ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు చాలా పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైన పది పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే విజయానికి చేరువకావచ్చు.
1) సరైన ప్రణాళిక లేదా టైమ్-టేబుల్ లేకపోవడం: పరీక్ష తేదీ వరకు ఉన్న సమయం, సబ్జెక్టులు, దేనికి ఎంత సమయం కేటాయించాలి మొదలైన వాటి పట్ల అభ్యర్థికి స్పష్టమైన అవగాహన ఉండాలి. దానికి అనుగుణంగా స్వీయ ప్రణాళిక వేసుకొని తప్పనిసరిగా ఆచరించాలి.
2) కొన్ని సబ్జెక్టులపైనే దృష్టి కేంద్రీకరించడం: పరీక్షలో అభ్యర్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. తమకు నచ్చిన ఏవో కొన్నింటి పైనే ఎక్కువ దృష్టిపెడితే మిగిలిన సబ్జెక్టుల్లో నష్టం జరగవచ్చు.
3) పరిమాణంపై దృష్టి పెట్టి, నాణ్యతను విస్మరించడం: కొంతమంది రోజుకు 16 లేదా 18 గంటలు చదివాం అంటుంటారు. ఎన్ని గంటలు సిద్ధమైనా ఎంత నేర్చుకున్నారన్నదే ముఖ్యం. గంటలకు గంటలు సమయం గడిపి బాగా ప్రిపేర్ అవుతున్నాం అనుకోకూడదు. ఈ రోజు ఎంత నేర్చుకున్నారో కచ్చితంగా పరిశీలించుకోవాలి.
4) రివిజన్ చేయకపోవడం: అభ్యర్థులు తాము నేర్చుకున్న టాపిక్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు రివిజన్ చేయాలి. రివిజన్ చేయకపోతే వల్ల చదివింది సరిగా గుర్తుకు రాక మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.
5) తాజా మోడల్ ప్రశ్నలకు, ట్రెండ్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ లేకపోవడం: ప్రతి పరీక్షలోనూ ఎంతో కొంత మార్పు కనిపిస్తుంటుంది. గత పరీక్షలను పరిశీలించి ప్రిపేర్ కావాలి. అదే సిలబస్, అవే ప్రశ్నలు అంటూ పరీక్ష సరళిని గమనించకుండా సాగితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
6) ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్స్‌కు ప్రిపేరవడం: ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ సంగతి చూద్దామని కొందరు అనుకుంటారు. అప్పుడు సమయం సరిపోక ఫెయిల్ అవుతారు. అందుకే ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఏకకాలంలో ప్రిపరేషన్ ఉండాలి. కామన్ టాపిక్స్ నుంచి మొదలు పెట్టాలి.
7) ఆన్‌లైన్ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయకపోవడం: పరీక్షలు ఆన్‌లైన్ పద్ధతిలోనే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల అసలు పరీక్ష సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా ఉంటుంది.
8) మోడల్ పేపర్ విశ్లేషించుకోకపోవడం: అభ్యర్థులు మోడల్ పేపర్ రాసిన తర్వాత దాన్ని విశ్లేషించుకోవాలి. ఎందులో వెనుకబడి ఉన్నారో గమనించాలి. మెరుగుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రిపరేషన్ గుడ్డిగా సాగకూడదు.
9) ఇంగ్లిష్ సబ్జెక్టుపై అశ్రద్ధ: ఇది ఎక్కువ మంది అభ్యర్థులు చేసే పొరపాటు. తెలిసిన భాషే కదా అని అశ్రద్ధ చేస్తారు. భాష తెలిసి ఉండటానికి, దానిలో అడిగే ప్రశ్నలకు తేేడా ఉంటుంది. అందుకే ఈ సబ్జెక్టుకు ప్రత్యేకంగా ప్రిపరేషన్ అవసరమే.
10) షార్ట్‌కట్స్ నేర్చుకోకపోవడం: సంప్రదాయ పద్ధతిలో ప్రశ్నలు సాధించడం వల్ల సమయం ఎక్కువ పడుతుంది. సంక్షిప్త పద్ధతుల (షార్ట్‌కట్స్) వల్ల తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టవచ్చు. వాటిని నేర్చుకోకపోతే నష్టపోతారు.
వీటితోపాటు సోషల్ మీడియాకు, ఇతర వినోదాలకు దూరంగా ఉండాలి. అప్పుడే పరీక్షపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది.
10 తప్పులు.. చేయవద్దు!
Posted Date : 10-02-2021
ప్రత్యేక కథనాలు
- ఆంగ్లంపై పట్టు ముఖ్యం
- కనీస మార్కులు తప్పనిసరి
- మార్పేమీ లేదు
- ఇవి చేయకండి
- ఆ మూడే కీలకం
- తొలిసారి రాసేవారు...
Previous Papers
విద్యా ఉద్యోగ సమాచారం
- Professors: మూడు రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా
- NEET: ‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం
- SSC: ఏప్రిల్ మూడు నుంచి పదోతరగతి పరీక్షలు
- Paper Leakage: భయపడి.. డిస్క్వాలిఫై చేసుకున్న ప్రవీణ్?
- TSPSC: ప్రశ్నపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయి?
- Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు
Model Papers
- SBI Junior Associates Prelims - 1
- SBI Junior Associates Prelims - 2
- SBI Clerks Prelims - 2 2018
- SBI Clerks Prelims - 4 2018
- SBI Clerks Mains - 3 2018