• facebook
  • whatsapp
  • telegram

స‌న్నద్ధ‌త‌కు సూత్రాలు

అసిస్టెంట్‌ లోకో పైలట్లకు ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. అందుకే ఎక్కువమంది అభ్యర్థులు ఈ పోస్టులపై మక్కువ చూపిస్తారు.  దీనికి ముందు నుంచే స‌రైన ప్ర‌ణాళిక‌తో సిద్ధం కావాలి.

ఎలా సన్నద్ధం కావాలి?
ప్రతిరోజూ ప్రతి సబ్జెక్టు మీదా శ్రద్ధ చూపాలి 
‣ ఒక నిర్ణీత సమయాన్ని ఒక్కో విభాగానికి కేటాయించుకోవాలి 
‣ మనకు తెలియని విభాగాన్ని చదివేటపుడు తెలిసినవారితో బృందచర్చ చేయటం మేలు. 
‣ ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను 3 నెలల్లో పూర్తిచేసి, మిగిలిన నెల రోజుల్లో పునశ్చరణ చేసుకోవాలి 
‣ ముందుగానే ప్రాక్టీస్‌/ నమూనా పేపర్ల జోలికి పోకూడదు. ముందు సబ్జెక్టు నేర్చుకొని తరువాత ఎక్కువ నమూనా పేపర్లు సాధన చేయాలి
‣ అభ్యర్థులు టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ అంశాలకు సమప్రాధాన్యం ఇవ్వాలి. 
‣ అవగాహన లేని విభాగాన్ని ఎక్కువసార్లు అభ్యసిస్తే తొందరగా నేర్చుకొనే అవకాశం ఉంది. 
‣ 'ఎంతసేపు చదివాం' అనేది కాకుండా 'ఎంత నేర్చుకున్నాం' అన్నది ముఖ్యం 
‣ ఎక్కువగా ప్రాథమికాంశాలు (basics) అడుగుతారు. అందుకని అన్ని విభాగాల్లో వీటిని నేర్చుకోవడం మంచిది. 
‣ రుణాత్మక మార్కులున్నందున పరీక్ష రాసేటప్పుడు తెలిసింది మాత్రమే జవాబుగా గుర్తించాలి. 
‣ 'ఉద్యోగం సంపాదించాలి' అనే పట్టుదలను అది సాధించేవరకూ మరచిపోకూడదు

సంప్రదించాల్సిన పుస్తకాలు
Technical: Mechanical & Automobile Objective Type R.K. Jain, Kurmi
Electrical & Electronics: S.S. Gupta
Non-Technical:
Arthemattic: R.S. Agawrwal, Arihant
Reasoning: R.S. Agarwal
General Studies: Arihant, S.K. Publication

 

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌