మాదిరి ప్రశ్నలు
1. గుణశ్రేఢిలో సాధారణ పదాన్ని కనుక్కోవడానికి అనుసరించే బోధనా పద్ధతి ఏది?
జ: ఆగమన పద్ధతి
2. (am)n = amn అనే సంబంధాన్ని బోధించడానికి సరైన పద్ధతి ఏది?
జ: ఆగమన, నిగమన పద్ధతులు
3. అని నిరూపించడానికి అనువైన బోధనా పద్ధతి
జ: విశ్లేషణ పద్ధతి
4. a + b + c = 0 అయితే a3 + b3 + c3 = 3abc అని నిరూపించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు?
జ: సంశ్లేషణ
5. గణితం నేర్చుకోవడానికి అత్యంత సహజమైన అభ్యసన పద్ధతి
జ: ఆగమన పద్ధతి
6. అయితే అని నిరూపించడానికి ఉపయోగించే బోధనా పద్ధతి?
జ: సంశ్లేషణ
7. '9x2 - 16 ను కారణరాశులుగా విభజించు' అనే సమస్యను బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: నిగమన
8. కిందివాటిలో ఆగమన పద్ధతికి చెందిన గుణం
(i) తార్కిక పద్ధతి
(ii) ఆలోచన, పరిశీలన, ప్రయోగాత్మకత అభివృద్ధి చెందుతాయి.
(iii) ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది.
(iv) ఒక సూత్రం నుంచి మరో సూత్రాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది.
జ: i, ii, iii
9. ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన శాస్త్రవేత్త ఎవరు?
జ: పెస్టాలజీ
10. సంశ్లేషణ పద్ధతిలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది?
జ: జ్ఞాపకశక్తి
11. నిగమన పద్ధతికి చెందిన గుణం
(i) కాలాన్ని పొదుపు చేస్తుంది. (ii) గణనలో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది.
(iii) ఉపజ్ఞతను పెంపొందిస్తుంది. (iv) సంపూర్ణ అవగాహన పెరుగుతుంది.
జ: i, ii
12. గణిత గ్రంథ రచనల్లో ఉపయోగించే పద్ధతి
జ: సంశ్లేషణ
13. కిందివాటిలో 'విశ్లేషణ'కు చెందిన అంశాలేవి?
(i) ఇది ఒక ఆలోచనా ప్రక్రియ. (ii) సారాంశం నుంచి దత్తాంశం వరకు సాగుతుంది.
(iii) ఇది దీర్ఘ, మనోవైజ్ఞానిక పద్ధతి. (iv) సంపూర్ణ అవగాహన పెంపొందుతుంది.
జ: పైవన్నీ
14. 'శీర్షాభిముఖ కోణాలు సమానం' అని సాధారణీకరించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: ఆగమన
15. '(3x2)4 ను సూక్ష్మీకరించండి?' అనే సమస్యను బోధించడానికి సరైన బోధనా పద్ధతి
జ: నిగమన
16. జ్యామితీయ సిద్ధాంతాల నిరూపణలో ఏ బోధనా పద్ధతిని ఉపయోగిస్తారు?
జ: విశ్లేషణ
17. 1 + 3 = 4; 1 + 3 + 5 = 9; 1 + 3 + 5 + 7 = 16 ఉదాహరణల నుంచి 1 + 3 + 5 + ......... (n సంఖ్యలు) = n2 అనే సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: ఆగమన
18. అని రాబట్టడానికి సరైన బోధనా పద్ధతి ఏది?
జ: నిగమన
19. సంశ్లేషణా పద్ధతి పరిమితి
(i) సంపూర్ణ అవగాహన ఉండదు. (ii) విద్యార్థి సందేహాలు నివృత్తి కావు.
(iii) స్మృతికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. (iv) ఆవిష్కరణకు, ఆలోచనలకు అవకాశం లేదు.
జ: i, ii, iv
20. కిందివాటిలో 'సూత్రీకరణ పద్ధతి' ఏది?
1) ఆగమన 2) నిగమన 3) విశ్లేషణ 4) సంశ్లేషణ
జ: ఆగమన
21. అన్వేషణ పద్ధతికి మూలపురుషుడు ఎవరు?
జ: ఆర్మ్‌స్ట్రాంగ్
22. 'వనరులు ఎలా సేకరించాలి?' అనే విషయం ప్రాజెక్టు పద్ధతిలో ఏ సోపానాన్ని సూచిస్తుంది?
జ: పథక నిర్మాణం
23. విద్యార్థులు వారి స్థాయుల్లో ఒక పరిశోధకుడిగా, శాస్త్రజ్ఞుడిగా భావించుకునే గణిత బోధనా పద్ధతి ఏది?
జ: అన్వేషణ పద్ధతి
24. పునశ్చరణకు అవకాశం లేని పద్ధతి ఏది?
జ: ప్రాజెక్ట్ పద్ధతి
25. అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుంది?
1) స్నేహితుడిగా 2) మార్గదర్శకుడిగా 3) తత్త్వవేత్తగా 4) అన్నీ
జ: అన్నీ
26. విద్యార్థులతో గింజలను కుప్పలుగా పెట్టించి, ఒక్కో కుప్పలో గింజల సంఖ్య ఆధారంగా గుణకార పట్టికను తయారుచేయడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: అన్వేషణ
27. 'సమస్య పరిష్కారానికి ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకత్వం మాత్రమే చేస్తూ, సమస్య పరిష్కారం చేయకూడదు' అనే విధానాన్ని సూచించే బోధనా పద్ధతి ఏది?
జ: అన్వేషణ
28. విద్యార్థి కేంద్రంగా ఉండి, విషయాన్ని చేయడం ద్వారా నేర్చుకోవడం (అవగాహన, వినియోగం, నైపుణ్యాలను అప్రయత్నంగా విద్యార్థులకు కలిగించడం) అనే లక్షణం ఏ పద్ధతికి చెందుతుంది?
జ: ప్రకల్పన
29. 'ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయ పూర్వకమైన కృషి' అని నిర్వచించినదెవరు?
జ: కిల్పాట్రిక్
30. కిందివాటిలో ప్రాజెక్టు ఏది?
i. పాఠశాలలో కో-ఆపరేటివ్ బ్యాంకు నిర్వహించడం.
ii. ఒక ఇంటి నిర్మాణానికి పథకం, అంచనాను రూపొందించడం.
iii. త్రిభుజ వైశాల్యానికి సూత్రం రాబట్టడం.
iv. గ్రంథాలయాన్ని నిర్వహించడం.
జ: i, ii, iv
31. దత్త సమస్యలో తెలిసిన, కనుక్కోవాల్సిన అంశాల మధ్య ఉన్న ప్రాథమిక సంబంధాలను నిర్ణయించడంలో సహాయపడేలా పటం రూపంలో విద్యార్థికి సమస్యను అందచేయడం అనేది ఏ సమస్యా పరిష్కార పద్ధతి?
జ: రేఖాచిత్ర పద్ధతి
32. మనోవిజ్ఞానశాస్త్ర అభ్యసనా సూత్రాలపై ఆధారపడిన పద్ధతి?
జ: ప్రకల్పనా పద్ధతి
33. గణిత ఉపాధ్యాయుడు స్నేహితుడు, నాయకుడిగా ఉండే బోధనా పద్ధతి?
జ: ప్రయోగశాల
34. రాంబస్ (సమచతుర్భుజ) లక్షణాలను అన్వేషించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: అన్వేషణ
35. సమస్యా పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం ఏది?
జ: సమస్యను గుర్తించడం
36. శంకువు ఘనపరిమాణం ఘ.యూ. అని నిరూపించడానికి అనువైన బోధనా పద్ధతి?
జ: ప్రయోగశాల
37. కిందివాటిలో కిల్పాట్రిక్ ప్రకారం ప్రాజెక్ట్ కానిది-
1) ఉత్పత్తిదారుల ప్రాజెక్ట్ 2) వినియోగదారుల ప్రాజెక్ట్
3) మేధోసంబంధమైన ప్రాజెక్ట్ 4) సమస్యా ప్రాజెక్ట్
జ: మేధోసంబంధమైన ప్రాజెక్ట్
38. కఠినంగా ఉండే రాత సమస్యకు సదృశంగా తేలికైన మౌఖిక సమస్య ఇచ్చి, ఆ సాధనా విధానాన్ని క్లిష్ట సమస్యకు అన్వయించి, తద్వారా దత్త సమస్యను పరిష్కరించే సమస్యా పరిష్కార పద్ధతి
జ: సాదృశ్యాల
39. కిందివాటిలో ప్రకల్పనా పద్ధతికి చెందిన గుణం
i. లక్ష్యాధారంగా ఉంటుంది.
ii. ప్రణాళికాబద్ధంగా ఉంటుంది.
iii. పనిచేస్తూ నేర్చుకోవడం అనే సూత్రం ఇమిడి ఉంటుంది.
iv. గణితతత్త్వాన్ని ప్రతిబింబిస్తుంది.
జ: i, ii, iii
40. సమస్యా పరిష్కార పద్ధతికి చెందిన గుణం
i. విద్యార్థుల్లో పరిశోధనా చైతన్యం ఏర్పడుతుంది.
ii. విద్యార్థుల్లో ఉన్నత ఆలోచనల అభివృద్ధికి దోహదపడుతుంది.
iii. పట్టుదల, ఆత్మవిశ్వాసం, సహనం లాంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
iv. స్వయం అభ్యసనకు దోహదపడుతుంది.
జ: ii, iii, iv