• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్ర ఉపాధ్యాయుడు

1. జాతీయస్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు?
జ: CIET

2. 'ఉపాధ్యాయుడికి వృత్తి, విషయం, విద్యార్థి పట్ల ప్రేమ ఉండాలి' అని ఎవరన్నారు?
జ: సర్వేపల్లి రాధాకృష్ణ

3. 'నన్ను గుడ్ టీచర్ అని అందరూ అంటారు. నిజానికి అందులో సత్యం లేదు. నేను చేసిందల్లా నా విద్యార్థులను ఆలోచించేలా చేశాను అంతే' అని అన్నదెవరు?
జ: సోక్రటీస్

4. జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం?
జ: శాస్త్రీయ దృక్పథం

5. పునరభ్యసన కృత్యాలను ఎవరికి ఇవ్వాలి?
జ: నెమ్మదిగా  అభ్యసించేవారికి

 

6. విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు పోషించాల్సిన పాత్రలు?
1) సమన్వయకర్త      2) సౌకర్యకర్త        3) మధ్యవర్తి       4) అన్నీ
జ: 4 (అన్నీ)

7. కిందివాటిలో పాఠ్యప్రణాళిక రచనలో లేని అంశం?
1) వార్షిక పథకం     2) పీరియడ్ పథకం    3) వ్యక్తిగత భేదాలకు పథక రచన      4) సైన్స్ క్లబ్‌లు
జ: 4 (సైన్స్ క్లబ్‌లు)

8. కిందివాటిలో సహపాఠ్య ప్రణాళిక రచనలో లేని అంశం?
1) సైన్స్ క్లబ్‌లు    2) వైజ్ఞానిక ప్రదర్శనలు    3) వ్యక్తిగత భేదాలకు పథక రచన    4) పీరియడ్ పథకం
జ: 3 (వ్యక్తిగత భేదాలకు పథక రచన)

9. 'సైన్స్ కార్నర్‌'ను ఏర్పాటు చేయడంలో ఉపాధ్యాయుడి పాత్ర?
జ: నిర్వాహకుడు

10. విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు సహ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, పాలనా యంత్రాంగంతో ఎలా మెలగాలి?
జ: సమన్వయకర్త


రచయిత: రాధాకృష్ణ

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌