బ్యాంకు పరీక్షల్లో వేగం, కచ్చితత్వం, నిలకడతనం.. విజయానికి సోపానాలు. పరీక్షల్లో విజయం సాధించడానికి నిర్ణీత సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించడం ముఖ్యం. కాబట్టి, ప్రశ్నలను వేగంగా సాధించేలా ఉండాలి. ఈ క్రమంలో తప్పులు చేసే అవకాశమెక్కువ. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. వేగంతోపాటు కచ్చితత్వానికీ ప్రాధాన్యమివ్వాలి. ఈ నిలకడతనాన్ని కొనసాగించాలి. పోటీపరీక్షల్లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను సాధించాల్సి రావడం కనిపిస్తుంటుంది. వీటిల్లో సాధించకుండానే గుర్తించగల ప్రశ్నలుంటుంటాయి. బాగా సాధన చేయడం ద్వారానే ఈ నైపుణ్యం సాధ్యమవుతుంది. అలాగే వేగంగా ప్రశ్నలను సాధించే వివిధ పద్ధతులూ తెలుస్తాయి. ఇవన్నీ పరీక్షలో విజయం సాధించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఏమేరకు అలవరచుకున్నారో మోడల్ పేపర్స్ సాధనలో తెలుసుకోవచ్చు. వీలైనంతవరకూ మోడల్ పేపర్స్‌ను అసలు పరీక్ష మాదిరిగానే ఆన్‌లైన్‌లో ప్రయత్నించాలి. పరీక్ష సమయానికి నిర్ణీత సమయంలో 90% ప్రశ్నలను 95% కచ్చితత్వంతో సాధించగలిగేలా సాధన చేయాలి. ప్రిలిమ్స్ వరకూ దాని తరహాలోనే, ఆపై మెయిన్స్‌ను దాని తరహాలోనే మాదిరి పరీక్షలు రాయాలి. సమయాన్ని ప్రణాళికబద్ధంగా వినియోగించుకుని, నిబద్ధతతో సన్నద్ధమైతేనే విజయం సాధ్యమవుతుంది.
ఆ మూడే కీలకం
Posted Date : 21-11-2020
ప్రత్యేక కథనాలు
- అతిపెద్ద బ్యాంకులో అత్యుత్తమ శిక్షణ
- బ్యాంకు కొలువుకు సిద్ధమేనా?
- క్లర్కు కొలువులకు పిలుపు
- ఉద్యోగ ఖాతా తెరుస్తారా!
- 10 తప్పులు.. చేయవద్దు!
- తొలిసారి రాసేవారు...
Previous Papers
విద్యా ఉద్యోగ సమాచారం
- APPSC: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల
- Latest Pvt Jobs: ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు
- Latest Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు
- Latest News: 27-03-2023 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
- SSC Exams: ప్రణాళికతో చదివితే పదిలో విజయం
- Study Tour: లండన్‌లో స్టడీటూర్‌కు తెలంగాణ విద్యార్థినులు
Model Papers
- SBI Clerks Mains - 5 2018
- SBI Clerks Prelims - 2 2018
- SBI Clerks Prelims - 1 2018
- SBI Clerks Mains - 3 2018
- SBI Clerks Mains - 4 2018