• facebook
  • whatsapp
  • telegram

మూడంచెల్లో  పరీక్ష

మూడు దశల్లో...
కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడానికి అవసరమైన నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం ఏటా ఎస్సెస్సీ సీహెచ్ఎస్ఎల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. మూడంచెల్లో నిర్వహించే ఈ పరీక్షలో ఒక అంకంలో నెగ్గినవారికే రెండో అంకానికి చేరడానికి అవకాశం లభిస్తుంది. ముందుగా టైర్-1 ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. టైర్-2 డిస్క్రిప్టివ్ పేపర్, టైర్-3 స్కిల్ టెస్టు/ టైపింగ్ టెస్టు. తుది నియామకాలు మాత్రం టైర్ 1, 2ల్లో చూపిన ప్రతిభ ద్వారా చేపడతారు. టైర్ 3లో అర్హత సాధిస్తే సరిపోతుంది. టైర్ 2 అర్హత కోసం 33 శాతం మార్కులు తప్పనిసరి. ఆయా శాఖల వారీ పోస్టుల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. ఎల్ డీసీ పోస్టుల్లో చేరినవారికి లెవెల్ 2 ప్రకారం రూ.19900 మూలవేతనం అందుతుంది. మిగిలిన పోస్టులకు లెవెల్ 4 ప్రకారం రూ.25500 మూలవేతనం దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్ ఆర్ ఎ, ఇతర ఆలవెన్సులు అదనం.
 

టైర్-1: ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవది గంట. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. తప్పుగా గుర్తించిన సమాధానానికి అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో 4 భాగాలు ఉంటాయి. ఆంగ్ల భాషలో ప్రాథమిక స్థాయిలో 25, జనరల్ ఇంటెలిజెన్స్ 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అరిథ్ మెటిక్ స్కిల్) 25, జనరల్ అవేర్ నెస్ 25 ప్రశ్నలు వస్తాయి. ఆంగ్ల విభాగం తప్ప మిగిలిన ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో వస్తాయి.
 

టైర్-2: ఈ పరీక్షను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పేపర్ పై పెన్నుతో రాయాలి. వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఇందులో 2 ప్రశ్నలు వస్తాయి. అడిగిన అంశంలో వ్యాసాన్ని 200-250 పదాల్లో రాయాలి. ఉత్తరం లేదా దరఖాస్తు 150-200 పదాల్లో పూర్తిచేయాలి. జవాబులను హిందీ లేదా ఇంగ్లిష్ లోనే రాయాలి. ఈ విభాగంలో అర్హతకు కనీసం 33 శాతం మార్కులు పొందడం తప్పనిసరి.
 

టైర్-3: దరఖాస్తు చేసుకున్న పోస్టు బట్టి స్కిల్ లేదా టైప్ టెస్టు నిర్వహిస్తారు. లోయర్ డివిజన్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు టైపింగ్ టెస్టు ఉంటుంది. ఈ పరీక్షల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. డేటా ఎంట్రీ పోస్టులకు టైపింగ్ లో భాగంగా కంప్యూటర్ పై 15 నిమిషాలకు 2000 నుంచి 2200 కీ డిప్రిషన్స్ ఇవ్వాలి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విభాగంలోని పోస్టులకైతే 15 నిమిషాలకు 3700-4000 కీ డిప్రిషన్స్ తప్పనిసరి. ఏదైనా సమాచారం ఇచ్చి దాన్ని కంప్యూటర్ లో పొందుపర్చమంటారు. తప్పులేమైనా టైప్ చేస్తే మార్కులు తగ్గిస్తారు. టైప్ టెస్టులో భాగంగా ఇంగ్లిష్ లేదా హిందీ ఎంచుకోవచ్చు. ఆంగ్లం అయితే నిమిషానికి 35, హిందీ 30 పదాల చొప్పున టైప్ చేయాలి. పది నిమిషాల వ్యవధితో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

Posted Date : 06-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌