• facebook
  • whatsapp
  • telegram

సులువుగా ఘనం కనుక్కుందాం! 

పోటీ పరీక్షల్లో లెక్కల చిట్కాలు

ఒకటితో మొదలయ్యే రెండంకెల సంఖ్య ఘనం కనుక్కునే పద్ధతిని గత వారం నేర్చుకున్నాం. ఈవారం ‘1’తో ముగిసే రెండంకెల సంఖ్య ఘనం కనుక్కునే విధానం తెలుసుకుందాం! ఈ మెలకువలు పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతో ఉపయోగం! 

‘1’తో ముగిసే రెండంకెల ఘనం

ఈ పద్ధతి ‘1’తో ముగిసే రెండంకెల సంఖ్య ఘనం తెలుసుకునే పద్ధతికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. 

మొత్తం నాలుగు స్థానాల్లో సంఖ్యలు రాయాల్సి ఉంటుంది. కుడి నుంచి ఎడమ వైపునకు రాస్తూ మొదటి స్థానంలో ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న ‘1’ని రాయాలి. రెండో స్థానంలో పదుల స్థానంలో ఉన్న అంకెను రాయాలి. మూడో స్థానంలో పదుల స్థానంలో ఉన్న అంకె వర్గాన్ని, నాలుగో స్థానంలో అదే అంకె ఘనాన్ని రాయాలి. 

ఆ తర్వాత ఆ నాలుగు స్థానాల్లోని అంకెల్లో మధ్య స్థానంలో (రెండో, మూడో) ఉన్న సంఖ్యలను రెట్టింపు చేసి వాటి కిందే రెండో వరుసలో ఉంచాలి. ఇప్పుడు రెండు వరుసల్లోని సంఖ్యలను కుడి నుంచి ఎడమ వైపుగా కూడాలి. రెండు వరుసల్లోని ఒక్కో స్థానంలోని సంఖ్యలను కూడగా వచ్చిన మొత్తంలో కేవలం ఒకట్ల స్థానంలోని అంకెను మాత్రం కింద రాసి మిగిలిన సంఖ్యను తర్వాతి స్థానంలో ఉండే సంఖ్యల మొత్తానికి కలపాలి. ఇలా రెండు వరుసల్లోని నాలుగు స్థానాల్లోని సంఖ్యలన్నీ కూడితే జవాబు వస్తుంది.

ఇదంతా ఉదాహరణ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 

31 ఘనం చూద్దాం.

313

కుడి నుంచి ఎడమవైపునకు రాస్తూ మొదటి స్థానంలో 31లోని ఒకట్ల స్థానంలో ఉన్న ‘1’ ని ఉంచాలి. 

- - - 1

తర్వాత స్థానంలో పదుల స్థానంలో ఉన్న ‘3’ని ఉంచాలి. 

- - 3 1

మూడో స్థానంలో 3 వర్గాన్ని (32 = 9)

- 9 3 1

నాలుగో స్థానంలో ‘3’ ఘనాన్ని (33 = 27) రాయాలి. 

ఇప్పుడు మధ్యలోని రెండు స్థానాల్లో ఉన్న రెండు సంఖ్యలను (9, 3) రెట్టింపు చేసి (18, 6) కింద రెండో వరుసలో ఉంచాలి. 

ఈ రెండు వరుసల్లోని సంఖ్యలను కూడాలి. 

మరో ఉదాహరణ

‘1’తో ముగిసే ఏ రెండు సంఖ్యల ఘనాన్నయినా ఈ పద్ధతిలో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.  

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

‣ సైన్యంలో సాంకేతిక పోస్టులు!

‣ కమ్యూనిటీ సైన్స్‌లో బీఎస్‌సీ

Posted Date : 26-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌