• facebook
  • whatsapp
  • telegram

భౌతిక, రసాయన శాస్త్రా ల బోధనా ఉపగమాలు, బోధనా పద్ధతులు

* ఉపగమాలను రెండు రకాలుగా వర్గీకరించారు. 
అవి: 1) ఆగమన ఉపగమం
     2) నిగమన ఉపగమం

 

ఆగమన ఉపగమం
* సూత్రాలు, సత్యాలను రాబట్టే విధానాన్ని ఆగమన ఉపగమం అంటారు.
* దీనిలో తగినన్ని ఉదాహరణలను పరిశీలించి ఒక సూత్రాన్ని లేదా సామాన్యీకరణాన్ని రాబడతారు.

 

సూత్రాలు:
* ఉదాహరణల నుంచి సామాన్యీకరణం
* ప్రత్యేకాంశం నుంచి సామాన్యీకరణం

 

ప్రయోజనాలు:
* శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చెందుతుంది.
* అభ్యసన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.
* తార్కిక శక్తికి అవకాశం ఉంటుంది.

 

నష్టాలు:
* బోధనకు ఎక్కువ సమయం పడుతుంది.
* దీని ద్వారా అన్ని విషయాలను బోధించలేకపోవడం.

 

నిగమన ఉపగమం
* సూత్రం సహాయంతో తగినన్ని ఉదాహరణలు ఇవ్వడం.
* నిగమన ఉపగమంకు ఆద్యుడు 'అరిస్టాటిల్'.

 

సూత్రాలు:
* సామాన్యీకరణం నుంచి ఉదాహరణలకు వెళ్లడం.
* సామాన్యీకరణం నుంచి ప్రత్యేకాంశానికి వెళ్లడం.
* అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు వెళ్లడం.

 

ప్రయోజనాలు:
* సమయాన్ని పొదుపు చేయడం.
* సమస్య సాధనకు అనువైంది.
* ఉపాధ్యాయుడికి పనిభారాన్ని తగ్గిస్తుంది.

 

నష్టాలు:
* శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చెందదు.
* తార్కిక శక్తికి అవకాశం లేదు.
* 'పద్ధతి' అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. పద్ధతి అంటే 'విధం' లేదా 'మార్గం' అని అర్థం.
* ఉపాధ్యాయుడు పాఠాన్ని వివరించడమే 'బోధనాపద్ధతి'.
* ఉపాధ్యాయ కేంద్ర పద్ధతుల్లో 'ఉపాధ్యాయుడు' ముఖ్యపాత్రను పోషిస్తాడు.
* విద్యార్థి కేంద్రక పద్ధతులు 'చేస్తూ నేర్చుకోవడం' లేదా 'ఆచరణ ద్వారా అభ్యసనం' అనే అంశాల ఆధారంగా ఉంటాయి.

 

బోధనా పద్ధతులను రెండు రకాలుగా వర్గీకరించారు


* పాఠ్యాంశ స్వభావం, విద్యార్థి స్వభావం, తరగతి గది పరిసరం, వాతావరణం వీటిని బట్టి బోధనా పద్ధతులను ఎన్నుకోవాలి.

 

ఉపన్యాస పద్ధతి (కథా పద్ధతి)
* విషయాన్ని ముఖతః బోధించే పద్ధతి
* అత్యంత ప్రాచీనమైంది
* పొదుపు పద్ధతి

 

సోపానాలు:
* ప్రణాళికా దశ
* విషయ సమర్పణ దశ
* మూల్యాంకన దశ

 

ఉపయోగించే సందర్భాలు:
* తక్కువ కాలవ్యవధిలో అనేక విషయాలను తెలియజేయడానికి
* కఠిన భావనలు, అంశాలు, సిద్ధాంతాలను చెప్పడానికి
* సిలబస్‌ను త్వరగా పూర్తి చేయడానికి
* యూనిట్ పూర్తయిన తర్వాత పునశ్చరణ చేయడానికి
* కొత్త యూనిట్/పాఠం ప్రారంభించడానికి

 

పరిమితులు:
* నైపుణ్యాలు అభివృద్ధి చెందవు.
* శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఉండదు.

 

ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
* ఉపన్యాసం, ప్రదర్శనలను మేళవించి బోధించే పద్ధతి. ప్రదర్శన అంటే చేసి చూపించడం. ఒక విషయాన్ని లేదా భావనను ప్రయోగం ద్వారా చేసి చూపించే ప్రక్రియ.
* శాస్త్ర బోధన ఆసక్తికరంగా, అర్థవంతంగా, వైవిధ్యంగా చేయడానికి ఉపయోగపడే మంచి బోధనా పద్ధతి.
* సిద్ధాంతానికి, ఆచరణకు మంచి సంబంధాన్ని ఏర్పరిచే పద్ధతి.

 

సోపానాలు:
* పాఠ్యపథక రచన, తయారీ
* పాఠ్యభాగాన్ని పరిచయం చేయడం
* పాఠ్య విషయాలను ప్రవేశపెట్టడం
* ప్రయోగ నిర్వహణ
* బ్లాక్‌బోర్డు పని
* పర్యవేక్షణ

 

ఉపయోగించే సందర్భాలు:
* సమస్యను సృష్టించడానికి
* భావనలు/విషయాలను వివరించడానికి
* పద్ధతులు, విధానాలను చూపడానికి
* పరికరాల నిర్మాణం, పనిచేసే విధానం
* ప్రయోగశాల నైపుణ్యాలను ప్రదర్శించడం

 

ప్రయోజనాలు:
* 'మూర్త స్థితి నుంచి అమూర్త స్థితికి' అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది.
* కాలాన్ని పొదుపు చేస్తుంది.
* తక్కువ వ్యయం అవుతుంది.

 

పరిమితులు:
* ఆచరణ ద్వారా అభ్యసనం సాధ్యం కాదు.
* నైపుణ్యాలను పెంపొందించలేరు.
* శిశుకేంద్ర పద్ధతి కాదు.

 

చారిత్రాత్మక పద్ధతి
* అంశాన్నైనా దాని పుట్టుపూర్వోత్తరాలతో ప్రారంభించి ఆ అంశం పరిణామం చెందిన రీతిని బోధిస్తూ ప్రస్తుత పరిస్థితిని తెలియజేసే బోధనా పద్ధతి.
* ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అత్యంత ఉపయుక్తమైంది.
» శాస్త్రాన్ని చారిత్రక అభివృద్ధి మార్గంలో అందించేదే 'చారిత్రాత్మక పద్ధతి'.

 

ఉపయోగించే పద్ధతులు

ఉపన్యాస పద్ధతి: శాస్త్రవేత్తల జీవిత అనుభవాల ద్వారా వారు కనుక్కున్న విషయాల గురించి చెప్పడం.
జీవిత చరిత్ర పద్ధతి: ఫారడే, రూథర్‌ఫర్డ్, ఐన్‌స్టీన్ లాంటివారి జీవిత చరిత్రలను తెలుసుకోవడం. శాస్త్రజ్ఞుల పట్ల గౌరవం పెంపొందేలా చెప్పడం.
పరిణామ పద్ధతి: వివిధ సిద్ధాంతాలు అవి పరిణామం చెందిన విధానంలో అమర్చి బోధిస్తూ, సమగ్రమైన అవగాహన కలిగేలా చెప్పడం.
సాంఘిక పద్ధతి: మానవ జీవనశైలిని, గతిని మారుస్తున్న ఎన్నో నూతన పరిశోధనలు, ఆవిష్కరణల గురించి తెలియజేస్తూ శాస్త్రానికి, సమాజానికి మధ్య ఉండే సంబంధాన్ని బోధించడం.

 

ప్రయోజనాలు:
* శాస్త్ర పరిశోధన అనేది విశ్లేషణ, శాస్త్రజ్ఞుల వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది.
* శాస్త్రవేత్తల పట్ల గౌరవంతో మానవాళికి చేసిన కృషిని అభినందిస్తారు.

 

పరిమితులు:
* ఎక్కువ మోతాదులో అందిస్తే సిలబస్ పూర్తిచేయడం కష్టం.
* ప్రయోగాలు చేయడంలో నైపుణ్యాలు పెంపొందించలేం.

 

అన్వేషణ పద్ధతి/హ్యూరిస్టిక్ పద్ధతి
* ఇది ఉపన్యాస పద్ధతికి వ్యతిరేకమైంది.
* విద్యార్థినిని క్రియాత్మకంగా మార్చే పద్ధతి.
* 'విద్యార్థులు శాస్త్రీయ విషయాలను ఇతరుల నుంచి తెలుసుకోవడానికి బదులు పరిశోధకుడి దృక్పథంలో తమకు తామే పరిశోధించి తెలుసుకునే పద్ధతి' - హెచ్.ఇ. ఆర్మ్‌స్ట్రాంగ్
* ఈ పద్ధతిలో శిక్షణ ఇవ్వడమే ముఖ్య లక్ష్యం.
* జ్ఞానార్జనను ద్వితీయ లక్ష్యంగా పరిగణిస్తారు.
* శాస్త్రం అంటే 'చేయడం' అనే సూత్రానికి అనుగుణంగా ఉంటుందని చెప్పే పద్ధతి.

 

సోపానాలు:
* సమస్య ప్రతిపాదన
* సమస్యను పరిశీలించడానికి ఉపాధ్యాయుడి సహకారం
* పరికల్పన చేయడం
* పరికల్పన నిరూపణ
* వాస్తవాల సామాన్యీకరణ
* అన్వయం

 

ఉపాధ్యాయుడి పాత్ర
* ఉపాధ్యాయుడు చదివే అలవాటు కలిగి ఉండి, చదవాల్సిన పుస్తకాలను సూచించాలి.
* మార్గదర్శకుడిగా, పనిలో భాగస్వామిగా మంచి శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి.

 

ప్రయోజనాలు:
* శిశు కేంద్ర పద్ధతి.
* ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందుతారు.
* శాస్త్రీయ ప్రక్రియలకు ప్రాముఖ్యాన్ని ఇస్తుంది.
* శిక్షణ శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది.

 

పరిమితులు:
* ఈ పద్ధతిలో టైంటేబుల్‌ను తయారుచేయలేం.
* మొత్తం పాఠ్యాంశాలను బోధించలేరు.
* ఎక్కువ విద్యార్థులున్న తరగతిలో ఈ పద్ధతి ఆచరణ సాధ్యం కాదు.

 

ప్రాజెక్టు పద్ధతి/ప్రకల్పన పద్ధతి
* దీన్ని ఉద్యమ పద్ధతి, ఎత్తుగడ పద్ధతి అని కూడా అంటారు.
* ఈ పద్ధతిని జాన్‌డ్యూయి ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదంపై రూపొందించారు.
* 'సహ సంబంధం' అనే భావనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన పద్ధతి.
* అయత్న సిద్ధ బోధన దీని ముఖ్య ఉద్దేశం.
* 'అనువైన సహజ పరిసరాల్లో పూర్తిచేసే సమస్యాకృత్యమే ప్రకల్పన' - స్టీవెన్‌సన్
* 'పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన' - బెల్లార్డ్

 

సోపానాలు:
* పరిస్థితిని కల్పించడం
* ప్రాజెక్టును ఎన్నుకొని లక్ష్యాన్ని వివరించడం
* ప్రణాళిక
* నిర్వహణ/అమలుచేయడం
* మూల్యాంకనం
* నివేదిక తయారుచేయడం

 

ప్రయోజనాలు:
* థార్న్‌డైక్ ముఖ్య సూత్రాలైన సంసిద్ధతా నియమం, అభ్యసనా సూత్రం, ఫలిత సూత్రాలను కలిగి ఉంటుంది.
* దీనిలో ఆచరణ ద్వారా అభ్యసనం, శాస్త్రం అంటే చేయడం, జీవిస్తూ అభ్యసించడం అనే ముఖ్యసూత్రాల గురించి తెలుసుకుంటారు.

 

ప్రయోగశాల పద్ధతి
* ప్రయోగశాలలో స్వయంగా ప్రయోగాన్ని చేస్తూ, పాఠ్యాంశాలను నేర్చుకునే పద్ధతినే 'ప్రయోగశాల పద్ధతి' అంటారు.
* సహాక్షక పద్ధతి, సమూహక పద్ధతి, భ్రమణ పద్ధతుల ద్వారా ప్రయోగశాల పద్ధతిని నిర్వహిస్తారు.

 

ప్రయోగాల రకాలు:
* శాస్త్రీయ సూత్రాలను ఉదహరించడానికి చేసే ప్రయోగాలు.
ఉదా: బెర్నౌలీ సూత్రం
* సంఖ్యా ఫలితాలను తెలిపే ప్రయోగాలు.
ఉదా: వెర్నియర్ కాలిపర్స్
* ఉత్పత్తి చేసే ప్రయోగాలు.
ఉదా: వాయువుల ఉత్పత్తి ప్రయోగాలు
* అన్వేషణ స్వభావం గల ప్రయోగాలు.

 

సోపానాలు:
* ఉపాధ్యాయుడి సంసిద్ధత
* విద్యార్థుల సంసిద్ధత
* ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడం
* సాధారణీకరణను నిర్ధారణ చేయడం

 

ప్రయోజనాలు:
* ప్రయోగం చేయడం ద్వారా అభ్యసనాన్ని పెంపొందిస్తుంది.
* భావనలు, సూత్రాలను పరిశీలించి నిరూపిస్తారు.

 

పరిమితులు:
* ఎక్కువ పరికరాలు, సదుపాయాలు ఉండే ప్రయోగశాల అవసరం.
* ఖరీదైన పద్ధతి.
* విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండాలి.

 

సమస్యా పరిష్కార పద్ధతి
* విద్యార్థుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, మేధస్సును పెంపొందించడానికి సమగ్రమైన పద్ధతి.
* ఈ పద్ధతి విజయం 'జ్ఞానం'తో ముడిపడి ఉంటుంది.
* దీనిలో ఆగమన, నిగమన పద్ధతులను సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవాలి.

 

సోపానాలు:
* సమస్యను గుర్తించడం
* సమస్యను నిర్వచించడం
* సమస్యను విశ్లేషించడం
* ప్రకల్పనను రూపొందించడం
* ప్రకల్పన నిరూపణ
* ముగింపు

 

ప్రయోజనాలు:
* విద్యార్థుల్లో ఆలోచనా తర్కాన్ని, వాదాన్ని పెంపొందిస్తుంది.
* మంచి సాంఘిక విలువలు పెంపొందుతాయి.

 

పరిమితులు:
* సిలబస్ పూర్తికాదు.
* తెలివైన విద్యార్థులకే అనుకూలంగా ఉంటుంది.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌