• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్ర ఉపాధ్యాయుడు

విద్యార్హతలు:
* ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడు బీఎస్సీ, బీఈడీ చేసి ఉండాలి.

 

గుణాలు, లక్షణాలు:
* విద్యార్హతలతో పాటు కొత్త పద్ధతులు, కార్య సూక్ష్మతలు తెలిసి ఉండాలి.
* ఉపాధ్యాయుడు బోధించే పాఠానికి సంబంధించిన విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
* జీవశాస్త్రం యొక్క సాంస్కృతిక, నైతిక విలువలు తెలిసి ఉండాలి.
* శిశు కేంద్రీకృత విద్యలో అభిరుచి ఉండాలి.
* విద్యార్థులకు వ్యక్తిగతంగా ప్రయోగాలు చేసే అవకాశాన్ని కల్పించాలి.
* దినచర్యను క్రమం తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి.
* ఉపాధ్యాయ మ్యానువల్, ప్రయోగ దీపికను ఉపయోగించాలి.
గమనిక: జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం శాస్త్రీయ దృక్పథం.

ఉపాధ్యాయుడి లక్షణాలు - ప్రముఖుల అభిప్రాయాలు:
* 'పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటివారు. వారి ఆలనా పాలనా చూసే తోటమాలే ఉపాధ్యాయుడు. వారి ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ప్రోత్సాహం వల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారు'. - స్వామి వివేకానంద
* 'ఉపాధ్యాయుడు భవిష్యత్ రూపశిల్పి. దేశ భవిష్యత్ గది నాలుగు గోడల మధ్యే రూపుదిద్దుకుంటుంది'. - కొఠారీ
* 'నన్ను అందరూ గుడ్ టీచర్ అని అంటారు. నిజానికి అందులో సత్యం లేదు నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచించేలా చేశాను అంతే'. - సోక్రటీస్
* 'ఉపాధ్యాయుడు పిల్లలకు కిటికీ లాంటివాడు. పిల్లల అభ్యసనానికి, పరిజ్ఞానానికి అతడే ఆధారం. వారిలో సృజనాత్మకతను మేల్కొల్పే ఆదర్శమూర్తి పాత్ర పోషించాల్సింది అతడే'. - ఏపీజే అబ్దుల్ కలాం

 

కొఠారీ కమిషన్: విజ్ఞానశాస్త్రాన్ని సరైన పద్ధతుల్లో బోధించలేనప్పుడు జరిగే అనర్థాన్ని తన రిపోర్టులో ఇలా తెలిపారు.
         
"If science is poorly taught and badly learnt, it is little more than burdening the mind with dead information and it could degenerate even into a new superstition".

 

1986 జాతీయ విద్యా విధానం: ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఎంతో అవసరం అని తెలియజేస్తుంది.


 

వృత్యంతర శిక్షణలో ముఖ్యమైన అంశాలు:
* పాఠ్యాంశాల్లోని కష్టతర విషయాలు
* ఆధునిక బోధనా పద్ధతులు - శిశుకేంద్రీకృత కృత్యాధార పద్ధతులు
* కొత్త మూల్యాంకన పద్ధతులు - నిరంతర సమగ్ర మూల్యాంకనం
* కొత్త సవాళ్లను ఎదుర్కోవడం
ఉదా: బహుళ తరగతి బోధన, బహుళస్థాయి బోధన, పర్యావరణ విద్య, జనాభా, విద్య.

 

జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పోషించాల్సిన పాత్రలు:
* పూర్వం ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకంలోని విషయాలను విద్యార్థులకు చెప్పడం మాత్రమే తమ పనిగా భావించేవారు. ప్రస్తుత విద్యా విధానంలో ఉపాధ్యాయులు బహుముఖ పాత్రలను పోషించాలి అవి:
1. ప్రణాళికా రచయిత
2. నిర్వాహకుడు
3. నమోదుచేసే వ్యక్తి
4. సమన్వయకర్త
5. సౌకర్యకర్త
6. మధ్యవర్తి

ప్రణాళికా రచయిత:
* 'నిర్ణీత కాలవ్యవధిలో లక్ష్యసాధన కోసం గుణాత్మకంగా, నిర్మాణాత్మకంగా, సమగ్రంగా ఆచరణ సాధ్యమయ్యే పథకాన్ని తయారుచేసేవాడే ప్రణాళికా రచయిత'.
* ఇతడు ప్రధానంగా రెండు రకాల పథక రచనలు చేస్తాడు.
ఎ) పాఠ్య ప్రణాళిక పథక రచన
బి) సహ పాఠ్య ప్రణాళిక పథక రచన

 

ఎ) పాఠ్య ప్రణాళిక పథక రచన:
సిలబస్‌లో నిర్దేశించిన పాఠ్యాంశాలు ప్రణాళికా రచనకు పునాది.

* వేగంగా అభ్యసించే వారికి అదనపు కృత్యాలు ఇవ్వాలి.
* నెమ్మదిగా అభ్యసించే వారికి పునరభ్యసన కృత్యాలను ఇవ్వాలి.

 

బి) సహ పాఠ్య ప్రణాళిక పథక రచన:
* దీని ద్వారా విద్యార్థి విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పొందవచ్చు.

 

కింది అంశాల కోసం సహపాఠ్య ప్రణాళికా పథక రచన చేసుకోవాలి.
1) సైన్స్ క్లబ్‌లు
2) వైజ్ఞానిక ప్రదర్శనలు
3) వైజ్ఞానిక యాత్రలు, క్షేత్ర పర్యటనలు

 

నిర్వాహకుడు:
* పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాలను నిర్వహిస్తాడు.
* సైన్స్ కార్నర్‌ను నిర్వహిస్తాడు.

 

నమోదు చేసే వ్యక్తి:
* అమలుచేసే కార్యక్రమాలను నమోదు చేస్తాడు.

 

సమన్వయకర్త:
* పాఠ్య, పాఠ్యేతర అంశాలను సమన్వయపరచాలి.
* పాఠశాలకు, విద్యార్థుల తల్లిదండ్రులు, సంఘంలోని వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.

అన్వేషకుడు:
* కొత్త విషయాల అన్వేషణ పట్ల తగిన ఉత్సాహం ఉండాలి.
* జీవశాస్త్ర జ్ఞానాన్ని పిల్లలకు తెలియజేయాలి.
* పాఠ్య కార్యక్రమాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాలను రూపొందించడంలో అన్వేషకుడిగా మారాలి.

 

మధ్యవర్తి:
* జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కంటే సమస్య పరిష్కారం కనుక్కున్న విధానంపై ఎక్కువ ఆసక్తిని చూపాలి.

 

మార్గదర్శి:
* ఉపాధ్యాయుడు విద్యార్థికి రోల్ మోడల్‌గా ఉండాలి.
* విద్యార్థి శాస్త్రీయ వైఖరిని ఏర్పరచుకుని ఆదర్శ వ్యక్తిగా రూపొందడానికి ఉపాధ్యాయుడు మార్గదర్శిగా మారాలి.

 

సౌకర్యకర్త:
* ఉపాధ్యాయుడు సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు విద్యార్థులకు సౌకర్యకర్తలా ఉండాలి.

 

జీవశాస్త్ర ఉపాధ్యాయుడు స్వయంగా అభివృద్ధి చెందడం:
* ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. ఎమ్మెస్సీ, ఎంఈడీ, పీహెచ్‌డీ లాంటి డిగ్రీలు కూడా పొందాలి. దీని వల్ల జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి విషయ పరిజ్ఞానంతోపాటు వృత్తిపరంగా ఎదగడానికి వీలవుతుంది.

జీవశాస్త్ర సబ్జెక్టుపై తిరుగులేని ఆధిపత్యం:
* స్వతహాగా అధ్యయనం చేయడం
* సైన్స్ జర్నల్స్ చదవడం
* జీవశాస్త్ర ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలను సందర్శించడం


రచయిత: రాధాకృష్ణ

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌