• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్రబోధనా లక్ష్యాలు

1. హెర్బేరియం తయారీ అనేది
జ: సేకరించి భద్రపరిచే నైపుణ్యం

2. జీవశాస్త్ర సంఘంలో పాల్గొనడం ఏ రకమైన లక్ష్యం?
జ: అభిరుచి

3. శ్రీజ తీరికవేళల్లో బంకమట్టితో మూత్రపిండం నమూనాను తయారుచేసింది ఇది ఏ రకమైన లక్ష్యం?
జ: అభిరుచి

4. శ్రీకాంత్ బంకమట్టితో మూత్రపిండం నమూనాను చక్కగా, అందంగా తయారుచేయడం ఏ రకమైన లక్ష్యం?
జ: హస్తలాఘవ నైపుణ్యం

5. గ్లోబల్ వార్మింగ్ ఏర్పడటానికి గల కారణాన్ని రాము తెలియజేయడం ఏ రకమైన లక్ష్యం?
జ: వినియోగం

6. లక్ష్మికి సోడియం అని చెప్తే ఆమె తన నోట్‌బుక్‌లో 'Na' అని రాసుకుంది. దీనివల్ల నెరవేరిన లక్ష్యం?
జ: అవగాహన

7. తల్లిదండ్రుల రక్తవర్గాలను బట్టి పిల్లల రక్తవర్గాన్ని విద్యార్థి ఊహించడం అనేది?
జ: అవగాహన

 

8. జ్ఞాన రంగం యొక్క అంతిమ లక్ష్యం?
జ: మూల్యాంకనం

9. భావావేశ రంగం యొక్క అంతిమ లక్ష్యం?
జ: శీలస్థాపన

10. మానసిక చలనాత్మక రంగం యొక్క అంతిమ లక్ష్యం?
జ: స్వాభావీకరణ

11. సాంఘీకరణకు సంబంధించిన రంగం?
జ: భావావేశ రంగం

12. 'A' అనే విద్యార్థి కిరణజన్య సంయోగక్రియ నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. 'B' అనే విద్యార్థి కిరణజన్య సంయోగక్రియ జరిగే విధానాన్ని వివరించాడు. 'C' అనే విద్యార్థి దోమ లార్వా పటం గీసి భాగాలను గుర్తించాడు. 'D' అనే విద్యార్థి వివిధ వాహక జీవుల చిత్ర పటాలను సేకరించాడు. అయితే ఏ విద్యార్థిలో భావావేశ రంగం అభివృద్ధి చెందింది?
జ: D


13. దోమ జీవిత చరిత్ర నేర్చుకున్న విద్యార్థి వర్షాకాలంలో దోమతెరలను వాడితే అతడు సాధించిన లక్ష్యం?
జ: వినియోగం

14. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ వెలువడుతుంది అనే ప్రయోగానికి పరికరాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేస్తే విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
జ: హస్తలాఘవ నైపుణ్యం


15. దీర్ఘకాలిక పరిధి కలిగి, మొత్తం విద్యా కార్యక్రమానికి సంబంధించిన సూచనలిచ్చేవి?
జ: ఉద్దేశాలు, గమ్యాలు

16. 'ఉపాధ్యాయుడు బోధనలో భాగంగా లక్ష్యాలను ఉపయోగిస్తాడు కాబట్టి వీటిని బోధనా లక్ష్యాలు అని అంటారు' అనేది ఎవరి వర్గీకరణ?
జ: బ్లూమ్స్

17. 'శాస్త్రీయ వైఖరి కలిగిన జాతిగా అభివృద్ధి చేయాలి' అని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: 51 A (h)

18. విద్యార్థి 'Ca' ను కాల్షియంగా తర్జుమా చేసుకోవడం అనేది
జ: స్పష్టీకరణ

19. 'సత్యం ఎప్పుడూ మారదు'. సత్యం అంటే ఏమిటి అనేది అతడు సత్యాన్ని గురించి బాగా అవగాహన పొందిన తర్వాత మారవచ్చు అనే భావాన్ని నమ్మే వ్యక్తి దేన్ని కలిగి ఉంటాడు?
జ: శాస్త్రీయ వైఖరిని


20. 'సంశ్లేషణ - విశ్లేషణ' అనే అంశాలు భావావేశ రంగంలోని ఏ దశలో కనిపిస్తాయి?
జ: వ్యవస్థాపన

21. జ్యోతి అనే విద్యార్థిని ద్రవాభిసరణ ప్రయోగానికి పరికరాలను క్రమపద్ధతిలో అమర్చింది. ఈ పని ద్వారా ఆమెలో నెరవేరిన లక్ష్యం?
జ: హస్తలాఘవ నైపుణ్యం

 

22. తేజ అనే విద్యార్థిని మిత్ర కీటకాలకు ఉదాహరణలు ఇస్తే ఆమెలో నెరవేరిన లక్ష్యాలు?
జ: అవగాహన

23. సునీత అనే విద్యార్థిని అబ్దుల్ కలాం చేసిన సేవలను అభినందిస్తే ఆమెలో నెరవేరిన లక్ష్యం?
జ: అభినందన

24. దీనా అనే విద్యార్థి పోషకాహారం గురించి తెలుసుకోవడానికి N.I.N పరిశోధన సంస్థను సందర్శిస్తే ఆమెలో నెరవేరిన లక్ష్యం?
జ: అభిరుచి


25. ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎవరు... అనే ప్రశ్నలకు వచ్చే సమాధానం ఏ లక్ష్యానికి సంబంధించింది?
జ: జ్ఞానం

26. నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఏ రంగానికి చెందింది?
జ: జ్ఞాన రంగం


27. ఒక విషయాన్ని అంగీకరించడానికి లేదా నిరాకరించడానికి ఆధారం కోరితే అది ఏ లక్ష్యం?
జ: వైఖరి


28. కిందివాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందింది?
1) విశ్లేషణ     2) సంశ్లేషణ     3) అభిరుచి       4) సంయోగం
జ: 3(అభిరుచి)

 

29. విశాల భావాలు అనేవి ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణలు?
జ: వైఖరి

30. ఒక వస్తువు లేదా సంఘటన యొక్క అన్ని అంశాలను కలిపి పరిశీలించడాన్ని ఏమంటారు?
జ: సంశ్లేషణం

31. భావావేశ రంగం యొక్క అంతిమ లక్ష్యం?
జ: విలువలు పెంపొందించడం

32. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన కరికులమ్‌లోని 10 మౌలికాంశాల్లో విజ్ఞానశాస్త్రానికి సంబంధించింది?
జ: పర్యావరణ పరిరక్షణ, పరిమిత కుటుంబ భావన, శాస్త్రీయ వైఖరులు

33. 'కీటకాల్లో వక్రీభవనం' అనే పాఠ్యాంశాన్ని అభ్యసించిన విద్యార్థి కుంభాకార కటక నాభ్యంతరాన్ని ప్రయోగపూర్వకంగా కనుక్కున్నాడు. ఈ ప్రవర్తనా మార్పు ఏ బోధనా లక్ష్యానికి చెందింది?
జ: నైపుణ్యం

34. విద్యార్థి సరైన సాక్ష్యాలు లేనప్పుడు తన నిర్ణయాన్ని నిలిపివేస్తాడు అనే స్పష్టీకరణ యొక్క లక్ష్యం?
జ: శాస్త్రీయ వైఖరి

35. ఒక వ్యక్తి 'విందాం - నేర్చుకుందాం' అనే రేడియో కార్యక్రమంలో 'గాలి - ధర్మాలు' అనే పాఠం విన్నాడు. దీనివల్ల అతడిలో ఏ అనుభవం కలిగింది?
జ: పరోక్ష

 

36. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం కిందివాటిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది?
1) వ్యవస్థీకరణ     2) సమన్వయం     3) ప్రతిస్పందన      4) అన్వయం
జ: 2(సమన్వయం)

37. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతకు అడవుల నిర్మూలన ఒక కారణం అని చెప్తారు. ఇది కింది ఏ లక్ష్యానికి ఉదాహరణ?
1) జ్ఞానం      2) అవగాహన     3) వినియోగం      4) నైపుణ్యం
జ: 3(వినియోగం)

38. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వృక్ష, జంతు కణ నిర్మాణాన్ని బోధించిన తరువాత, M అనే విద్యార్థి వాటి నిర్మాణాన్ని తుచ తప్పకుండా అప్పజెప్పితే, P అనే విద్యార్థి వాటి మధ్య తేడాలు స్వయంగా తెలియజేశాడు. M, P విద్యార్థుల సాధన ఏ లక్ష్య స్థాయిలో ఉంటుంది?
జ: M జ్ఞానం - P అవగాహన

39. ఉద్దేశ సాధనలో ముఖ్యమైన ప్రథమ సోపానం?
జ: లక్ష్యం


రచయిత: రాధాకృష్ణ

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌