• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకు ఉద్యోగాల్లో పీవోకే క్రేజ్

బ్యాంకు ఉద్యోగాల్లో ఎక్కువ క్రేజ్, ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడేది ఎస్‌బీఐ పీఓ పరీక్షే. ప్రతి పరీక్షలోనూ ఈ సంస్థ కొన్ని నూతన తరహా మోడల్‌ ప్రశ్నలను ప్రవేశపెడుతుంది. మిగిలిన అంశాలతో పాటు వీటిని అవగాహన చేసుకుని కచ్చితంగా సాధించటం ముఖ్యం. ఆ దిశలో సన్నద్ధత సాగాలి!  

పీఓ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌ పరీక్ష, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ అండ్‌ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థుల్లో ఖాళీల సంఖ్యకు 10 రెట్ల అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. దానిలో ప్రతిభ చూపిన అభ్యర్థుల్లో ఖాళీలు సంఖ్యకు 3 రెట్లు అభ్యర్థులు గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ - ఇంటర్వ్యూకు అర్హులవుతారు.
మెయిన్స్‌ పరీక్ష, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ అండ్‌ ఇండర్వ్యూల మొత్తంలలోని ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దానిలోని మార్కులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.

సబ్జెక్టులు - అవగాహన

ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలో మొత్తం ఏడు సబ్జెక్టులు ఉన్నప్పటికీ ప్రిలిమినరీలోని సబ్జెక్టులు మెయిన్స్‌ పరీక్షలో ఉన్న సబ్జెక్టుల్లో అంతర్భాగంగానే ఉన్నాయి. మొత్తంగా చూస్తే 5 విభిన్న సబ్జెక్టులున్నాయి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

ప్రిలిమినరీ పరీక్షలో సాధారణంగా అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలు, సింప్లిఫికేషన్స్, నంబర్‌ సిరీస్, అప్రాక్సిమేట్‌ వేల్యూస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, పర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి. మెయిన్స్‌ పరీక్షలో ఎక్కువగా డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలుంటాయి. టేబుల్స్, లైన్‌గ్రాఫ్స్, బార్‌ డయాగ్రాం, ఫైచార్ట్‌లు మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి. ఒకటి కంటే ఎక్కవ గ్రాఫ్‌లు ఇవ్వడం ద్వారా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు చాలా హెచ్చుస్థాయిలో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగిన సాధన అవసరం.

రీజనింగ్‌

ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలోనూ ఉన్న విభాగమిది. ప్రశ్నలు హెచ్చుస్థాయిలో ఉంటాయి. ఎక్కువ సమయం పట్టే సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ నుంచి ప్రశ్నలు ఎక్కువ. దీంతోపాటు, కోడింగ్‌-డీకోడింగ్, సిలాజిజమ్స్, ఆల్పబెట్‌ సీక్వెన్సెస్, బ్లడ్‌ రిలేషన్స్, స్టేట్‌మెంట్స్, పజిల్‌ టెస్ట్, ఎలిజిబిలిటి టెస్ట్, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌ మొదలైనవి బాగా నేర్చుకోవాలి. త్వరగా సాధించగలిగేలా సాధన చేయాలి. మెయిన్స్‌ పరీక్షలో ఈ విభాగంలో కలిపే కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ ఉంది. దాని నుంచి 5-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దానిలో ఫ్లోఛార్ట్‌ సంబంధమైనవి బాగా చూసుకోవాలి.

జనరల్‌/బ్యాంకింగ్‌/ఎకానమీ ఎవేర్‌నెస్‌

దీనిలో బ్యాంకింగ్, ఆర్థిక రంగాల తాజా పరిణామాలపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలపై దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఆర్‌బీఐ, స్టాక్‌ మార్కెట్, ప్రాముఖ్యమున్న విషయాలు తెలుసుకోవాలి. విషయం పట్ల కుణ్ణమైన అవగాహన ఉంటే దానిపై ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. సరిగా చదివితే ఎక్కవ మార్కులు తెచ్చుకోగలిగే విభాగమిది.

Posted Date : 07-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers