• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకింగ్ అంశాల‌పై అవ‌గాహ‌న‌

బ్యాంకింగ్ ప‌రీక్ష‌లో భాగంగా కరెంట్‌ అఫైర్స్‌, బ్యాంకింగ్‌ టర్మినాలజీ, స్టాండర్డ్‌ జీకేల నుంచి ప్రశ్నలుంటాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలుంటాయి. గత 5, 6 నెలలకు సంబంధించిన తాజా పరిణామాలు బాగా చూసుకోవాలి. ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ మొదలైనవి. అంతర్జాతీయ సంస్థలు, నీతి ఆయోగ్‌, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ వ్యవస్థ, కేంద్రప్రభుత్వ పథకాలు, స్టాక్‌ మార్కెట్‌, జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలను తెలుసుకోవాలి. కేవలం ప్రశ్నకు జవాబు అనే రీతిలో కాకుండా, విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వాటిని తమ అభిప్రాయాలతో విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటే ఇంటర్వ్యూ సమయంలోనూ ఉపయోగం.
ప్రిలిమినరీకి దాదాపుగా రెండున్నర నెలల సమయం ఉంది. ఆలోగా మెయిన్స్‌లోని విభాగాలకూ సన్నద్ధత పూర్తయ్యేలా చూడాలి. తొలిసారిగా బ్యాంకు పరీక్షలు రాసేవారు టాపిక్స్‌ నేర్చుకోవడంతోపాటు వాటిలో వివిధ స్థాయుల ప్రశ్నలు సాధన చేయాలి. పరీక్ష తరహాలో పూర్తిస్థాయి మోడల్‌ ప్రశ్నపత్రాలను సమయాన్ని నిర్దేశించుకుని రాయాలి. దీనిద్వారా నిర్దేశించిన సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో అవగతమవుతుంది. తగినట్లుగా సన్నద్ధతలో మార్పులు చేసుకోవచ్చు. గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ప్రశ్నలు ఏ విధంగా, ఏ స్థాయిలో వుంటున్నాయో తెలుస్తుంది. రోజులో ఎన్ని గంటలు కేటాయిస్తున్నామని కాకుండా ఎంత నిబద్ధతతో ప్రిపేర్‌ అవుతున్నారనేది ముఖ్యం.

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌