• facebook
  • whatsapp
  • telegram

టెక్నికల్ సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ 

ఈ పరీక్షలో టెక్నికల్, నాన్ టెక్నికల్ సబ్జెక్టులు (అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్) నుంచి ప్రశ్నలుంటాయి. ఇందుకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు ఐటీఐ/ ఇంజినీరింగ్/ ఇంటర్ ఎంపీసీ అర్హత కలిగి ఉండాలి. కాబట్టి అభ్యర్థులు అన్నీ సబ్జెక్టుల మీద అవగాహన తప్పనిసరి. కాబట్టి ఈ రెండింటిలో పట్టు సాధించాలి.ముఖ్యంగా టెక్నికల్ సబ్జెక్టుల పరంగా చూస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

టెక్నికల్ సిలబస్
1. మెకానికల్ ఇంజినీరింగ్:
ఈ విభాగం నుంచి ముఖ్యంగా ఇంజినీరింగ్ మెటీరియల్స్‌లో- ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్, టెస్టింగ్ మెటీరియల్స్, ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్, హీట్ ట్రీట్‌మెంట్ ఆఫ్ స్టీల్, ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
వర్క్‌షాప్ టెక్నాలజీ: వర్క్‌షాప్ టెక్నాలజీలో చూస్తే ముఖ్యంగా- మెజర్‌మెంట్స్ అండ్ యూనిట్స్, హాండ్ టూల్స్ ఫర్ మెజరింగ్, గేజెస్, మార్కింగ్ టూల్స్, కట్టింగ్ టూల్స్, హోల్డింగ్ టూల్స్ అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు.
ప్రొడక్షన్ టెక్నాలజీ: ప్రొడక్షన్ టెక్నాలజీలో చూస్తే- లాథే మెషీన్ అండ్ ఆపరేషన్స్, వెల్డింగ్, డ్రిల్లింగ్, రీమింగ్, బేరింగ్ గ్రైండింగ్, బ్రేజింగ్, షేపర్, స్లాటర్, ప్లానర్, సర్ఫేస్ ఫినిషింగ్, మిల్లింగ్, తదితర అంశాలపైన ప్రశ్నలు రావచ్చు.
మెషిన్ డిజైన్: మెషిన్ డిజైన్‌లో- థ్రెడ్స్, స్క్రూస్, రివెట్స్, కీస్, కప్లింగ్స్ షాఫ్ట్స్, క్లచెస్, వి-బెల్ట్ డ్రైవ్స్, గేర్ డ్రైవ్స్, లిమిట్స్ ఫిట్స్, టోలరెన్స్‌పై ప్రశ్నలుంటాయి.
థర్మో డైనమిక్స్: థర్మో డైనమిక్స్‌లో పరిశీలిస్తే- థర్మో డైనమిక్ సిస్టమ్స్, ప్రాపర్టీస్, ప్రాసెసర్, లాస్ ఆఫ్ డైనమిక్స్ పైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్‌లో- స్టాండర్డ్ అండ్ యాక్చువల్ వేపర్ కంప్రెసన్ సైకిల్ అనాలిసిస్, ఇంఫ్లుయెన్స్ ఆఫ్ వేరియస్ పారామీటర్స్ ఆన్ సైకిల్ పెర్ఫామెన్స్, టైప్స్ ఆఫ్ మల్టీ ప్రెజర్ సిస్టమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ రిఫ్రిజిరాంట్, ప్రాపర్టీస్ ఆఫ్ రిఫ్రిజిరాంట్స్, సైక్రోమెట్రిక్ ఛార్ట్, బేసిక్ సైక్రోమెట్రిక్ ప్రాసెస్, బేసిక్స్ ఆఫ్ ఎయిర్ కండీషనింగ్ ఎక్విప్‌మెంట్స్, తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
2. ఆటోమొబైల్ ఇంజినీరింగ్: ఈ విభాగం నుంచి ఇంటర్నల్ కంబూషన్ ఇంజిన్‌లో- ఇంజిన్ కాంపోనెంట్స్, 4- స్ట్రోక్ ఇంజిన్, 2- స్ట్రోక్ ఇంజిన్, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ గురించి తెలుసుకోవాలి. వీటితో పాటు పవర్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఆటోమొబైల్‌లో కూడా అవగాహన ఉండాలి.
3. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: ఈ విభాగం నుంచి రెసిస్టాన్స్, ఓమ్ లా, కిర్కాఫ్స్ లాస్, కరెంట్, వోల్టేజ్, పవర్, ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్స్ - కెపాసిటాన్స్, మేగ్నటిజం - ఇండక్టన్స్, సెల్స్ అండ్ బ్యాటరీస్, ఏసీ ఫండమెంటల్స్, డీసీ మెషీన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఏసీ మెషీన్స్ అప్లికేషన్స్‌లో ఇండక్షన్ మెషీన్స్, సింక్రనస్ మెషీన్స్ ట్రాన్స్‌ఫార్మర్స్, ఆల్టర్నేటర్స్ అంశాలపై నుంచి ప్రశ్నలు వస్తాయి.
4. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: ఈ విభాగం నుంచి అటామిక్ స్ట్రక్చర్, సెమీ కండక్టర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఆంప్లిఫ్లయర్స్, ఆసిలేటర్స్, ట్రాన్సిమీటర్స్- రిసీవర్స్, వేవ్ ప్రాపగేషన్, టీవీ - రాడార్స్, మైక్రోఫోన్స్, అకౌస్టిక్స్, లౌడ్ స్పీకర్స్, డిజిటల్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్, మెజరింగ్ ఇంస్ట్రుమెంట్స్, తదితర అంశాలపై నుంచి ప్రశ్నలు వస్తాయి.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌