• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్లంపై ప‌ట్టు ముఖ్యం

బ్యాంక్ పరీక్షలో ఇంగ్లిష్‌ చాలా ముఖ్యమైన విభాగం. ప్రిలిమినరీ పరీక్షతో పాటు మెయిన్స్‌ పరీక్షలోని ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ రెండింటిలోనూ ఈ విభాగం ఉంది. ఎక్కువమంది అభ్యర్థులు విఫలమయ్యే విభాగం కూడా. కాబట్టి జాగ్రత్తగా సిద్ధమవ్వాలి. గ్రామర్‌ సంబంధమైన ప్రశ్నలు 40% దాకా ఉంటాయి. దానితో పాటుగా రీడింగ్‌ కాంప్రహెన్షన్, వొకాబులరీల నుంచి ప్రశ్నలుంటాయి. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌లుంటాయి. ఏదైనా ఒక విషయంపై 150-200 పదాల వరకు విస్తరిస్తూ ఎస్సే రాయగలిగేలా అభ్యాసం చేయాలి. వివిధ రకాల లెటర్స్‌ రాయడం కూడా సాధన చేయాలి. గ్రామర్‌పై పట్టుంటే ఈ విభాగం తేలికే. 

ప్రిపరేషన్‌ ఏ విధంగా?

ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ మొదటి వారంలో, జులై 20న మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్‌ ఉండాలి. తొలిసారి పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యం. ప్రిలిమినరీలోని విభాగాలన్నీ మెయిన్స్‌ లోనూ ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్‌ రెండింటికీ కలిపే ఉండాలి. ఎక్కువ సాధన అవసరమైన ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లకు సమయం కూడా కేటాయించాలి.
మొదటిరోజు నుంచే ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టులకు సన్నద్ధత మొదలుపెట్టాలి. అదేవిధంగా ప్రతిరోజూ మోడల్‌ పరీక్షలు రాయడం తప్పనిసరి. దాని ద్వారా ఏ విభాగంలో పట్టు ఉందో, లేదా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉంది. అదే విధంగా నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో కూడా తెలుస్తుంది. అది పెరిగేలా వారి సాధన ఉండేలా చూసుకోవాలి.

Posted Date : 24-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌