మాదిరి ప్రశ్నలు
1. ఒక తరగతికి సంబంధించి గణిత ఉపాధ్యాయుడు బోధించాల్సిన విషయాన్ని ఏ యూనిట్‌ను ఏ నెలలో, ఎంతమేరకు బోధించాలో తెలుసుకోవడానికి ఉపయోగపడే పథకం
జ: వార్షిక పథకం
2. బోధించాల్సిన యూనిట్లో విద్యార్థి ఏ దశలో ఉన్నాడో తెలుసుకుని, ఉపాధ్యాయుడు అక్కడి నుంచి ప్రారంభించడానికి వీలైతే అది యూనిట్‌లోని ఏ అంగాన్ని సూచిస్తుంది?
జ: నేపథ్యాన్ని కనుక్కోవడం
3. 'అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్' అని నిర్వచించినవారు
జ: ప్రెస్టన్
4. ప్రతి యూనిట్‌ను అర్థవంతమైన ఉపయూనిట్లుగా విభజించి, ఒక్కో ఉపయూనిట్ను పూర్తిచేయడానికి పట్టే కాలాన్ని నిర్ణయించినట్లయితే అది కిందివాటిలో దేన్ని సూచిస్తుంది?
1) వార్షిక పథకం 2) యూనిట్ పథకం 3) పాఠ్యపథకం 4) కాలనిర్ణయ పట్టిక
జ: 4 (కాలనిర్ణయ పట్టిక)
5. ఏ విద్యావేత్త సూచనల వల్ల పాఠ్యపథక రచన ఆవశ్యకత గుర్తింపు పొందింది?
1) బ్లూమ్స్ 2) బేకన్ 3) గిల్బర్ట్ 4) హెర్బార్ట్
జ: 4 (హెర్బార్ట్)
6. పాఠ్యపథకంలో 'పునర్విమర్శ' అనే సోపానం కింది ఏ కృత్యాలకు చెందుతుంది?
1) ప్రవేశ వ్యాసక్తులు
2) పర్యవసాన వ్యాసక్తులు
3) వికాస వ్యాసక్తులు
4) ఉన్ముఖీకరణ వ్యాసక్తులు
జ: 2 ( పర్యవసాన వ్యాసక్తులు)
7. 8వ తరగతి బోధించే గణిత ఉపాధ్యాయుడు ముందు తరగతిలోని పాఠ్యవిషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పూర్వ జ్ఞాన మూల్యాంకనం ద్వారా తెలుసుకున్నాడు. ఇది పాఠ్యపథక నమూనాలో ఏ దశను సూచిస్తుంది?
జ: ఉన్ముఖీకరణ వ్యాసక్తులు
8. హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో 4వ సోపానం ఏమిటి?
జ: సాధారణీకరణం
9. కిందివాటిలో సాధారణీకరణం కానిది
1)
2) వృత్తంలో వ్యాసార్ధాలన్నీ సమానం
3) సమాంతర రేఖల వాలులు సమానం
4) బేసి సంఖ్య, సరిసంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరిసంఖ్యయే.
జ: 1 ( )
10. మనదేశంలో బరోడాలోని ఏ సంస్థలో సూక్ష్మబోధనపై పరిశోధనలు జరిగాయి?
జ: CASE
11. విద్యార్థి ఒక విషయంపై నిర్వచనాలు, సూత్రాలు మొదలైన అంశాలను స్వయంగా అవగాహన
చేసుకోవడానికి ప్రయత్నించడం - హెర్బార్ట్ ప్రకారం పాఠ్యపథక రచన దశల్లో దేన్ని సూచిస్తుంది?
జ: సాధారణీకరణం
12. పాఠ్యపథకం వల్ల ప్రయోజనం
1) నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవచ్చు 2) పాఠ్యబోధన ఆసిక్తికరంగా ఉంటుంది
3) మూల్యాంకనం క్రమబద్ధంగా జరుగుతుంది 4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
13. 10వ తరగతి బోధించే గణిత ఉపాధ్యాయుడు 'రేఖాగణితం' అనే యూనిట్లో పైథాగరస్ సిద్ధాంతాన్ని బోధించిన తర్వాత దానిపై ఒక నియోజనాన్ని ఇచ్చాడు. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథక నమూనాలో ఏ దశను సూచిస్తుంది?
జ: పర్యవసాన వ్యాసక్తులు
14. కిందివాటిలో దీర్ఘకాలిక ప్రణాళిక
1) పాఠ్యపథకం 2) యూనిట్ పథకం 3) వార్షిక పథకం 4) పైవన్నీ
జ: 3 (వార్షిక పథకం)
15. పాఠ్యబోధనకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణయించి, ఆత్మస్థైర్యంతో బోధించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే పథకం
జ: పాఠ్యపథకం