• facebook
  • whatsapp
  • telegram

పల్లె బ్యాంకుల కొలువు పిలుపు

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో రీజినల్ రూరల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. సొంత ఊళ్లకు దగ్గరగా పనిచేయాలనుకు వారికి అనుకూలమైన ఉద్యోగాలు ఇవి.

ఎంపిక ఎలా?

రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. స్కేల్ - 1 ఆఫీసర్లకు రెండు దశల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. స్కేల్ -2, 3 ఆఫీసర్లకు ఒక రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాటిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.

ప్రిపరేషన్ విధానం
పరీక్షల తేదీలను ఇంత వరకు ప్రకటించలేదు. త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. గత అనుభవాల దృష్ట్యా కనీసం రెండు నెలల సమయం ప్రిలిమ్స్ కు ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్, స్కేల్ -1 ఆఫీసర్ల పరీక్షల్లో రెండు సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. మొదటిసారి పరీక్షలు రాసే అభ్యర్థులకు కూడా ఈ సమయం సరిపోతుంది. ఇందులో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి 80 ప్రశ్నలు వస్తాయి. 45 నిమిషాల సమయం ఇస్తారు. అంటే సరాసరిన అర నిమిషం మాత్రమే ఉంటుంది. మంచి మార్కులు సాధించాలంటే విస్తృతమైన సాధన చేయాలి.

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌