాధ్యమే!
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజిమెంట్‌ ట్రైనీల భర్తీకి ఐబీపీఎస్‌ నిర్వహించే ఉమ్మడి భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్‌ విడుదలైంది. 4336 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నప్పటికీ తుది నియామకాలు జరిగే సమయానికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రాతపరీక్షలూ, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల్లోని ప్రతి విభాగంలో కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు కోత విధిస్తారు. ప్రిలిమినరీ, మెయిన్స్‌ల్లో ఉన్న మొత్తం ఏడు విభాగాలను పరిశీలిస్తే, ప్రిలిమినరీలోని మూడు విభాగాలు మెయిన్స్‌లోనూ ఉన్నాయి. ప్రిలిమ్స్‌లోని క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, మెయిన్స్‌లోని డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ఒకే విభాగానికి చెందినవి. మెయిన్స్‌కు సన్నద్ధమైతే ప్రిలిమినరీ సన్నద్ధత కూడా పూర్తవుతుంది.


ఏ విభాగంలో ఎలా?
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమినరీలోని ఈ విభాగంలో సాధారణంగా ప్రశ్నలు సింప్లిఫికేషన్స్‌, అప్రాక్సిమేట్‌ వాల్యూస్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, పర్ముటేషన్‌- కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ, వివిధ అరిథ్‌మెటిక్‌ అంశాల నుంచి ఉంటాయి.

 

* డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌: మెయిన్స్‌లోని ఈ విభాగం సాధించడానికి అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా పర్సంటేజెస్‌, యావరేజ్‌, రేషియో-ప్రపోర్షన్‌లపై మంచి అవగాహన వుండాలి. కాల్‌క్యులేషన్స్‌ వేగంగా చేయగలగాలి. ఈ విభాగానికి ప్రాక్టీస్‌ బాగా అవసరం.
 

రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండింటిలోనూ రీజనింగ్‌ ఉంది. పీఓ పరీక్షకు రీజనింగ్‌ ప్రశ్నలు హెచ్చుస్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నల్లో ఆప్షన్లు అన్నీ సరైనవే అనిపించేలా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంగ్లిష్‌ పరిజ్ఞానం పెంచుకుంటే ఇలాంటి ప్రశ్నలు సులభంగా సాధించే అవకాశం వుంటుంది. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 5-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.
 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటితోపాటుగా డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లోనూ ఈ విభాగం ఉంది. చాలా ముఖ్యమైనది. సాధారణంగా ప్రశ్నలు వచ్చే సెంటెన్స్‌ కంప్లీషన్‌, పారా జంబుల్డ్‌, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, క్ల్లోజ్‌ టెస్ట్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ మోడల్‌ ప్రశ్నలతోపాటు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌ ప్రశ్నలుంటాయి. గ్రామర్‌పై పట్టుంటే వీటిని తేలికగా సాధించవచ్చు. పాసేజీ వేగంగా చదివి అర్థం చేసుకోగలిగితే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు సాధించవచ్చు.
డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో లెటర్‌, ఎస్సే రైటింగ్‌ ఉంటాయి. ఏదైనా విషయాన్ని తీసుకొని 150-200 పదాలతో ఎస్సే రాయగలిగేలా చూసుకోవాలి. ఎక్కువమంది బ్యాంకు పరీక్షలలో ఫెయిలయ్యేది ఈ విభాగంలోనే అనేది గుర్తుంచుకొని సాధన చేయాలి.

Posted Date : 08-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌