• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్ర బోధనా ఉపగమాలు - పద్ధతులు

 1. సమస్య పరిష్కార పథంలో పొందిన అనుభవాన్ని నూతన పరిస్థితులకు అన్వయించడం అనే సోపానాన్ని చూపేది?
జ: శాస్త్రీయ పద్ధతి


2. ఉపాధ్యాయుడు ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయని చెప్తే సత్య అనే విద్యార్థి HCతో పరీక్షించి ఆ విషయాన్ని నిర్థారించుకుంటే?
జ: నిగమన పద్ధతి


3. ఉపాధ్యాయుడు ''జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు" అనే పాఠం పేరును ప్రకటించాల్సి ఉంది. అయితే అప్పుడు ఉపాధ్యాయుడు అవలంబించాల్సిన పద్ధతి?

జ: ఉపన్యాస పద్ధతి


4. సిలబస్‌ను త్వరగా పూర్తిచేయడానికి ఉపయోగపడే పద్ధతి?
జ: నిగమనం

 

5. డాక్టర్ వై. సుబ్బారావు జీవిత చరిత్రను బోధించడానికి ఉపయోగపడే పద్ధతి
జ: ఉపన్యాస

6. సూచనా పత్రాలు కలిగిన బోధనా పద్ధతులు
జ: అన్వేషణ, ప్రయోగశాల

 

7. జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రానికి పెద్దపీట వేసిన పద్ధతి?
జ: ప్రకల్పన

 

8. శ్వాసక్రియలో వేడి విడుదలవుతుందని నిరూపించాల్సి వచ్చింది. తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ 8 ప్రయోగ పరికరాల సెట్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు విద్యార్థులు ఏ రకమైన ప్రయోగశాల పద్ధతిని అనుసరించాలి?
జ: 
Method − II (Group Method)
 

9. ప్రయోగం మరీ పెద్దదిగా, లేదా క్లిష్టంగా ఉన్నప్పుడు ఏ రకమైన ప్రయోగశాల పద్ధతిని అనుసరించాలి?
జ: 
Method − III (Part Method)
 

10. ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన చిత్రపటాన్ని సత్యం అనే విద్యార్థి చూసి ఆనందిస్తే అది ఏ ప్రాజెక్టు కిందకు వస్తుంది?
జ: వినియోగ ప్రాజెక్టు

 

11. కిందివాటిని జతపరచండి.

12. అన్వేషణ పద్ధతిని సమర్థించింది ఎవరు?
జ: వెస్టవే

 

13. అన్వేషణ పద్ధతిని విమర్శించింది?
జ: J.J. థామ్సన్

 

14. ప్రకల్పన పద్ధతిని సమర్థించింది?
జ: హెన్రీ డేవిడ్

 

15. అన్వేషణ పద్ధతిలో లేని సోపానం?
1) నిర్వచించడం             2) ప్రయోగాలు నిర్వహించడం
3) దత్తాంశాలను ప్రతిక్షేపించడం      4) వివరించడం
జ: 3(దత్తాంశాలను ప్రతిక్షేపించడం)

 

16. ఏ బోధనా పద్ధతిలో విద్యార్థి వినడంతో పాటు చూడటం ద్వారా కూడా నేర్చుకుంటాడు?
జ: ఉపన్యాస ప్రదర్శన

 

17. ప్రాజెక్టు పద్ధతిలో విద్యా ప్రణాళికకు కేంద్రంగా ఉండేది
జ: జీవితం

 

18. జీవశాస్త్రం కంటే భౌతికశాస్త్రాన్ని బోధించడానికి ఎక్కువ అనుకూలంగా ఉండే బోధనా పద్ధతి ?
జ: అన్వేషణ

19. 7వ తరగతిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ 5 పరికరాల సెట్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు వారు ఉపయోగించాల్సిన ప్రయోగశాల పద్ధతి?
జ: గ్రూప్ మెథడ్

 

20. 40 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో ఒకే పరికరం ఉంది. అప్పుడు ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన బోధనా పద్ధతులు?
జ: ఉపన్యాస ప్రదర్శన

 

21. ఒక ఉద్దేశంతో వేర్వేరు ప్రయోగాలు చేయాల్సి వచ్చినప్పుడు వాడే ప్రయోగశాల పద్ధతి రకం?
జ: మెథడ్-2

 

22. ఒక సందర్భంలో వాస్తవం అయిన ఒక విషయం లేదా సూత్రం అదేవిధమైన ఇతర సందర్భాల్లో కూడా వాస్తవం అవుతుందని తెలిపే సార్వత్రిక సత్యాన్ని రుజువు చేసే విధానం?
జ: ఆగమనం

 

23. సిద్ధాంతీకరించిన సూత్రాలు, ధర్మాలు, నూతన సందర్భాల్లో అన్వయించి వాటి యథార్థతను తెలుసుకునే పద్ధతి?
జ: నిగమనం

 

24. కిందివారిలో ప్రకల్పనా పద్ధతికి సంబంధించిన వ్యక్తి?
1) కిల్‌పాట్రిక్     2) బెల్లార్డ్      3) ఆర్మ్‌స్ట్రాంగ్      4) బర్టన్
జ: 3(ఆర్మ్‌స్ట్రాంగ్)

25. ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి?
జ: ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి

 

26. కిందివాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది?
1) ప్రయోగశాల     2) అన్వేషణ పద్ధతి     3) ప్రాజెక్టు పద్ధతి     4) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి
జ: 4(ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి)

 

27. లెక్టేర్ అనేది ఏ భాషా పదం?
జ: బిగ్గరగా చదవడం

 

28. బోధనా పద్ధతులు, ఉపగమాలు?
జ: రెండూ ఒకటి

 

29. ఉపన్యాస ప్రదర్శనా పద్ధతుల్లో ఉపాధ్యాయులు చేసే పొరపాట్లను తెలియజేసింది?
జ: సెల్‌బర్గ్

 

30. హ్యూరిస్కో అంటే అర్థం?
జ: కనుక్కోవడం

గత డీఎస్సీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతికి ఉదాహరణ?
జ: ఉపన్యాస పద్ధతి

 

2. హ్యురిస్టిక్ పద్ధతిని రూపొందించినవారు?
జ: హెచ్.ఇ. ఆర్మ్‌స్ట్రాంగ్

 

3. ప్రాజెక్టు పద్ధతిలోని ముఖ్యమైన లోపం?
జ: మూల్యాంకనం కష్టం

 

4. పాఠశాలలోకి దిగుమతి అయ్యే నిజ జీవిత భాగమే?
జ: బెల్లార్డ్

 

5. కిరణజన్య సంయోగ క్రియకు CO2 అవసరం అనేది?
జ: ప్రయోగ పద్ధతి

 

6. ''రేడియోధార్మికత" అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి అనుసరణీయమైన పద్ధతి?
జ: ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి

 

7. అన్వేషణ పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టింది?
జ: హెచ్.ఇ.ఆర్మ్‌స్ట్రాంగ్

8. దత్తాంశాలను ప్రక్షేపించడం అనేది ఏ పద్ధతిలోని సోపానం?
జ: శాస్త్రీయ - వైజ్ఞానిక పద్ధతి

 

9. తక్కువ సమయంలో అనేక భావనలను ఎక్కువ మందికి బోధించడానికి వీలు కలిగించే బోధనా పద్ధతి?
జ: ఉపన్యాస పద్ధతి

 

10. 'సహజ వాతావరణంలో పూర్తిచేసిన సమస్యాత్మక ప్రక్రియ' అనే వాక్యాన్ని దేన్ని ఉద్దేశించి తెలిపారు?
జ: ప్రాక్కల్పన

  

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌